వచ్చే ఎన్నికల్లో ఇదీ మెగాబ్రదర్స్ ప్లాన్


నాగేంద్రబాబు ఉరఫ్ నాగబాబు తన మనసులో మాట ఎప్పటికప్పుడు బైట పెట్టేస్తుంటాడు. గతంలో ప్రజారాజ్యంలో కార్యకర్తగా పని చేసినా, 2014 ఎన్నికల సమయంలో చిరంజీవి వెంటే ఉండమని ఫ్యాన్స్‌కి చెప్పినా..ఇప్పుడు జనసేనలో మళ్లీ కార్యకర్త పాత్ర పోషించడానికి సిధ్దమైనా ఎప్పటికీ ఎవరికీ పట్టని గోడు  ఆయనది. పక్కాగా స్వార్ధం ఎరగని మనిషిగా తనని తాను చెప్పుకుంటాడు నాగబాబు..

అసలు ప్రజారాజ్యం విషయానికి వస్తే, అటు చిరంజీవి డబ్బులు తినక, అటు అల్లు అరవింద్ కూడా ఏమీ ఎరగక ఇటు పవన్ కల్యాణ్ నిప్పులా బతికి ఇంక ఎవరు మరి ప్రజారాజ్యాన్ని ధనరాజ్యంలా చేసింది? ఈ ఒక్క ప్రశ్నకి మెగా బ్రదర్స్‌ దగ్గర ఖచ్చితమైన సమాధానం ఉంటే చాలు..తెలుగు జనం వాళ్లని ఎన్నికలలో గెలుపు బాట పట్టించవచ్చు..కానీ అది జరగదు..ఇదీ జరగదు

కట్ చేస్తే "పవన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాకార్యకర్తలా పని చేస్తా "అనే డైలాగులు నాగబాబుకి సూట్ కావు ఎందుకంటే ముందు పవన్ కల్యాణ్ ఏం చేయబోతున్నాడో ఆయనకే ఓ క్లారిటీ లేదు..కాదు..ఉందంటారా..మరి ఎప్పుడు ఏ ఎన్నికలలో పోటీ చేస్తాడో చెప్పమనండి. చివరికి బై ఎలక్షన్స్ లాంటి సువర్ణఅవకాశం వచ్చినా పోటీ చేయకుండా ఉన్నది ఓ  పార్టీనా..సరే వదిలేద్దాం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో అయినా పోటీ చేయవచ్చుగా..అబ్బే మనకి అయితే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్..కింది స్థాయి ఎన్నికలంటే చిన్నచూపు కదా..అంటే పదవులపై ఆశ లేదు అనేది వట్టి మాటే అన్నమాట. చివరికి 2019వరకూ ఎదురు చూస్తూనే ఉండాలి..కానీ చిరంజీవి సపోర్ట్ కూడా జనసేనకి కావాలి అనే మాట ఉంది చూశారూ..ఇది చాలు మెగా బ్రదర్స్ డ్రామాని తెలియజెప్పడానికి. ఎఁదుకంటే చిరంజీవిని "జనసేనలో జాయిన్ అవుతారా "అంటే లేదు అని చెప్పడు చూడండి..కాదు భవిష్యత్తుని ఇప్పుడే ఎలా చెప్పగలను అంటాడు. పోనీ టిడిపిలో జాయిన్ అవుతారట నిజమేనా అన్నా కూడా బలంగా ఖండించడు. ఇక పవన్ కల్యాణ్ ని ఇప్పటికే దువ్వే పనిలో పడ్డాడు నాగబాబు.మరి ఈ ముగ్గురూ వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేసి ఏం సాధించదలిచారో చెప్పగలరా..(పదవులు కాదా) మరి "మంచి చేయాలంటే పదవే కావాలా..ఏం ప్రతిపక్షంలో ఉండి సాధించలేమా" అనడిగే జనసేన ప్రెసిడెంట్ మాటలు వట్టివేనా..అందుకే ఈ సోదరుల మాటలకు పెద్దగా ఎవరూ స్పందించడం లేదు

Comments