వర్మనీ చంపేస్తారామూవీ రిలీజైన తర్వాత ఖచ్చితంగా రెండు ఎక్స్‌పెక్ట్ చేసాం..ఒకటి మహేష్ రివ్యూ..రెండొది వర్మ కామెంట్..ఈ రెండూ జరిగిపొయాయ్..ఇక ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌కి చేతినిండా పని..ఎడా పెడా తమ హీరొని నచ్చని..సినిమాని మెచ్చని వారిపై అదే పనిగా దాడి చేస్తూ  ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి వీర అభిమానులు అని చెప్పుకుంటున్నవారే ఈ సినిమాని రికమండ్ చేయడం లేదు. ఇలాంటి సిినిమా తీసినందుకు నిర్మాత దర్శకులు సహా హీరొని కూడా తిట్టుకుంటున్నారు. అలాంటిది వర్మలాంటి ఫ్రీకీ గై పొగుడుతారని ఎఁదుకు ఆశిస్తారు.
పైగా ఫ్యాన్స్ మెదడులొ గుజ్జు లేనట్లుగా, అక్కడికేదొ సినిమా బీభత్సమైన  రికార్డులు క్రియేట్ చేసే సినిమాలాగా బిల్డప్స్ ఇవ్వడం దారుణం. ఇప్పటికే రిజర్వ్ చేసుకున్న టిక్కెట్లను తిరిగి అమ్ముకొలేక,  అలా అని చూడలేక చాలామంది జనరల్ goers ఇబ్బందులు పడుతున్నారు కూడా

అసలు రివ్యూలే  ఒక ప్రహసనం అనుకుంటే..ఇంకా వాటిపై రివ్యూలు ఇంకా కామెడీ అదే చేస్తున్నాడు హైపర్ ఆది. ఇతగాడి ఛండాలమైన కామెడీ చూడలేక చస్తుంటే అటు నాగబాబు ప్రాపకం కొసం నాలుగు సినిమాలు వస్తాయనే ఆశతొ పవన్ కి భజన  మొదలుపెట్టాడితగాడు..ఈయనకి వంతగా ఫృథ్వీరాజ్ కూడా తయారయ్యాడు
ఒక సినిమా బావున్నది లేనిదీ జనమే తేల్చుతారు. రివ్యూలకి పవర్ ఉందొ లేదొ అందరికీ తెలుసు..అది ఉండబట్టే..ఇవాళ సదరు కత్తికి అంత విమర్శలు..మెచ్చుకొళ్లు వస్తున్నాయ్. ఇక వర్మ సంగతే చూస్తే ఆయన అప్పటికప్పుడు ఏది అన్పిస్తే అది పెట్టేస్తాడు . అంతేకానీ టివి9లొ చెప్పుకున్నట్లు నిన్న పొగిడాడు..ఇవాళ గాలి తీశాడు అనడం కరెక్ట్ కాదు..రాజకీయాల్లొ పవన్ స్టాండ్‌పై ఆయన ఫాలొయింగ్ చూసి మైండ్ బ్లొయింగ్ అని ఉంటాడు..సినిమా బాలేదు కనుక కొరలు లేని పులి అని అంటాడు..ఇందులొ తప్పు ఏం ఉంది. ఎవరి అభిప్రాయం వారిది. విమర్శ దండనార్హం..చట్టరీత్యా వ్యతిరేకం అయినప్పుడు మాత్రమే ఎవరిపై కామెంట్ చేయొద్దని రూల్ పాస్ చేయవచ్చు . అప్పటిదాకా ఎవరి ఫ్యాన్స్ అయినా అన్నీ క్లొజ్ చేసుకొవాలి. లేదంటే ఎదురు కామెంట్లు పెట్టుకుంటూ ఆనందించే అవకాశం కలదు.


Comments