శ్రేష్టకీ జరిగిందట..ఇంతకీ ఆ లైడీ డైరక్టర్ కథ ఎలా మొదలైంది


అర్జున్ రెడ్డి, పెళ్లిచూపులు ఈ రెండు సినిమాలు విజయ్ హీరోగా వచ్చినవే..అలానే ఈ రెండు సినిమాలకు ఓ మహిళా పాటల రచయితనే పని చేసింది. ఆమే శ్రేష్ట..మి టూ అనే ఆన్ లైన్ కాంపైన్ కాస్టింగ్ కౌచ్‌కి వ్యతిరేకంగా ఒకటి ఇప్పుడు  ఇండస్ట్రీలో నడుస్తోంది. దానిపై శ్రేష్ట కూడా తన అనుభవం పంచుకుంది. ఇఁడస్ట్రీలో ఓ లేడీ డైరక్టర్ స్వయంగా శ్రేష్టని తార్చే ప్రయత్నం చేసిందని ఆమే చెప్పుకుంది. ఆ మహిళా దర్శకురాలిని చెప్పుతో కొట్టాలని కూడా అన్పించిందని చెప్పింది

ఇంతకీ ఆ కథ ఎలా మొదలైందంటే గోవాలో ఓ ఫిల్మ్ ఫెస్టివల్ జరగగా..దానికి సదరు లేడీ డైరక్టర్ శ్రేష్టని కూడా ఆహ్వానించిందట అక్కడే ఓ వ్యక్తిని చూపించి..అతను నిన్ను ఇష్టపడుతున్నాడు ప్రపోజ్ చేస్తాడట అని పంపిందట..తీరా అతగాడి దగ్గరకు వెళ్తే ..లేడీ డైరక్టర్ బ్రోకర్ లా పని చేసిన విషయం అర్ధమైందట. శ్రేష్టని అతనితో గడిపేందుకు పంపినట్లు కలరింగ్ ఇచ్చిందని సదరు సోగ్గాడు చెప్పాడట. దీంతో వళ్లు మండిన శ్రేష్ట వాళ్లిద్దరిపై కేసు పెడతా అని బెదిరించగా అలా ఆ కథ ముగిసిపోయిందట.  ఇండస్ట్రీలో అలా మొదలైన  ఆ డైరక్టర్ ఎవరో ఈ పాటికి మీకు అర్ధమైపోయిందనుకుంటా.

మీ టూ కాంపైన్‌లో తన అనుభవం మిగిలినవారికి ఓ పాఠంలా ఉంటుందని ఇండస్ట్రీలో లుచ్చాగాళ్లే కాదు లుచ్చా లేడీలు ఉంటారని తెలుసుకోవాలని చెప్తోంది శ్రేష్ట

Comments