తెలుగుదేశంలో ఇక బిజెపి ఒంటరి పోరాటమా..నిజంగా అంత సీన్ ఉందా?


ఆంధ్రప్రదేశ్‌లో టిడిపితో పొత్తు ఉండదని భారతీయ జనతాపార్టీ లీడర్ పురంధీశ్వరి పలాస కార్యకర్తల సమావేశంలో చెప్పారని ఇప్పుడు టాక్. అసలు పోలవరంపై అనవసరంగా రాష్ట్రప్రభుత్వం రాధ్దాంతం చేస్తోందని..దాన్ని ఎలా పూర్తి చేయాలో కేంద్రానికి తెలుసని కూడా ఆమె అన్నారట. ప్రతి వారం, నెలా నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టు పనుల ఆరా తీస్తున్నారని కాబట్టి దానిపై ఇక రాష్ట్రం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే పద్దతిలో పురందేశ్వరి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది

అంతటితో  ఊరుకోకుండా పురంధీశ్వరి ఏపీలోని  ఒంటరిగానే (175) స్థానాలకూ ఎన్నికలలో పోటీ చేస్తుందనే మాట అన్నారట. ఇది నిజంగా వినడానికి అతిశయోక్తిగానే అనుకోవాలి.  తెలుగుదేశం పార్టీతో పొత్తు సంగతి పక్కనబెడితే అసలు బిజెపికి ఏపీలో ఎంత బలముందనేది కూడా చూసుకోవాలిగా! అరువు తెచ్చుకున్న నేతలు తప్ప పార్టీలో ఎదిగిన లీడర్లంటే యడ్లపాటి రఘునాధబాబు, భానుప్రకాష్ ఇలా కొంతమంది పేర్లే చెప్పగలరు. ఇంకా జిల్లా స్థాయిలో బాగా కష్టపడ్డ నేతలు కూడా ఉఁడొచ్చు. కానీ ప్రతి నియోజకవర్గంలో పార్టీ కాండిడేట్లు నిలబెట్టాలంటే చాలా కష్టం.

పైగా సింగిల్‌గా పోటీ చేసేంత ఆర్ధికవనరులు కూడా కావాలి అదొ కష్టం. అందుకే చాలా పార్టీలు అన్యమనస్కంగా అయినా పొత్తులతో బరిలోకి దిగుతాయి. మరి ఇప్పుడు పురంధీశ్వరి ఏ ధీమాతో ఈ ప్రకటన చేసిందంటే కేవలం టిడిపి అధినేత చంద్రబాబుకి ఉక్రోషం కలిగించేందుకే అని చెప్పొచ్చు. చీకాకు పుట్టించే కామెంట్లు చేస్తే..ఏదోక సందర్భంలో బాబు నోరు జారతాడనే వ్యూహం కూడా కావచ్చు. ఐనా చంద్రబాబు అంత తేలికగా వీళ్ల ఉచ్చులో పడతారా. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌తో జట్టు కడుతుందనే అంచనాలూ ఎటూ ఉన్నాయ్. అలాంటప్పుడు ఇప్పట్నుంచే సింగిల్ కంటెస్ట్ ఎజెండా అనే పదానికి అర్ధం లేదు

Comments