అభిమానికి ప్రాణసంకటంగా మారిన అజ్ఞాతవాసి


అభిమానం ప్రాణాలు తీయడమంటే ఇదేనేమో..సినిమా నచ్చితే బావుందనుకోవడం లేదంటే వదిలేయడం కాకుండా
అదేదో అత్యంత ఆవశ్యకమైన విషయంలా భావించడం తెలుగుజనానికి బాగా అలవాటు. ఇప్పుడు రిలీజైన రెండు సినిమాలు బొక్కబోర్లాపడ్డ సంగతి తెలిసిందే. ఏదో ముందే టిక్కెట్లు రిజర్వ్ చేసుకున్నవాళ్లకి తప్పదు కాబట్టి చూస్తున్నారు కానీ వెతికి మరీ ఆ సినిమాల జోలికి ఎవరూ పోరు. అందులోనూ ఇప్పుడు రెండు మూడు నెలల్లోనే టివిల్లోకి వచ్చేస్తుంటే పనిగట్టుకునిబాలేని సినిమాలకి ఎవరూ వెళ్లరు

ఐతే బళ్లారిలోని రాము అనే ఓ ఫ్యాన్ అజ్ఞాతవాసికి వెళ్లి చనిపోయిన సంఘటన అనేక అనుమానాలకు తావిచ్చేదే. టాయిలెట్స్ కి వెళ్లిన అతను అక్కడున్న ఫినాయిల్ తాగి చనిపోయాడట..ఇది సినిమా నచ్చకా..లేక కూల్ డ్రింక్ అనుకుని పొరబాటుగాతాగి చనిపోయిన బాపతా అనేది ఇంతవరకూ తేలలేదు. ఐతే సినిమా థియేటర్‌లో చనిపోవడమే అనుమానాలకు కారణం తప్ప..నిజంగాఅతను ఫ్యాన్ అవ్వాల్సిన అవసరం లేదు. సినిమా బాగోగుల అంశం కానీ అతని చావుకు కారణం కావాల్సిన అవసరం లేదు నిజం ఏమిటనేది శసవానపురం పోలీసులు దర్యాప్తు చేసి చెప్తే కానీ తెలీదు.

Comments