జగన్ యాత్ర వేస్టా..మరి దీనికేంటి జవాబు!


కొద్ది రోజులుగా అదే పనిగా జగన్ యాత్రతో ఎవరికీ ప్రయోజనం లేదని..అసలు జనమే లేరని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రులు కామెంట్లు చేస్తూనేఉన్నారు ఐతే ఇవాళ మాత్రం ఓ చిన్న ఇన్సిడెంట్ ఈ యాత్రకి ఉన్న ప్రాముఖ్యతని తెలియజేసింది..జనరల్‌గానే తనదైన ధోరణిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఉనికి కోల్పోతోందని మంత్రి బోండా ఉమా కామెంట్ చేసారు..అయితే ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఓ సంచలనం లాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.సుళ్లూరుపేటలో వేనాటి వంశం వారసుడు జగన్ పార్టీలోకి జంపవుతున్నాడనేదే అది. ఇప్పటికే జగన్‌ని కలవడమే కాకుండా మా నాన్నతో చర్చించిన తర్వాత వెళ్లున్నా అని వేనాటి సుమంత్ చెప్పడం సుళ్లూరుపేట టిడిపిలో కలకలం రేపుతున్నదే.! నెల్లూరు జిల్లాలో వేనాటి మునిరెడ్డి
ఆయన తర్వాత వేనాటి రామచంద్రారెడ్డి టిడిపికి భరోసా ఇస్తూ వచ్చారు. అయినా ఆ పార్టీలోని నేతల వరద కారణంగా పదవులకు దూరం కావాల్సి వచ్చిందని చెప్తారు ఇలాంటి స్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్‌కి మళ్లడం మినహా మరో దారి లేదని ముందుగానే తన వారసుడిని ఆ పార్టీలోకి పంపుతున్నారని టాక్


జగన్ పథకాలు నచ్చే ఆ పార్టీలోకి వెళ్తున్నా అని ఓపెన్‌గా ఓ అధికార పార్టీ నేతల కుటుంబీకులు చెప్పడం ఈ మధ్యకాలంలో ఇదే మొదటిసారి. అందుకే వరస దెబ్బలు పడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌కి ఇది పెద్ద రిలీఫ్‌గా చెప్పాలి. పైగా సుళ్లూరుపేటలో జిల్లాస్థాయి నేతలు చేరిక ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెంచేదే. ఇలాంటివి చాలా ఉంటాయని
ఆ పార్టీ నేతలు చెప్పుకుంటుంటే..ఇదో పెద్ద లోటేం కాదని టిడిపి తీసిపారేస్తుంది. ఇది సర్వసాధారణం.  అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయితీ మున్సిపాలిటీ ఎన్నికలు కనుక జరిగితే  ఏ పార్టీ ఎంత సిధ్దంగా ఉందనేది కాస్తంతైనా తెలుస్తుంది..ఇప్పుడు జగన్ కడప, కర్నూలు, చిత్తూరు అయిపోయి నెల్లూరు జిల్లా చుట్టబోతున్నాడు. మరి ఈ యాత్ర వలన ప్రయోజనం ఏంటనే టిడిపినేతలను పక్కనబెడితే..కనీసం ఆ ఎన్నికలవరకైనా తన పార్టీని ఉత్సాహంగా ఉంచవచ్చనేది తేటతెల్లమవుతోంది కదా..మరింకా ప్రజాసంకల్పయాత్రని తక్కువ చేసి చూడటం అవివేకం అన్పించుకోదా..!
పైగా డిసెంబర్‌లోనే సాధారణ ఎన్నికలు వస్తే..పరిస్థితి ఇఁకాస్త వేగం పుంజుకోవచ్చు..అఁదుకే ఇప్పటికైనా టిడిపినేతలు యాత్రని తక్కువ చేసి చూస్తే అది వారికే వికటిస్తుందనేది నిజం..అందుకే చంద్రబాబు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు క్లాసులు పీకుతున్నారని అంటున్నారు..

Comments