అక్కినేనికే అవమానంఅక్కినేని ఫ్యామిలీ అంటే తెలుగు చిత్రపరిశ్రమతో పాటు బాలీవుడ్‌లోనూ ఓ గౌరవం ఉంది. దాన్ని నాగార్జున పెంచకపోయినా, తగ్గించకుండా మాత్రం
చూస్కుంటూ వస్తున్నాడు. తండ్రి పేరిట ఓ మంచి ఫౌండేషన్ పెట్టి ఆ పేరిట పురస్కారాలు ఇస్తుంటారు. ఐతే అలాంటి ఫౌండేషన్ గుర్తింపు కేంద్రం రద్దు చేసింది. అంటే ఇదొక్కటే కాకుండా ఇలాంటివి చాలా రద్దు చేసింది. అందుకు కారణం ఉంది. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అని విదేశాలనుంచి వచ్చే నిధులతో నడిచే సంస్థలు..విరాళాలు పొందుతున్న సంస్థలు
తమకి అలా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు నిధులు అందుతున్నాయో చెప్పాలి. ఇది ఎప్పట్నుంచో ఉంది కూడా. 
ఐతే ఇలా విరాళాలతో నడుస్తోన్న నాన్ గవర్నింగ్ బాడీలు ఈ అంశాన్ని
పక్కనబెట్టేసి తమ అసలు పని కూడా పక్కనబెట్టేసి డబ్బులు  దాచుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయ్. వీటిపై ఎన్డీఏ గత ఏడాదే నిబంధనలు అమలు చేసేందుకు సన్నాహాలు చేసింది. అందులో భాగంగానే గత ఏడాది 200 స్వచ్చంద సంస్థల ముసుగు వేసుకుని నిజాలు చెప్పని కంపెనీల గుర్తింపు రద్దు చేసింది. ఈ సంస్థలకు విరాళాలు ఇస్తుండటం వలన 
సెక్షన్ 80సి, 80డి కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో ఎవరికి వారే తామే సంస్థలు నడుపుకుంటూ పన్నులు ఎగ్గొడుతున్నారు. లేదంటే ఎగ్గొట్టే వారికి సాయపడతున్నారు. 

ఇక ఇక్కడ సీన్ కట్ చేస్తే అక్కినేని ఇఁటర్నేషనల్ ఫౌండేషన్ కూడా ఇన్ కమ్ ట్యాక్స్ రిటన్స్ ఫైల్ చేయలేదని అంటున్నారు. అఁదుకే దాని గుర్తింపు కూడా  ఆటోమేటిగ్గా రద్దైపోయింది ఇదే విషయం ఇవాళ కిరణ్ రిజిజు స్వయంగా తెలిపారు( అంటే ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయ్) ఐతే ఇలాంటి సంస్థల్లో తెలంగాణవి 190, ఆంధ్రప్రదేశ్‌వి 450 ఉండటమే గమనార్హం. ఇంతగా బొక్కేస్తున్నారా మనోళ్లు..! మరిప్పుడు దీనికి నాగార్జున ఏ పూత వేస్తాడో

Comments