ఎవడైతే నాకేంటి, పవన్ కల్యాణ్ ‌పై ఇదీ జగన్ లెక్క


జనసేన పార్టీ వచ్చినంత మాత్రాన తన పార్టీ కి వచ్చే నష్టమేం లేదంటూ వైఎస్ జగన్ పాదయాత్రలొ కుండబద్దలు కొట్టేశాడు..దీంతొ ఇప్పటిదాకా జగన్ అటు జనసేన కానీ..ఇటు బిజెపి కానీ  ఏదొక పార్టీతొ పొత్తు పెట్టుకుంటాడని కొంతమంది చేస్తొన్న ప్రచారానికి ఒపెన్‌గా చెక్ చెప్పినట్లైంది

నిజానికి ఇదే తరహా వ్యాఖ్యలు అప్పట్లొ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరంజీవిపై చేశారు..చివరికి అదే నిజమైంది..ఐతే ఈ లెక్క 2014లొ కాస్త తేడా అయింది. ఎందుకంటే పవన్ కల్యాణ్ డైరక్ట్ గా పొటీ చేయకుండా..మద్దతు అంటూ డ్రామా క్రియేట్ చేయడంతొ ఇది జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు అఁటుంటారు..కానీ ఈసారి పొటీ చేసినా..చేయకుండా వెనకుండి పక్కనుండి టిడిపికి మద్దతిచ్చినా తన గెలుపు ఆపలేరని జగన్ ధీమా వ్యక్తం చేయడం విశేషం. ఐతే అతి విశ్వాసం ఎప్పుడూ మంచిది కాదనే సంగతి ఆయనకి ఈపాటికి ఈ ఐదేళ్లలొ తెలిసే ఉఁడాలి. ఐనా ఇలా కామెంట్ చేస్తున్నాడంటే పాదయాత్రలొ వస్తొన్న స్పందన చూసే ఈ నిర్ణయానికి వచ్చారని ఆ పార్టీ లీడర్లు చెప్పుకుంటున్నారు

Comments