అదేం టిటిడి ఛైర్మన్ పదవైతే ఎలా ఉండేదో బాబూ!




నటుడు మోహన్‌బాబు ఉరఫ్ మంచు భక్తవత్సలం నాయుడికి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవసన్నిధానం బోర్డు ఛైర్మన్‌ పదవి దక్కింది.దర్శకనిర్మాత విబి రాజేంద్రప్రసాద్ ఆలోచనతో ప్రారంభమైన ఈ ఆలయానికి ఎక్కువగా ఫిల్మీ పీపుల్‌ మాత్రమే వస్తుంటారు. అన్ని దేవతల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించడంతో పాటు పక్కనే క్లబ్ కూడా ఉండటంతో ఇది ఎక్కువగా ఓ గుడిలా కాకుండా మీటింగ్ ప్లేస్‌లా మాత్రమే వాడుతున్నట్లు కన్పిస్తుంది. కింద అటూ ఇటూ పోయే వాహనాలు , షాపింగ్ కాంప్లెక్స్‌లతో ఓ కమర్షియల్ టెంపుల్‌లా అలరారుతూ ఉంటుంది
అలాంటి దేవాలయానికి మోహన్ బాబు సహా మరో 12మంది బోర్డు సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసారు..ఐతే ఇదేదో టిటిడి బోర్డు ప్రమాణస్వీకారమంత హడావుడి చేయడం చిరాకు పుట్టించకమానదు. పైగా మోహన్ బాబు ప్రసంగం కూడా అలానే ఉంది. నాకు వద్దు వద్దంటున్నా సుబ్బరామిరెడ్డి బలవంతంగా ఒప్పించారనే చెప్పారు. పండగరోజుల్లో తప్ప పెద్దగా హడావుడి లేని ఈ గుడి పదవి నాకెందుకు అనుకున్నాడో మరి శంషాబాద్ నుంచి ఇక్కడకు కనీసం
నెలకి ఓసారి రావాలన్నా డిస్ట్రబెన్స్ అనుకున్నాడేమో కానీ తనకి ఈ పదవి వద్దన్నట్లే మాట్లాడాడు ఆయన. ఐతే గుడి ఎంత చిన్నదైనా పెద్దదైనా దాని పవిత్రత దానికి ఉంటుంది. అప్పట్లో మురళీమోహన్ మృత్యుంజయహోమం కూడా చేయించాడీ ఆలయంలోనే..!

 తన కోపాన్ని ఏ దశలోనూ దాచుకోని మోహన్ బాబు మరి ఈ చిన్న పదవిని ఎలా నిర్వహిస్తాడో ఎందుకంటే, గతంలో..విఐసి క్యూలైన్లపై ఆయన కుమార్తే స్వయంగా ట్వీట్లు చేసిన సందర్భంలో తన ప్రవర్తన హుందాగా ఉంటుందో..దర్పం ప్రదర్శిస్తాడో అనే ఆసక్తి వ్యక్తం కాకమానదు.


Comments