వంగవీటి టిడిపిలో చేరితే అందుకు కారణం ఇదేనా?


కృష్ణాజిల్లా నేతగా రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఓ వర్గానికి కాపుగాసిన చరిత్ర వంగవీటి రంగాది. ఆయన హత్య తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన రాధా కానీ, రత్నకుమారి కానీ రాజకీయంగా పెద్ద ముద్ర వేయలేకపోయారు. ఆయన పేరు చెప్పుకోవడమే తప్ప తమకంటూ కనీసం జిల్లాలో కూడా వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారని విమర్శలు ఉన్నాయ్. వాటిలో నిజం ఉన్నా లేకపోయినా.. ప్రస్తుతం మాత్రం ఆ వర్గానికి తగిన ప్రాతినిధ్యం మాత్రం వంగవీటి కుటుంబానికి లేకుండా పోయింది. కాపునేతలంటే ముద్రగడ సహా కొంతమంది పేర్లు మాత్రమే చెప్పే పరిస్థితి ఉంది. ఇలాంటి సిచ్యుయేషన్‌లో వంగవీటి రంగాపై కొన్ని వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత కోటంరెడ్డి గౌతమ్ రెడ్డి. ఆ సందర్భంలో వంగవీటి రాధా ఆయన తల్లి రత్నకుమారి పెద్ద నిరసన తెలియజేశారు

తక్షణం పార్టీనుంచి గౌతంరెడ్డిని జగన్ సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఐనా పరిస్థితిలో పెద్ద మార్పేం లేదు..ఇప్పటికీ విజయవాడలో తనకి టిక్కెట్ ఇచ్చేది లేనిదీ తెలియకపోవడంతో ఇక వైఎస్సార్ కాంగ్రెస్ లో తన ఉనికికి అర్ధం లేదని వంగవీటి రాధా అనుకుంటున్నట్లు టాక్..అఁదుకే టిడిపిలో చేరేందుకు సన్నాహాలు జరిగాయంటున్నారు..ఇదే జరిగితే మాత్రం అది జగన్‌కికంటే ఎక్కువ ఆయనకే నష్టం చేకూర్చుతుందనేది వారి గత చరిత్ర, అప్పటి వ్యాఖ్యానాలు చూసినవాళ్ల అభిప్రాయం. 

అటు రత్నకుమారి కానీ, ఇటు రంగా కానీ చాలా సందర్భాలలో తన తండ్రి హత్యకి టిడిపినేతలే కారణం అని చెప్పుకొచ్చారు. అప్పట్లో రత్నకుమారి కూడా టిడిపిలోకి వెళ్లొచ్చిఇప్పుడు సన్యసించిన నేతే..అలాంటిది ఇప్పుడా పార్టీలో జాయిన్ అవడం వలన తాత్కాలికంగా ప్రయోజనం ఉండొచ్చేమో కానీ  భవిష్యత్తులో మాత్రం తమకి కాపువర్గం మద్దతు దొరకదని వారి అభిప్రాయం.  ఐతే ఇలాంటి విచిత్రమైన పరిస్థితే పరిటాల సునీతకీ టిడిపిలో జేసీ బ్రదర్స్ చేరిన సందర్భంలో ఎదురైనా చంద్రబాబు అప్పటికప్పుడు ఏదో సర్దుబాటు చేశారు. మరి అలాంటి సర్దుబాటే ఇక్కడ కూడా ఉంటుందా అనేది ఆసక్తి  కలిగించే విషయం. 

Comments