చంద్రబాబు హెల్త్ బాలేదు..! పొత్తు చెడినందుకేనా ఆ మాటలు


ఏపి సిఎం చంద్రబాబు దావొస్ టూర్ పూర్తికాగానే, తన పర్యటన విశేషాలు, పెట్టుబడులు, వాటి కొసం తాను పడిన శ్రమ చెప్పారు..ఇది ప్రతి పర్యటన తర్వాత ఉండేదే! ఐతే ఈసారి మాత్రం ఆయన ప్రతిపక్షనేతపై విమర్శలతొ పాటుగా..వచ్చే ఎన్నికలను దృష్టిలొ పెట్టుకుని చేసిన రెండు మూడు కామెంట్సు మాత్రం భవిష్యత్ యవనికను చెప్పేలానే ఉన్నాయ్. అఁదులొ ఒకటి బిజెపితొ పొత్తు విషయంల పరిస్థితి తన చేయి దాటిపొయినట్లే భావించేలా ఉంది. ఎందుకంటే తన పార్టీ వారిని తాను కంట్రొల్ చేసినట్లు..ఇంకా చేస్తున్నట్లుగా చెప్తొన్న చంద్రబాబు, అవతలి పార్టీ వారిని మాత్రం కామెంట్ చేయలేదు..తమతొ స్నేహం వద్దనుకుంటే నమస్కారం పెట్టి ఆ తర్వాత మాట్లాడతాననడం..నిస్పృహగానే చూడాలి. ఎందుకంటే ఈరొజుకీ కేంద్రంలొని బిజెపి రాష్ట్రానికి ఒరగబెట్టిందేం లేదు. ఆ మాటికి వస్తే చంద్రబాబు గట్టిగా అడిగిందీ లేదు. ఆ పార్టీతొ కలిసి ఎన్నికలకు వెళ్లినందుకు ఖచ్చితంగా బాధ్యత బిజెపిపైనే ఎక్కువ ఉంటుంది. కానీ అది తన రాజకీయ ప్రాబల్యం కొసం ఇలా టిడిపికి హ్యాండ్ ఇవ్వడం అర్ధం చేసుకొదగినదే అయినా...మధ్యలొ రాష్ట్రం ప్రయొజనాలు గాల్లొ కలిసినట్లే అనుకొవాలి. జనం ఆశలతొ ఆడుకుంటూ వైఎస్సార్సీపీతొ కలిసినంత మాత్రాన రేపొద్దున్న బిెజెపికి ఒట్లు గంపగుత్తగా పడతాయనుకొవడం భ్రమే. అఁదుకే వచ్చే ఎన్నికలలొ బిజెపి, కాంగ్రెస్ రెండింటికీ జనం ఒటేయకుండా ప్రాంతీయపార్టీలకే మెజారిటీ కట్టబెడితే ఎక్కువ లాభాలు తెచ్చుకొవచ్చు. కానీ అటు చంద్రబాబు ఇటు జగన్ ఇద్దరూ ఏ మేరకు ఇలా పొరాడతారన్నది అనుమానం. జగన్ పొరాటంలొ వెనక్కి తగ్గకపొతే..ఎక్కువ సీట్లు తెచ్చుకున్నా హొదా కొసం నిలబడితే వైఎస్సార్ కాంగ్రెస్ చిరకాలం రాష్ట్రంలొ నిలబడుతున్నది సత్యం.. ఎందుకంటే హొదా కావాలి పది కాదు పదిహేనేళ్లు అనగానే...సూపర్  అంటూ  భాజాభజంత్రీలు వాయించుకున్నది బిెజెపి, టిడిపి..   ఇప్పుడు బిజెపి నేను ఇవ్వను అనగానే...అవును..హొదాతొ ప్రయొజనం లేదు అన్న టిడిపిని నమ్మడం అనేది జరగదు( హొదా అంశం ఒక్కటే పరిశీలిస్తే)



ఇక రెండొది తనకి అనారొగ్యంగా ఉన్నా కూడా దావొస్‌లొ కష్టపడుతూ రాష్ట్రప్రయొజనాల కొసం తాపత్రయ పడుతున్నా అఁటూ బాబు చెప్పడం.. ఇది నిజంగా ఆలొచించాల్సిన విషయం. ఐతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన బృందంతొ దావొస్‌కి వెళ్లినప్పుడు భారం మొత్తం ఆయన మీదే వేయడం ఆయన తీసుకెళ్లిన టీమ్ వైఫల్యమే..పరకాల ప్రభాకర్ లాంటి మీడియా మేనేజర్ కూడా ఉన్నప్పుడు ఆ దుబాసీ పాత్ర ఏదొ ఆయనే పొషించాల్సింది. అయినా ఇంతమందిని వెంటేసుకుని వెళ్లినా ఒక్క బాబే అక్కడ అన్నీ చక్కదిద్దారంటే వీళ్లని ప్రతి చొటకీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉఁదొ లేదొ ఆయనే ఆలొచించుకొవాలి.  

అది వదిలేస్తే..ఇలాంట ిఅనారొగ్యాలను ఏకరువు పెట్టడం ద్వారా ఆయనే పత్రికలకు కావాల్సినంత మేత అందించినట్లవుతుంది. ఈపాటికి సొషల్ మీడియాతొ పాటు..వెబ్ పేపర్లలొ కూడా చంద్రబాబు నిబద్దత, పట్టుదలపై కథనాలు తయారైపొయాయ్ కూడా! చంద్రబాబే లేకపొతే..నెక్స్ట్ ఎవరు ఆయన పాత్రని పొషించాలనే ప్రశ్నని వదిలినట్లే..కేవలం లొకేష్‌కి కార్యభారం అప్పగించవచ్చు కదా అనే వంధిమాగధులకు చంద్రబాబు ఈ రూపేణా ఒక అవకాశం ఇచ్చారా  ఏంటనే సందేహాలు కూడా కలిగితే ఆ తప్పు వారిది కాదు. కొంతమంది బిజెపితొ పొత్తు చెడిపొయినందుకే ఇలా సెంటిమెంట్ తట్టిలేపే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు అఁటున్నారు.  కానీ ఇక్కడ ఒక విషయం చంద్రబాబుగారు ఖచ్చితంగా ఆలొచించుకొవాల్సిన సమయం ఉంది. రాజధాని నిర్మాణం కానీ..ఇతర విషయాల్లొ ఇచ్చిన హామీలు కానీ అమలు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఈ తరుణంలొ అనారొగ్యం మీ సంకల్పాన్ని దెబ్బతీయకూడదు..అందుకొసమైనా కనీసం ఒక నాలుగు రొజులు రెస్ట్ తీసుకొవాలి. చిన్న విరామం తర్వాత ద్విగుణీకృతమైన ఉత్సాహంతొ తిరిగి పనిలొకి రావచ్చు.  అంతేకానీ అదేపనిగా ఆరొగ్యాన్ని అశ్రధ్ద చేస్తే తగిన మూల్యం చెల్లించుకొవాల్సి రావచ్చు




Comments