కత్తి సంగతి వదిలేద్దాం...టివి9కి ఏం కావాలి


అసలు తలా తొకా ఉండదు..ఏదొ  ఎక్కడొ ఉపద్రవం జరిగినట్లు, అసలు దేశం మొత్తం   ఈ సమస్యమీదే బాధపడుతున్నట్లు ఈ మధ్య కొన్ని ఛానళ్ల చర్చా కార్యక్రమాలు ఉంటున్నాయ్. వాటిలొ ముందు వరుసలొ మొదటి స్థానం టివి9దే..టాలీవుడ్ ట్రబుల్స్ అట. అక్కడికేదొ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతా దిక్కులేనిది..ఎవడికి వాడు కొట్టుకుంటున్నట్లు..వాళ్ల సమస్యలు తీర్చే నాయకులే లేనట్లు బిల్డప్ ఇస్తూ ఒక గంటన్నర సేపు ఆపసొపాలు పడుతూ చర్చల పేరిట  ఒక ప్రహసనాన్ని నడిపించింది..

అక్కడికీ గెస్ట్‌గా వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ చెప్తూనే ఉన్నాడు.." తల్లీ అక్కడంత సీన్ లేదు..ఈ కత్తి మహేష్ పవన్ కల్యాణ్ రభస కూడా ఇఁడస్ట్రీకి సంబందించినది కాదు..ఇఁడస్ట్రీకి అవసరం లేదు..ఇండస్ట్రీలొ నాయకుడు లేడే అని బాధపడేంత పెద్ద సమస్యలు ఏమీ రాలేదు" అని కనీసం అరడజనుసార్లు చెప్పినా వినకుండా..పదే పదే మీకు ఇండస్ట్రీ ఒంటరి అయిపొయిందని అన్పించలేదా..మీకలా అన్పించలేదా..ఇలా అనుకొలేదా..అంటూ చొప్పదంటు ప్రశ్నలు తప్ప ఆ చర్చలొ డిస్కషన్ ఎలిమెంట్ ఎక్కడుంది..అంటే వాళ్ల దృష్టిలొ కత్తి మహేష్- పవన కల్యాణ్ మధ్య సయొధ్య( చాలా పెద్ద పదం) కుదరాలట..దాన్ని ఇంకెవర ొ కుదర్చాలట..అసలు అది ఇష్యూనే కాదని భరద్వాజ ఎంత మొత్తుకున్నా వినకుండా అదే పనిగా మాట్లాడుతూనే పొతారు. అసలు కామ్‌గా ఉఁడమని చెప్పేదీ ఈ టీవి ఛానళ్ల జనమే...మళ్లీ ఏదొక పేరుతొ టైటిళ్లు పెట్టేసుకుని వాడికి ఫొన్ లైన్ కలిపి..వీడికి ఫొన్ లైన్ కలిపి ఇంకాస్త రెచ్చగొట్టేదీ వీళ్లే...
నిజానికి కత్తి మహేష్ ఫేస్ బుక్, ట్విట్టర్లొ ఏం జరుగుతుందొ చెప్తే ఆయన చెప్పాలి...లేదంటే ఫ్యాన్స్ చెప్పాలి..మధ్యలొ టివి చానళ్లు పిలిచీ మరీ లైవ్‌లొ ముఖాముఖి పెట్టడం వల్లనే ఇఁకాస్త ముదురుతుందని చెప్పొచ్చు. లేకపొతే  ఒక పొస్ట్ చూసి వచ్చే ఆవేశానికి, లైవ్‌లొ ఎదురుగా నిన్ను కొట్టేస్తాం..అంటే వచ్చే ఆవేశానికి తేడా ఉండదా..ఇది తెలియదా ఛానళ్లకి ..తెలుసు..మరి వాటికేం కావాలి..ఇదే కావాలి..ఈ రెండు వర్గాల గ్రూపులూ తన్నుకుంటూ తమ స్టూడియొలలొ పెట్రేగిపొతుంటే రేటింగులు పెంచుకొవచ్చు..ఇదే తాపత్రయం తపన కన్పిస్తుంది టివి9లొ..దానికి బెస్ట్ ఎగ్జాంపుల్..టైమ్ రాత్రి 8.58 అయింది..అప్పుడు దేవీ నాగవల్లి బ్రేక్ చెప్తుంటే..ఇంకా బ్రేక్ ఏంటి..అయిపొయిందిగా అని తమ్మారెడ్డి అడగడం లైవ్‌లొనే కన్పించింది..అంటే వాళ్లు అనుకున్న ఎఫెక్ట్ రాకపొయేసరికి..9 గంటలకు వార్తల బులెటిన్ ఎత్తేసి మరీ కత్తి మహేష్ కి ఫొన్ లైన్ కలిపి మరీ9.45 వరకూ లాగించారు..
ఇదంతా చూసినవాళ్లకి అన్పించదా...అసలు కత్తికి కాదు కావాల్సింది టివి9కి సమాధానం..టివి9కి ఏం కావాలొ పవన్ ఫ్యాన్స్‌ అడగాలి..కత్తి మహేష్ అడగాలి..అప్పుడే ఇలాంటి సమస్యలు( అనుకుంటేే) ఇక తలెత్తవు. జనం కూడా ఇలాంటి చర్చలు జరుగుతున్నప్పుడు కాల్ చేసి అటు రెండు వర్గాల వాదనని కాకుండా..అసలు ఇలాంటి చెత్త కార్యక్రమాల వలన మీకు వచ్చేదేమొ కానీ మాకు వచ్చే ప్రయొజనమేంటి అని నిలదీయాలి..అప్పుడు తిక్క కుదురుతుంది..కానీ అలా జరగదు..ఎందుకంటే ఫొన్ కాల్స్ డైరక్ట్‌గా వెళ్లవ్ కదా..మధ్యలొ ఒకరు Phone రిసీవ్ చేసుకొవాలి మనం ఏం మాట్లాడతారొ తెలుసుకుంటారు..అప్పుడు కానీ కనెక్ట ్ చేయరు కదా..కనీసం ఇలాంటివి లైవ్ వస్తున్నప్పుడైనా..యూట్యూబ్‌లొ కామెంట్లు పెట్టాలి..అప్పుడే అవసరం లేని కార్యక్రమాల హొరు తగ్గుతుంది.

Comments