రజనీకాంత్ కి తెలుగోడి మద్దతు


హీరో రజనీకాంత్‌కి మలయాళం, కన్నడంతో పాటు తెలుగులో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు రాజకీయాల్లో ఆయన సిఎం అయితే ముందు సంతోషించేవారిలో తెలుగువారే ఉంటారు. ఎందుకంటే తెలుగువారితో ఆయనకి ఉన్న అనుబంధం అలాంటిది. తమిళం తర్వాత తెలుగులోనే ఎక్కువ నటించారు కూడా. అటు తమిళంలో తాను డిప్రెషన్‌లో ఉన్న సమయంలో తెలుగు సినిమాలే ఆదుకున్నాయ్ కూడా 

పొలిటికల్ ఎంట్రీ తర్వాత సూపర్ స్టార్‌కి తమిళంలో చాలామంది వ్యతిరేకత వ్యక్తమవుతుందని అనుకున్నారు కానీ అంతగా ఎక్కడా నిరసన స్వరాలు విన్పించలేదు పైగా సపోర్ట్ కూడా లభిస్తోంది. వారిలో మన తెలుగు హీరో విశాల్ కూడా ఉండటం విశేషం. ఆర్‌కె నగర్ బై ఎలక్షన్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేసిన విశాల్ రజనీకాంత్కి మద్దతుగా 234 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తా అనడం రజనీకాంత్ పట్ల మారుతోన్న ధృక్పథానికి నిదర్శనం. అప్పట్లో అసలు ఆయన తమిళుడే కాడనిఆయన ఎలా వస్తాడంటూ శరత్ కుమార్, భారతీరాజా లాంటి వాళ్లు ఘాటుగా కామెంట్లు చేశారు కూడా

ముందే శరత్ కుమార్ కి కౌంటర్‌గా కానీయండి..ఇంకో కారణంతో కానీయండి విశాల్ మొదలుపెట్టాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇలా సినిమా ఇండస్ట్రీ అంతా ఆయన వెంట నడిచింది. ఐతే అప్పుడూ యాంటీగా ప్రచారం చేసినవాళ్లున్నారు. కానీ ఇప్పటి రజనీకాంత్ వేవ్‌..ఎన్టీఆర్ హోరుతోనే పోల్చాలి..ఇక ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తుందల్లా ఎన్నికల కోసమే..కానీ అవి ఇప్పట్లో రావు(షెడ్యూల్ ప్రకారమైతే) వచ్చే ఏడాదే లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి..ఓరకంగా రజనీకాంత్‌కి అవి 
లిట్మస్ టెస్ట్‌లా పనికిరావచ్చు

Comments