సూపర్బ్ సీన్..చంద్రబాబు వర్సెస్ వైఎస్ అవినాష్


ముచ్చటేసింది..ఇలాంటి సీన్లు చూసి చాలా రొజులైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సభలొ ఎంపి అవినాష్ రెడ్డి చక్కగా తన వాదన విన్పించారు.ఐతే సిఎం చంద్రబాబు కూడా చాలా చక్కగా ఇది రాజకీయ వేదిక కాదు తమ్ముడూ అంటూ చాలా బ్యాలెన్స్‌డ్ గా రాజకీయ ప్రసంగాలు వద్దని చెప్పి వారించారు

నిజానికి వైఎస్ అవినాష్ రెడ్డి మైకుని తెలుగు దేశం నేతలు లాక్కున్నప్పుడు ఎంత గొడవైనా చేయొచ్చు కానీ అలా జరగలేదు. అక్కడ చంద్రబాబు కూడా బిత్తరపొయారు..తత్తరపాటుకు గురయ్యారు. ఇంకొకరు ఇంకొకరు అయితే ఆయన కూడా గట్టిగానే హుంకరించి అదిలించేవారే కానీ..అవతల ఉన్నది సాక్షాత్తూ పులివెందులలొ ఎన్నేళ్లనుంచొ సత్తా చాటుతున్న వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తి.. అందుకే ఎంతొ తమాయించుకుని మాట్లాడుతున్న సందర్భం కన్పించింది. దానికి తొడు వైఎస్ అవినాష్ కూడా తొణకకుండా ఆవేశానికి లొను కాకుండా వ్యవహరించిన తీరు బావుంది

ఇక్కడ ఎవరు గెలిచారు..ఎవరి వాదన నెగ్గిందన్నది కాకుండా గొడవ పెద్దది కాకుండా చూసినతీరు అభినందనీయం. గండికొట చిత్రావతిని దాదాపుగా పూర్తి చేసింది వైఎస్ అన్నది ఈ సందర్బంగా మరొసారి తేటతెల్లమైంది.

Comments