ఇంకేదీ దొరకలేదా..ఇవేం లాగుళ్లు


ఎప్పుడో వందేళ్లో..రెండొందలఏళ్ల క్రితమో కోడి రామ్మూర్తి అనే ఒకాయన ఉండేవాడట. ప్రపంచ వస్తాదులతో పోటీ పడేంతగా కాయం పెంచడమే కాకుండా..కుస్తీల్లో ఆయనకి ఆయనే సాటి అని చెప్తుంటారు. అత్యంత బరువైన వస్తువులను లాగడంలో ఆయన పేరే విన్పించేదట..ఆ తర్వాత కాలంలో ఇలాంటి ఫీట్లకు ఆదరణ  తగ్గడంతో పెద్దగా పట్టించుకోవడం మానేశారు. 
అయితే అప్పుడప్పుడూ మాత్రం అదిగో ఆయన తన జుట్టుతో కారు లాగాడట..ఇదిగో ఈ అమ్మాయి పళ్లతో లారీ లాగిందట లాంటి వార్తలు చూస్తున్నాం..ఐతే ఇప్పుడు ఓ  సాధువు మాత్రం ఏకంగా తన అంగంతో ట్రాక్టర్ ని లాగి చూశారా నా మగతనం(సత్తా) అంటూ తొడకొడుతున్నాడు..అసలు ఏదీ లేనట్లు దాంతో ట్రాక్టర్ లాగడమేంటని అనుకోవద్దు. ఎహ అసలు ఏదైనా ఎందుకు లాగాలి..దానికంటూ ఇంజన్..మోటర్ ఉన్నాయ్ కవదా
వాటిని వదిలేసి..పళ్లు వళ్లూ..కాళ్లతో లాగడమేంటని ఈసడించుకోవద్దు. ఎందుకంటే ఎవరి పిచ్చి వారికి ఆనందం.

అలహాబాద్‌లో జరిగే కుంభమేళాల్లో ఇలాంటి దిగంబరసన్నాసులు ఎప్పుడూ తచ్చాడుతుంటారు. నా శక్తి ఇదిగోనంటూ చూపిస్తుంటారు.వీటివలన జనానికి ఒరిగేదేంటో తెలీకపోయినా..వెర్రి వేయి విధాలు అనుకోవాల్సిందే

Comments