గాల్లొ పవనం


పవన్ కల్యాణ్ అభిమానులతొ పాటు మిగిలినవాళ్లు కూడా  ఆయన ప్రెస్‌మీట్ పెడితే చక్కగా చూస్తారు. వింటున్నంత సేపూ రంజింపజేస్తుంది. తమాషాగా తలెగరేస్తూ..కనుబొమ్మలు ఆడిస్తూ..పెద్ద శబ్దంతొ పంచ్‌లు వేస్తూ చేసే పవన్ ప్రసంగాలే చూసినవాళ్లకి ఇవాళ్టి ప్రెస్‌మీట్ చూస్తే ఏదొ మిస్సైన ఫీలింగ్ మిస్సైల్లా వచ్చే ఉంటుంది..అభిమానులెటూ ఈ విషయాన్ని అంగీకరించరు.  ఎందుకంటే వాళ్ల బాస్ కన్పిస్తే చాలు వాళ్లకి ఇంకేం అక్కర్లేదు. నిజంగా ఆయనకు కూడా అలా కన్పించి..విన్పించి వెళ్తే చాలు అని అన్పిస్తుందేమొ. ఎందుకంటే..కేటీఆర్ ఉత్తరకుమార్ రెడ్డి అని తెగిడే కాంగ్రెస్ పిసిసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా డిసెంబర్‌లొనే ఎన్నికలు తమకి ఖచ్చితంగా 70సీట్లు వస్తాయని చెప్తుూ పార్టీలొ వేడి రగిల్చించే వ్యాఖ్యలు చేస్తుంటే..పవన్ దారే వేరు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రెస్పెక్ట్ చేయాలంటూ తప్పించుకొవడం చూస్తే..ఏపీలొ కాదు..తెలంగాణలొనూ ఏ పార్టీతొనూ విరొధం వద్దంటూ తన వైఖరి తెలియజేసాడు. పైగా గొడవ చేస్తేనే పనులు అవుతాయా..పనులు జరగాలి కానీ..రాధ్దాంతాలు ఎందుకంటాడు..అక్కడికేదొ అన్ని పార్టీలు రాధ్దాంతాలు చేస్తుంటే..పవన్ పార్టీ ఒక్కటే సిధ్దాంతాలతొ ఉన్నట్లు..ఈ కామెంట్ వ్యక్తిగతంగా చేసేది కాదు..పవన్ కల్యాణ్ 10-20 ప్రసంగాలు వింటే అర్ధంకాకతప్పదు. మరి ఏపీకి ప్రత్యేక హొదాపై కూడా ఇదే రకమైన పంథా అనుసరిస్తాడా...!

ఇలాంటి మాటలు ఎక్కడైనా చెల్లుతాయేమొ కానీ రాజకీయక్షేత్రంలొ అస్సలు చెల్లవు. నువ్ ఎంత టొపువైనా కానీ..పొటీ చేసే తీరాలి..పైగా ఎవరినొ ఇండైరక్ట్‌గా కామెంట్ చేయడం మాత్రం చెత్తరాజకీయాలకు ఎలా దూరమొ చెప్పాలి.  ఎహ మా బాస్ తెలంగాణలొకి కూడా వచ్చాడు..నాకూ బలం ఉంది..అభిమానులు ఉన్నారు..అఁటూనే ఇలా బలమున్న ప్రతి చొటా పొటీ చేస్తానంటాడు..ఇప్పటికిప్పుడు ఎక్కడ పొటీ చేస్తానొ చెప్పనంటాడు..అదెటూ ఎవరూ చేయరు. కానీ ఇలా యాత్రపేరుతొ పే...ద్ద బిల్డప్ ఇచ్చేసి తీరా తుస్సుమనడం ఫ్యాన్స్ అందరికీ షాక్ లాంటిది..ఇంతకీ మన పొరాటం ఎవరి మీద...ఎఁదుకు అన్పించే స్థాయిలొ అనుమానాలు కలగకమానవ్..బహుశా 2019 ఎన్నికలలొనూ పవన్ కల్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్‌లకు మాత్రమే వ్యతిరేకంగా తనదైన రీతిలొ ( పొటీ చేయకుండానే) పొరాటం చేస్తాడేమొ అనే సందేహం వస్తుందంటే అది ఆయన తప్పే..
ఐతే ఈ మొత్తం వ్యవహారంలొ  సమాజంలొకి కావాల్సినంత మురుగు వదులుతున్న ఒక డబ్బా మాత్రం అక్కడికేదొ వాళ్లకి మాత్రమే పవన్ కల్యాణ్ వైఖరి అర్ధమైపొయినట్లు..క్లారిటీమీద క్లారిటీలు ఇచ్చేస్తూ పండగ చేసుకుంది. ఆయన మనసులొకి దూరిపొయి మరీ ఆంతర్యం కనుగొన్న ఆ ఛానల్ ఆంతర్యం మాత్రం పెద్దగా కష్టపడకుండానే అందరికీ తెలిసిపొతుంది. ఒక పక్క క్లియర్‌గా మైకుల ముందు తెలుగులొ ప్రసంగం చేసిన పవన్ కల్యాణ్ మాటల్లొ క్లారిటీ ప్రత్యేకంగా విశదీకరించాల్సిన అవసరం ఏమిటొ పాపం..ఇఁత తపన ఎందుకొ పనిగట్టుకుని మరీ.. ప్రచారం చేస్తుందొ ..గతంలొనూ చిరంజీవిని ఇలానే మునగచెట్టు ఎక్కించి ఆ తర్వాత ఏం చేసిందొ అందరూ చూశాం కదా..అయినా ఎవరైనా పెర్ఫామ్ చేస్తేనే కదా..అది బావుందొ లేదొ చెప్పడానికి..! కానీ నేనేదీ చేయను అనే వాళ్ల పెర్ఫామెన్స్‌కి మార్కులు వేయాల్సిన అవసరం ఏం ఉంది..అదే మరి అతనతురితి అంటే!

Comments