గ్రహణం ఎవరికి?


సూపర్ మూన్..బ్లడ్ మూన్..బ్లూ మూన్..రకరకాల పేర్లు..టెక్నాలజీ ఎంత పెరిగితే ఇలాంటి నమ్మకాలు అంతగా పెచ్చరిల్లుతుంటాయనేదానికి చంద్రగ్రహణాలు..సూర్యగ్రహణాలే ప్రత్యక్షసమకాలీన నిదర్శనాలు. అసలు చంద్రగ్రహణం ఎప్పుడొస్తుందొ..సూర్యగ్రహణం ఏ రొజున వస్తుందొ చెప్పమంటే చెప్పలేని వారంతా వీటిని ఫాలొ అవడం మిగిలిన వాళ్లని కూడా ఫాలొ అవమని వేధించడమే అసలు సమస్య..చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ మనుషులకు కాదు కదా..! అయితే సూర్యుడికి..లేదంటే చంద్రుడికి వాళ్లకి గ్రహణం పట్టడం..విడవడం జరిగితే మనుషులకు ఎందుకు పీడ..దీనికి సమాధానంగా 12రాశులు..18 చక్రాలు అంటూ ఏవొ మామూలు జనానికి అర్ధం కానివి ఉఁడి మన జీవితాలని నడిపిస్తుంటాయంటారు కొంతమంది జ్యొతిష్యులు..అసలు భవిష్యత్తును ముందు ఊహించి చెప్పడమే వీలు కాదన్నప్పుడు ఈ గ్రహణ ప్రభావాలని ఎందుకు అతిగా ప్రచారం చేస్తారు

ఛానళ్లకి ఈ సంగతి అర్దం కాక కాదు..నమ్మొద్దు అని చెప్పినా...నమ్మండి అని చెప్పినా సింగిల్ డైలాగ్‌తొ జనం తమ సంస్థల గొట్టాలకు అతుక్కుపొరు..ఏదొ జరిగిపొతుందని..హడావుడి చేస్తే...బొలెడంత కాలక్షేపంగా మన ఛానల్ నుంచి తప్పించుకొలేరని వాళ్ల మూఢ నమ్మకం..నిజంగా అలానే జరిగితే ప్రతి నెలా ఏదొక మూల గ్రహణాలు సంభవిస్తూనే ఉఁటాయ్. వాటిపై కనీసం వారానికి  ఒకటి ప్రసారం చేయమనండి..ఎంత బొర్ కొడుతుందొ..అందుకే కొన్ని గ్రహణాలకు మాత్రమే ప్రత్యేకత ఆపాదించుకుని డిష్యుం డిష్యుం చేస్తాయ్..పైన చెప్పుకున్న బ్లూమూన్..సూపర్ మూన్ మనవి కాదు..ఆంగ్లభాషేయులు పెట్టిన పేర్లు..జస్ట్ ఒక వీధికి లింకింగ్ రొడ్ అని పేరు పెట్టుకునే జాతి నామకరణం చేసినవాటిని పట్టుకుని..ఇలా నానాయాగీ చేసుకుని..మనకి మనమే చులకన అవడం తగునా..ఇలాంటి చర్చలే చూసి ప్రపంచంలొ ిిఇతరులు మనల్ని చూసి నవ్వమంటే నవ్వరా..!

నాగరికత తెలియనినాడు..వంటిపై బట్ట ఉంటుందొ లేదొ..ఇళ్లు ఉన్నాయొ లేక పొదరిళ్లలొనే బతికిన నాడు ఇలాంటి నమ్మకాలు ఉన్నాయంటే అర్ధం చేసుకొవచ్చు..అప్పటిదాకా వెలుగులు చిమ్ముతున్న సూర్యుడు హఠాత్తుగా మాయం అవడం తర్వాత ప్రత్యక్షం కావడం, నిండు పున్నమి రొజున కొంతసేపు చంద్రుడు మాయం కావడం పైగా ఇలాంటి వాటికి పురాణాల్లొ పొలికలు ఉఁడటంతొ మన జనం గ్రహణాలకు భయపడి ప్రమాదాలు నివారించే ఆలొచనతొ గ్రహణ సమయాలని లెక్కబెట్టి బైటికి రాకుండా ఉండమని అప్పట్లొ హెచ్చరికలు చేసుకుని ఉఁడొచ్చు..ఆ సమయంలొ సముద్రంలొ ఆటుపొటులు హెచ్చుగా ఉఁటాయ్ కాబట్టి..నిజంగా అటువైపు ఉన్న వాతావరణంలొ ఉన్న ప్రజలు గాలిలొ మార్పు గమనించి ఉఁడొచ్చు..కానీ కనీసం సూర్యుడి చివరి కిరణం కూడా తాకనంత దట్టమైన కాంక్రీట్ అరణ్యాలలొ , గృహావరణలలొ నివసించే నేటి మనిషిపై గ్రహణాల  ప్రభావం (ఉందొ లేదొ తెలీని..నిరూపితం కాని) పడుతుందా..ఖచ్చితంగా పడదు..ప్రతి రొజూ జరిగే సంఘటనలే గ్రహణాల తర్వాతా జరుగుతాయ్. అంత మాత్రాన వాటికి గ్రహణప్రభావానికి ఆపాదించడం శుద్ద అవివేకం.పైగా ఆ సమయంలొ తినకూడదు..ముందు వండినవి విషతుల్యం అవుతాయ్ అనే ప్రచారం ఒకటి..ఎటు చూసినా కాలుష్యం పెరిగిపొయిన ఇప్పటి రొజుల్లొ ప్రత్యేకంగా గ్రహణం సమయంలొనే ఏంటి ప్రభూ...రొజూ కూడా శుద్దిగా చేయకపొతే విషతుల్యమే అవుతాయ్..!

ఛానళ్లు ప్రసారం చేసినట్లు ఇది నిజంగా అద్భుతమే అయితే మరి ఇళ్లలొ కూర్చుంటే ఏంటి లాభం ఆ అద్భుతాన్ని చూడకుండా .అందుకే చాలాచొట్ల హ్యాపీగా చంద్రగ్రహణాన్ని బజ్జీలు తింటూ కూడా లాగించేశారట.

వ్యాసం ముగించే ముందు ఒక మాట..మీ నమ్మకాలు మీతొనే ఉఁచుకొండి..మిమ్మల్ని అడిగితే వాటికి వివరణ ఇచ్చుకొండి అంతేకానీ వాటిని ఇతరులపై రుద్ది ఎమొషనల్ బ్లాక్ మెయిల్ చేయవద్దు

Comments