హనుమాన్ జోలికెళ్తే అంతే


దేవతల్లో మంచి బలశాలి అన్నా...ధైర్యాన్ని ప్రసాదించే దేవుడంటే మన హనుమాన్ పేరే చెప్పాలి.
ఆయన పేరు తలుచుకుంటే చాలు ఎక్కడలేని ధైర్యం మనోనిబ్బరం కలుగుతాయని భక్తుల నమ్మకం
ఆంజనేయదండకం చదివితే చాలు దయ్యాలు దగ్గరకు కూడా రావని ఎన్నో కథలు విని కూడా ఉఁటాం..అలాంటి ఆంజనేయుడి విగ్రహాన్ని ఒకటి ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్‌లో రోడ్ల విస్తరణలో భాగంగా తొలగించాలని లోకల్ అధికారులు ట్రై చేస్తున్నారు

ఐతే మూడు రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా..విగ్రహం ఉన్న ప్రాంతంలో ఒక్క అంగుళం కూడా పని కదలడం లేదట. ఇప్పటికే మూడు జేసీబీలు , క్రేన్లు విరిగిపోయాయట. ఇది ఖచ్చితంగా హనుమంతుడి మహిమే అని..ఇంత మహత్తు ఉన్న ఈ విగ్రహన్ని  ఇక్కడ్నుంచి తొలగిస్తే ఊరుకోమని చోటా లీడర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఐతే నేషనల్ హైవేపై విగ్రహాలు ప్రమాదాలకు కారణమవుతాయంటూ కాంట్రాక్టు పుచ్చుకున్న సంస్థ తమ ప్రయత్నాలు తామూ చేస్తూనే ఉంది ఆంజనేయుడి విగ్రహం 130 ఏళ్లక్రితం ఇక్కడ ప్రతిష్టించారని చెప్తున్నారు. జనం కూడా బాగానే వస్తున్నారన్ని తవ్వకాలను నిరసించేవారు చెప్తున్నారు. అంతకు ముందు ఏమోకానీ..ఇప్పుడు మాత్రం లార్డ్ హనుమ బలం చూడాల్సిందేనంటూ జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారట

Comments