పెళ్లికొడుకు జంప్..పెళ్లి కూతురూ జంప్


ఈ మధ్యన పీటలవరకూ వచ్చిన పెళ్లిళ్లు వధువు కానీ వరుడు కానీ మాయమైపోతుండటంతో ఆగిపోయిన
సంఘటనలు వింటున్నారు. ఐతే కర్నాటకలో మాత్రం ఇంకాస్త భిన్నంగా ఇద్దరూ వెళ్లిపోవడం చూపరులకు ఆశ్చర్యాన్నివినేవాళ్లకి వినోదాన్ని కలగజేస్తోంది. కోలార్ జిల్లా మాలూరు టౌన్‌లో గురేష్, సౌమ్య పెళ్లి నిన్న జరగాల్సి ఉంది. ఐతే పెళ్లి ముహూర్తం దగ్గరపడుతున్నా సౌమ్య మాత్రం మంటపానికి రాలేదట..అనుమానం వచ్చి వెతికితే అప్పటికే ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో జంపైనట్లు తెలిసింది. ఇక ఎలాగోలా గురేష్‌కి సర్దిచెప్పి సౌమ్య బాబాయ్ కూతురుని పెళ్లి కూతురుగా ఒప్పించారు

ఐతే ఇక్కడా ఓ ట్విస్ట్...షేవింగ్ చేయించుకుంటా..అంటూ మనోడు కూడా తన గాళ్ ఫ్రెండ్‌తో జంపయ్యాడట..ఇదంతా చూస్తుంటే ఏదో తెలుగు సినిమా గుర్తుకురావడం లేదూ..! ఇది కావాలని ఈ ఇద్దరూ కలిసి ప్లాన్‌డ్‌గా అనుకునే తమకి కావాల్సినవాళ్లతో వెళ్లిపోయి ఉంటారని కొంతమంది అనుకుంటున్నారు. అందుకే అప్పటికప్పుడు రెడీమేడ్‌గా ఉడాయించారని టాక్..ఐతే మధ్యలో సౌమ్య బాబాయి కూతురు వెంకటరత్నమ్మే బుక్ అయిపోయింది మరి..ఎందుకంటే గురేష్‌తో అప్పటికప్పుడు నిశ్చితార్దం చేశారు మరి..ఈ రెండు  జంటలనీ పోలీసులు తొందర్లోనే పట్టుకొస్తామని చెప్పారట అదీ విషయం

Comments