చాయ్ పకొడీ హార్దిక్ మోడీ


దేశంలోనే ప్రధానమంత్రి మోడీని ఢీ కొట్టే మొనగాడు లేడని బిజె పార్టీ చెప్పుకుంటూ ఉంటోంది. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ తన చురకలు పదునుగా వేస్తున్నాడు కానీ, అసలు ఆయన్ని మించిన స్టార్ లేడనేది  బిజెపి అభిప్రాయం. ఐతే అలాంటిమోడీకి కూడా చెమటలు పట్టించిన ఘనత హార్దిక్ పటేల్‌దే. ఎందుకంటే గుజరాత్‌లో రిజర్వేషన్ల కోసం అతి చిన్న వయసులోనే చెలరేగిపోయిన ఈ హార్దికుడు అదే జోరు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చూపించాడు. దాదాపుగా బిజెపిని ఓడించినంత పని చేసినా..మోడీ సెంటిమెంట్ కామెంట్లతో గట్టెక్కిపోయారు.

ఐతే ఇక అక్కడితో హార్దిక్ పటేల్ అధ్యాయానికి బ్రేక్ పడ్డట్లే అనుకున్నారు. ఐతే ఏ చిన్న సందు దొరికినా మొత్తం దూరేస్తాననే విధంగా కాస్త అసంతృప్తి స్వరం విన్పించినా దాన్ని క్యాష్ చేసుకుంటా అన్నట్లుగా వెంటనే గేలం వేసే ప్రయత్నంచేశాడు..తాజాగా హార్దిక పటేల్ మోడీ పై చేసిన కౌంటర్ ట్వీట్ చక్కర్లు కొడుతోంది. ప్రధానమంత్రి భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు ఏ పనీ దొరకకపోతే పకోడీ బళ్లైనా పెట్టుకోవచ్చనే విధంగా కొన్ని
వ్యాఖ్యలు చేస్తే..చాయ్ వాలా మాత్రమే ఇట్లాంటి సలహాలు ఇస్తారంటూ హార్దిక్ పటేల్ కామెంట్ చేశారు..ఐతే దీనికి జోడింపుగా ఆర్ధికవేత్తలైనవాళ్లు ఎవరూ ఇలా చెప్పరనడమే మోడీకి సిసలు చురకగా  చూడాలి.

ప్రధానమంత్రిగా మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు ఎంత మద్దతు లభిస్తుందో అదే స్థాయిలో విమర్శలు గుప్పించేవాళ్లూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మోడీ ప్రతి మాటకీ ఇలా వెంటాడి మరీ కౌంటర్లు ఇస్తోన్న హార్దిక్ పటేల్ పూర్తిగా రాజకీయాలకే అంకితమైనట్లే కన్పిస్తున్నాడు

Comments