అన్నకి తమ్ముడికి ఇద్దరికీ బాలయ్యే పోటీ


బాలకృష్ణది ప్రత్యేక పంథా! ఒక్క క్షణంలో చిన్నపిల్లాడిలా కన్పిస్తాడు. అదే మరోక్షణంలో కావాల్సినంత కండకావరం ఉన్నవాడిలా ప్రవర్తిస్తాడు. అటు పెద్దలను గౌరవిస్తాడు..అంతలోనే అభిమానులని కూడా చూడకుండా ఎగిరెగిరి తన్నగలడు. చిత్రపరిశ్రమలోని చిన్నా పెద్దా అంతటినీ ఆప్యాయంగా పలకరిస్తాడంటారు. మళ్లీ అదే నోటితో పదునైన విమర్శలూ చేయగలడు. ఈ గుణాలే బాలకృష్ణకి ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చి పెట్టింది.
స్వీయపరిమితులు తెలుసుకున్నవాడు లోకాలను గెలుస్తాడంటారు. అలానే తన పరిమితులు తన అభిమానుల ఆకాంక్షలు చక్కగా తెలుసుకున్నవాడు కాబట్టే తాను ఎంత రిచ్చైనా మాస్‌కి దగ్గరగా ఉంటాడు. ఎవరైనా దర్శకుడు 
వచ్చి మిమ్మల్ని అలా తీస్తాను..ఇలా చూపిస్తాను అన్నా..తన అభిమానులు ఎలా చూస్తారో...ఎలా తీస్తే మెచ్చుకుంటారో తెలిసినవాడు కనుక తనదైన మేనరిజమ్స్‌ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు..ఎక్కడా తన మార్క్  
కంగారు స్టెప్పులు కానీ..దబ్బిడు దిబ్బుడే లాంటి డైలాగ్స్‌కి కానీ దూరం కాడు. హిట్టు కొట్టినా వాటితోనే ఫ్లాపులైనా వాటితోనే అన్నట్లుగా సినిమా జర్నీ సాగిస్తున్నాడు బాలయ్యగత సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమాతో పోటీపడగా..ఈ సంక్రాంతికి పవన్ కల్యాణ్ 25సినిమాకి పోటీ ఇస్తుండటం 
విశేషం. అలా అన్నదమ్ములిద్దరికీ పోటీ ఇచ్చిన రికార్డు కూడా బాలయ్యకే సొంతం
ఇప్పుడు సంక్రాంతికి జైసింహాతో సక్సెస్ కోసం ప్రేక్షకులను పలకరించబోతోన్న బాలకృష్ణ ఇందులోనూ తన రొటీన్ దారిలోనే వెళ్లినట్లు ట్రైలర్లు చెప్తున్నాయ్. ఐతే ఇప్పుడు కొత్తగా తన అభిమానుల కోసం రాసిన ఓ లేఖ కలకలం 
రేపుతోంది. పండగ అంటే నడిరోడ్డు మీద చిందులు కాదని..కుటుంబంతో కలిసి ఆనందంగా జరుపుకోవడం అని రాసితన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇది నిజంగా ఇతరులకు కూడా ఆదర్శప్రాయమే..ఐతే వాటిని ఈ సోకాల్డ్ 
అభిమానులు ఎంతవరకూ పాటిస్తారనేదే అనుమానం. థియేటర్ల దగ్గర చొక్కాలు చింపుకోవడం కాదు తల్లిదండ్రులకు కొత్త బట్టలు కొనిపెట్టండనే ఈ సంకేతం అభినందనీయం

Comments