కోర్టులు వదిలినా సల్మాన్‌ని వీళ్లొదలరట


ఎప్పుడో 20 ఏళ్ల నాటి కేసు..కోర్టులు మాత్రం ఎప్పటికప్పుడు సల్మాన్ ఖాన్‌కి ఒకసారి బెయిల్..ఒకసారి శిక్ష విధిస్తూ దోబూచులాడుతున్నాయ్. ఐతే ఓ వ్యక్తి మాత్రం సల్మాన్‌ఖాన్‌కి శిక్ష తాను వేస్తానని..జోథ్ పూర్‌లోనే చంపేస్తానంటూ హడావుడి చేస్తున్నాడు. ఇదంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదని అనుకోవచ్చు కానీ..ముంబైలో మాత్రం పరిస్థితి అలా లేదు. ఆల్రెడీ లారెన్స్ బిష్ణోయ్ అనే ఓ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్‌ ఇలా బెదిరింపుకి దిగినట్లు తెలుస్తోంది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అంటున్నా అలాంటిదేం లేదని రేస్3 సినిమా యూనిట్, లోకల్ పోలీసులు చెప్తున్నారు. 

ప్రస్తుతం రేస్ 3 సినిమా షూటింగ్‌లో ఉన్న సల్మాన్‌ని" నేను చంపి తీరుతా..ఇక్కడే జోథ్ పూర్‌లోనే చంపుతా" అంటూ వార్నింగిచ్చాడు. ఈ 
సంఘటన జరిగి మూడు రోజులు అయింది. బైటికి చెప్పడం లేదు కానీ సల్మాన్ ఖాన్‌దాన్ ఈ విషయంపై చాలా తర్జనభర్జనలు పడుతున్నారుట
ఎందుకంటే బిష్ణోయ్‌పై మారణాయుధాల రవాణా, అటెంప్టివ్ మర్డర్, కిడ్నాపులు వగైరా 20కేసులు ఉన్నాయి. 2015లో ఇతనిని ఓ కేసులో 
అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఆ విచారణ జరుగుతోంది. ఇక్కడే మీడియాతో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్‌ని మర్డర్ చేసి తీరుతా అని చెప్పాడట
ఇతనికీ సల్మాన్‌ఖాన్‌కీ తేడా ఎక్కడొచ్చిందంటే అదే పైన చెప్పిన 20 ఏళ్ల నాటి కేసు విషయంలోనే.

1998లో హమ్ సాథ్ సాథ్ హై సినిమా షూటింగ్ సమయంలో జోథ్ పూర్ అడవుల్లో ఈ హీరోగారు మరో హీరో సైఫ్, హీరోయిన్లు సోనాలి బెంద్రే,  సహా
పలువురితో కలిసి వేటకి బైల్దేరారు..అక్కడ ఈయనగారి ప్రతాపం ఏ పులుల మీదో కాకుండా...మనిషి కన్పిస్తేనే పారిపోయే జింకలపైన చూపించాడు
అక్కడ అడవి కృష్ణ జింకలకు ప్రసిద్ది..వాటిని బిష్ణోయ్ అని కూడా అంటారు. ఈ జాతి జింకలను లోకల్ తెగలైన బిష్ణోయ్ జాతి దేవతల్లా ఆరాధిస్తుంటుంది
ఈ తెగవారికి కాస్త సెంటిమెంట్ ఎక్కువ. చెట్లను కూడా ప్రేమిస్తుంటారు. చెట్లను కౌగలించుకునైనా వాటిని నరకడాన్ని అడ్డుకుంటారు. అంతగా
ఆరాధించే తెగకి చెందిన వ్యక్తే ఈ లారెన్స్ బిష్ణోయ్. పగ బడితే పన్నెండేళ్లైనా వదలరన్నట్లుగా కోర్టులు వదిలిపెడుతుండటంతో సల్మాన్‌ని
టార్గెట్ చేసుకుంది ఆ తెగ. అందులో భాగంగానే ఈ హెచ్చరికలు వస్తున్నాయని అర్ధం చేసుకోవచ్చు. సో..ఇప్పుడు కోర్టులు కాదు ఆ బిష్ణోయ్ తెగే సల్మాన్‌కి శిక్ష విధించే పనిలో పడ్డాయన్నమాట

Comments