పాడు గజాలా!


నిజంగానే చేసాడో..హనీ ట్రాప్ చేశారో కానీ గజల్ శ్రీనివాస్  అరెస్టయ్యాడు.  ఎన్నో గజళ్లు పాడిన ఈ కేసిరాజు శ్రీనివాస్ కాంగ్రెస్‌లో లీడర్ కూడా..సమైక్యాంధ్రకి మద్దతుగా చాలా పాటలు, ప్రదర్శనలు కూడా ఇచ్చాడు  ఐతే ఇప్పుడిలా సడన్ గా కొత్త సంవత్సరంలో బుక్ అవడం అతగాడి అభిమానులకు చిన్నపాటి షాకే

ఆలయవాణి పేరుతో ఇతగాడికి ఓ వెబ్ రేడియో ఉందట..ఇప్పుడీ అరెస్ట్ వార్తతోనే దాని సంగతి బైటికి వచ్చింది. ఇందులో ఓ యువతి పని చేస్తుందట. ఈమెని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడని సదరు యువతి కంప్లైంట్ చేయడంతో పంజాగుట్ట పోలీసులు శ్రీనివాస్‌ని అరెస్ట్ చేశారు. ఇక నిర్దోషి అయినా దోషి అయినా మైకులు ముందు ఎవరూ తన తప్పిదాన్ని ఒప్పుకోరు అదే చేశాడితగాడు కూడా.
video credits sakshi tv

అయితే ఈ సందర్భంగా శ్రీనివాస్ చెప్పుకుంటున్న తీరు మాత్రం భలే కామెడీ ఈయనకి యాక్సిడెంట్ అయితే మాలిష్ చేయించుకునేవాడట..ఫిజీషియన్ రాకపోతే సదరు యువతే స్వయంగా మాలిష్ చేసిందని చెప్తున్నాడు..ఆమెకి ఇష్టం అయితే మాత్రం మసాజ్ చేయించుకోవడానికి ముందుకొచ్చాడంటే ఇక్కడే ఆర్ధం అవుతోంది ఇదేదో డీల్ సెటిల్ కాని వ్యవహారం అని..ఇక రెండ్రోజుల్లో ఈ కేసులోని లేడీ బైటపెట్టిన వీడియోలు ఓపెన్ అవుతాయ్..దాంతోనే పాడు గజాలా పాడు అనుకోవచ్చు

Comments