మోత్కుపల్లి కూడా జంపేనా...చంద్రబాబుకే ఎందుకిలా?


కష్టం ఒక్కటిగా రాదు..కలసికట్టుగా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయంటారు. ఇప్పుడు తెలంగాణలో టిడిపి పరిస్థితి కూడా అంతే ఎన్టీఆర్ చనిపోయిన రోజు సందర్భంగా ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయ్. ఏకంగా టిడిపిని టిఆర్ఎస్‌లో కలిపేస్తే సరిపోతుందంటూ కామెంట్ చేశాడీయన. కేసీఆర్ కూడా టిడిపినుంచి వెళ్లిన మనిషే కాబట్టి పార్టీని పరువు దక్కించుకోవడానికి తెలంగాణ రాష్ట్రసమితితో కలిపేయాలంటాడీయన. ఇలాంటి కామెంట్లు చేసిన ఏ నేతా ఆ తర్వాత కాలంలో టిడిపిలో కొనసాగలేదు లేదంటే కొనసాగనీయలేదు.

ఈ సందర్భంగానే మోత్కుపల్లి కేవలం విలీనం గురించిన అంశాలే కాకుండా, చంద్రబాబుపై నేరుగా కామెంట్లు చేశాడు. ఎన్ని పనులున్నా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమానికి రావాల్సిందంటూ కుటుంబీకులను మించిన స్వామిభక్తి ప్రదర్శించాడు. ఎన్టీఆర్ వర్ధంతికి నాలుగు పూలు చల్లి..కొన్ని రొడ్డకొట్టుడు డైలాగులు వల్లించినంత మాత్రాన నిజంగా ప్రేమ ఉన్నట్లా..! కాదు గదా..! బహుశా ఈ మాటలన్నీ కూడా నన్ను బైటికి పంపుతావా లేదా అనే ఉద్దేశంతోనే అన్నట్లు ఉంది తప్ప మరోది కాదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. లీడర్లు వెళ్లినంత మాత్రాన పార్టీ అంతా అంతరించిపోయిందనుకోవడం సరికాదు.
రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవ్. ఆయన ఇంకో మాట ఏం అన్నాడంటే తెలంగాణలో పార్టీ తిరిగి వైభవం సాధించాలంటే చంద్రబాబే స్వయంగా తిరగాలట.ఇలాంటి కూతలు కూసే నేతలున్నచోట పార్టీకి శల్యసారధ్యమే తప్ప ఇంకొక లాభం ఉండదు.. జగనే తిరగాలి..బాబే రావాలి...రాహుల్ గాంధీనే ప్రచారం చేయాలి అనుకునే నేతలున్న పార్టీల పరిస్థితి ఎప్పటికీ బాగుపడదు. రెండు రాష్ట్రాలతో పాటు అండమాన్, కేరళ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నతెలుగుదేశానికి ఇలాంటి కామెంట్లు చీకాకు పుట్టించకమానదు. 
పోయేవాడు పోక ఇలాంటి కామెంట్లు చేయడం ద్వారా కార్యకర్తలను మరింత చీకాకు పెట్టడమే అవుతుంది. వీళ్లందరిలోకి రేవంత్ రెడ్డే కాస్త నయం అనకతప్పదు. తాను  ఎందుకు పార్టీ మారుతున్నాడో వివరంగా చెప్పి మరీ మారాడు. తిరిగి టిడిపిపై ఒక్క విమర్శా చేయలేదు. కనీసం ఆ పాటి కృతజ్ఞత లేకుండా వ్యవహరించే నేతలకు( ఏ పార్టీవారైనా) పదవులు దక్కవచ్చేమో కానీ.. జనంలో మర్యాద దక్కదు

Comments

  1. o-0= 0

    తెలంగాణాలో టీడీపీయే సున్నా. రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి ఇద్దరూ సున్నాలే.

    ReplyDelete

Post a Comment