బిగ్ స్క్రీన్‌పై ...వైఎస్ఆర్ ఇదీ అసలైన న్యూస్


డా.వైెఎస్ రాజశేఖర్ రెడ్డి..ఈ పేరు తెలుగువారిని వదలని పేరు. శత్రువులుగా భావించే వారు కూడా ఇప్పటికీ తమ సంభాషణల్లో తమ రాతల్లో ఈయన పేరు ప్రస్తావించాలంటే ఎక్కడలేని ఉత్సాహం. అందుకే ఇప్పుడీయనపై ఓ సినిమా రాబోతోందంటే అటు ఆయన అభిమానుల్లో ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద బజ్ వర్డ్ అవుతోంది. ఇప్పుడే బ్లాస్ట్ అయింది ఇక పూర్తయ్యేంతవరకూ వార్తల్లోనే ఉంటుందనడంలో సందేహం లేదు

యెడుగూరి సందింటి రెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి వైఎస్ఆర్ వరకూ ఆయన ప్రస్థానంలో సగం భాగం జనం ముందు పరిచిన పుస్తకం. అంతకు ముందు ఆయన తండ్రి గురించి ఆయన గురించి విన్పించేవి కథలే..వాటిలో నిజమెంతో అప్పటి సాక్షులకూ..వారికి మాత్రమే తెలుసు. ఆనందోబ్రహ్మ అనే హార్రర్ బేస్డ్ సినిమా తీసిన మహి అనే దర్శకుడు ఇది తీస్తారట.

డా.వైఎస్ చనిపోయిన సమయంలో పూరీ జగన్నాధ్ రాజశేఖర్ డబుల్ రోల్‌లో వైెఎస్ లైఫ్ హిస్టరీపై సినిమా తీస్తానని టివి9 స్టూడియోలోనే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వారికి జగన్‌తో పడక పార్టీ నుంచి బైటికి పోవడంతో ఆ అంశం ప్రతిపాదనగానే మిగిలిపోయింది. తర్వాత వినోద్ కుమార్, భానుచందర్ యమున పాత్రధారులుగా  భగీరధుడి పేరుతో ఓ సినిమా వచ్చింది ఐనా అది పెద్దగా ఆడింది లేదు

కానీ ఇప్పుడు మమ్ముట్టి హీరో అనేసరికి దీనిపై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయ్. తెలుగులో మమ్ముట్టి డైరక్ట్ గా స్వాతికిరణం, రైల్వేకూలీ వంటి సినిమాలు చేశారు. దాదాపు 60 ఏళ్ల వయస్సులోనూ మలయాళంలో ఛార్మ్ తగ్గకుండా సూపర్ స్టార్ డమ్ మెయిన్‌టైన్ చేస్తోన్న మమ్ముట్టి వైఎస్ రోల్ ఎలా చేస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ సినిమాపై అంచనాలు ఇవి..మిగిలిన వివరాలు త్వరలో వచ్చేస్తాయట

Comments