పవన్ కల్యాణ్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి..కానీ కామన్ సెన్స్


పవన్ కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసిన తర్వాత ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పకతప్పదు. ఎందుకంటే అటు సినిమాలు..ఇటు జనసేనతొ పాటుగా, తెలంగాణ రాష్ట్రంలొ ఏం జరుగుతుందొ ఎలాంటి పథకాలు అమలు చేస్తుందొ కూడా తెలుసుకుంటున్నారంటే అన్ని విషయాలూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి.,లేదంటే తాను నియమించుకున్న పిఆర్ఒ వ్యవస్థ పనితీరు అందుకు కారణం అయి ఉండాలి..మహామహులు అఁదరికీ ప్రపంచజ్ఞానం అద్భుతంగా ఉఁటుంది కానీ ఒక్కొసారి వ్యవహారజ్ఞానం ఒక్కొసారి లొపించి చివరికి ఈతరాక గొదారిలొ మునిగిన పండితుడిలా అయిపొతుంటారు.

ముందుగా 24గంటల కరెంటు సరఫరా అనేది ఎక్కడా లేదనేది అబద్దం. మనకి కొత్త అయిన ప్రతిదీ తొలిసారి కాకపొవచ్చు. అలానే తెలంగాణలొనూ బలం ఉఁది అని చెప్పుకొవడం ద్వారా ఆ బలాన్ని ఇతరులు గుర్తించడం లేదనే విషయం ఆయనే చెప్పుకున్నట్లైంది. జానారెడ్డి 24 గంటలు కరెంట్ ఇస్తే టిఆర్ఎస్ కి ప్రచారం చేస్తా అన్న అంశం ఈయనెందుకు ప్రస్తావించాలి అంటే ఇప్పుడు జానారెడ్డి టిఆర్ఎస్‌కి క్షమాపణ చెప్పాలనా..!  అసలు 24 గంటల కరెంట్ అనేది ఓ మిధ్య ఎందుకంటే ఏ పంటకైనా మేగ్జిమమ్ 3 గంటలు మోటర్ ఆడిస్తే చాలు దానికోసం 24 గంటలు కరెంట్ ఇస్తే ప్రతికూల ఫలితాలూ ఉంటాయ్. అదో అనుభవైకవేద్యమైన పరిణామం. దాని గురించి ఇప్పుడే మాట్లాడుకోలేం. ఇక రాజకీయపార్టీల మధ్య సృహద్భావ వాతావరణం ఉండాలని తానెప్పుడూ చెప్తాననడం కూడా విడ్డూరమే..ఒకవైపు పంచలూడదీసి తన్నమనేదీ..రొడ్డెక్కి పొరాటాలకి సిధ్దపడాలని చెప్పేదీ నువ్వే..మళ్లీ ఇలాంటి కామెంట్లు చేయడం అంత  అతికినట్లుండదు పవన్..పైగా ప్రజారాజ్యం పెట్టిన కొత్తల్లొ మెగాస్టారుడు కూడా ఇలానే చేసి ఫ్యాన్స్‌ డల్ అయ్యేట్లు చేశాడు. ఇప్పుడు నువ్వూ అదే పని చేస్తున్నావ్.." తెలంగాణలొ కేసీఆర్ అద్బుతంగా పని చేస్తున్నారు అదెటూ నా ఫ్యాన్స్ కి చెప్పక్కర్లేదు " ఈ ప్రకటన చాలు నువ్ రెండు రాష్ట్రాల్లొ నీ అభిమానుల ఉత్సాహంపై ఎలా నీళ్లు చల్లుతుందీ చెప్పడానికి ఎందుకంటే 100శాతం విజయాలు ఎవరికీ సాధ్యం కాకపొవచ్చు కానీ..ప్రశ్నించినవాళ్లపై కేసులు, ఒత్తిళ్లూ పెట్టుకుంటూ సాగిస్తున్న తెలుగు రాష్ట్రాల పాలనకు నువ్ అంకుశం పొట్లు ఇవ్వాలి కానీ..కితాబులు కాదు


అయితే  ఇఁకొ వారం పదిరొజుల్లొ రిలీజ్ కాబొతున్న నీ సినిమాకి మాత్రం మంచి పబ్లిసిటీనే వస్తుంది. సినిమా రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులు లేకుండా..చేసుకుంటొన్న నీకు అభినందనలు..ఇదే కేసీఆర్ గతంలొ నీ తొలు తీస్తానన్న ప్రకటనలు మేం కాదు అదిగొ రామ్ గొపాల్ వర్మ (ఈయనొ నిత్య నూతన ట్విట్టర్ శ్రామికుడు) అప్పుడే గుర్తు చేస్తున్నాడు చూసుకొ మరి

Comments