కత్తిని చూసి నేర్చుకుందా...


మామూలుగా చూస్తే మహేష్ ఓ సాధారణ వ్యక్తిగా కన్పిస్తాడు. టివిలో చూస్తే విడుదలైన సినిమాలకు రివ్యూలు చెప్పుకుంటూ పొట్ట పోసుకునే ఓ జీతగాడు కన్పిస్తాడు..కానీ ఎప్పుడైతే పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తూ...కౌంటర్ ఎటాక్స్ చేయించుకుంటూ టివి చర్చల్లోకి వచ్చాడో..అతగాడికి పాపులారిటీ పెరిగిపోయింది. ఇపుడు ఆంధ్రదేశాల్లో 60శాతంమందికి అతని ఉపోద్ఘాతం అవసరం లేదంటే అతిశయోక్తి కాదు. మరి అతగాడిని ఆదర్శంగా తీసుకుందో..నిజంగానే ఆవేదనో తెలీదు కానీ అనసూయ కూడా మొదలెట్టింది

" నా వ్యక్తిగత స్వేఛ్చ హరిస్తున్నారు..నా ఆశలు సమాధి చేస్తున్నారు. ఇవన్నీ నేను భరించాలా..ఏం చేయలేమా" అంటూ మాంఛి సెంటిమెంట్ ఆయిట్ మెంట్‌తో జనం ముందు ట్విట్టర్ పిట్ట వేదికగా ప్రశ్నలవర్షం కురిపిస్తుందామె. నిజంగా అనసూయకి ఇంత కష్టం వస్తే అందరూ బాధపడాల్సిందే..ఈ సందర్భంగా ఆమె ట్వీట్లలో పొందుపరిచిన అంశాలు మరీ అతిగా ఉన్నాయ్. నా దుస్తులపై కామెంట్లు చేస్తున్నారంటూ వాపోయింది నిజానికి ఇలాంటి అంశాలపై అందరికీ (అంటే అందరు స్త్రీలకూ ఇదే వేదన ఉంది. అందుకే హైదరాబాద్‌లో సగంమంది స్త్రీలు మొహాలకు స్కార్ఫ్‌తో కప్పుకుని మరీ తిరుగుతుంటారు..కాస్త కంటికి ఇంపుగా కన్పిస్తే చాలు సొల్లు కార్చుకుంటూ అదేపనిగా చూసే చూపులనుంచి తమకి తోచిన రీతిలో తప్పించుకునే ప్రయత్నం అది)  ఐతే అనసూయ అంత రేంజ్‌లో 
ఉన్నవాళ్లకి ఇలాంటి అనుభవాలు ఇంటర్నెట్‌లో తప్ప డైరక్ట్‌గా కామెంట్లు చేయడం కానీ వేధింపులు కానీ జరిగిన సందర్భాలు తక్కువ. ఎందుకంటే వారికున్న సెలబ్రెటీ స్టేటస్‌ని బట్టి కంప్లైంట్ ఇవ్వగానే చర్యలు ఉంటాయి 

కానీ ఇప్పుడు అనసూయ ట్విట్టర్ వేదికపై వాపోయిన వైనం మాత్రం హాస్యాస్పదమే, ఎందుకంటే ట్విట్టర్, ఫేస్ బుక్ ఈ రెండు వేదికలపై ఎవరు పడితే వారు కామెంట్లు చేయడానికి లేదు. మన స్నేహితులు మాత్రమే చేస్తారు. ముక్కూ మొహం లేనివారు కూడా కామెంట్ చేస్తున్నారంటే దానికి మనం మనకి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అనుమతించబట్టే..అలా అనుమతిస్తున్నామంటే..దాని అర్ధం పాపులారిటీ కోసమనే..అంటే పాపులారిటీకోసం వెంపర్లాడుతున్నానాం కాబట్టే ఇలాంటి పితలాటకాలు ఎదురువుతున్నాయ్. అదే ఇదివరకు యాహూ మెసెంజర్ , రెడిఫ్ బోల్ కానీ చూడండి మనకి తెలిసిన వ్యక్తులే మన స్నేహితులుగా ఉండేవాళ్లు ఎలాంటి స్పామ్ కామెంట్లు వచ్చినా వెంటనే తొలగించుకునే వీలు ఉఁడేది. అంటే ఇక్కడ చుట్టూ పేడ పేర్చుకుంటున్నదీ మనమే..తర్వాత దుర్వాసన వస్తున్నది అని  వాపోతున్నదీ నిజమే..మా అనుమానం నిజం కాకుంటే..అనసూయని టివి9, ఏబిఎన్ సహా అన్ని  ఛానళ్లూ చర్చకి పిలిచేవి. పైగా గణతంత్రదినోత్సవానికి స్వాతంత్ర దినోత్సవానికీ తేడా తెలీకుండా స్వేఛ్చా స్వాతంత్ర్యాలపై వేదన ఎందుకు వెల్లిబుచ్చడం. అసలు అనసూయా..! ఇలా ప్రత్యేకమైన సందర్భాలే అవసరం లేదు మీ హక్కులు మీ మనసు భాదపరిచిన సమయంలో ఎప్పుడైనా బహిరంగపరచవచ్చు..కేసులు పెట్టవచ్చు న్యాయం డిమాండ్ చేయవచ్చు కానీ ఓ పక్కన బూతు ప్రొగ్రామ్‌లు చేస్తూ..నీతులు చెప్పడం మాత్రం అతకదు. ఎందుకంటే బార్ షాపులో కూర్చున్నవాడు గాంధేయవాదంపై లెక్చర్లు ఇవ్వడం  హర్షించరు కదా..ఈ మాట అన్నంతమాత్రాన మీపై దాడిని సమర్ధిస్తున్నట్లు కాదు అనసూయా! దీనికి రెండే మార్గాలు..వస్తున్న కామెంట్లను పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం పెట్టే ప్రతి పోస్టూ మన కోసం ..మన మిత్రుల కోసం..అంతేకానీ ఎవడో గొట్టంగాడు స్పందిస్తే దానిని చదవడం కోసం కాదు.ఓకే లేదంటే మరో కత్తిలా అవతరిస్తానంటే మీ ఇష్టం

Comments