అది మేక తలకాయా..బాబా ముద్ర కాదా?


రజనీకాంత్ తన పార్టీ సింబల్‌గా దాదాపుగా ప్రచారం చేస్తొన్న ముద్ర ..యొగ ముద్ర కాదట..అవి మేక తలకాయకి గుర్తులట..ఇది పాపం ఒకప్పటి రజనీకాంత్ మిత్రుడు ఇప్పటి తమిళ జనరక్షకుడు శరత్ కుమార్ చెేస్తొన్న విమర్శలు..ఆయన దానికి కొనసాగింపుగా ఇఁకా చాలానే మాటలు అన్నాడు 1996లొ జయలలిత దెబ్బకి తట్టుకొలేక రజనీ విదేశాలకు పారిపొతే తాను మాత్రం ధైర్యంగా పొరాడాడట..అప్పటి విషయాలు ఇంకా జనం మదిలొ లేవనుకున్నాడొ ఏమొ కానీ..శరత్ కుమార్ చేస్తొంది ఖచ్చితంగా ఒవరాక్షనే..ఎలాగంటారా...

చూడండి ఫస్ట్ డైలాగ్ రజనీకాంత్ వెళ్లిన గుహలొకి వెళ్లి చూస్తే అక్కడ బాబా యొగ ముద్ర లేదట..అవును అసలు ఆ మహావతార్ బాబా ఉన్నాడొ లేడొ కానీ అక్కడకు వెళ్లి చూసిందెవరు..ఇక ఆయన ముద్రలు కూడా ఎలా కన్పిస్తాయ్..
సరే రెండవ ఆరొపణ 1996లొ రజనీకాంత్ జయలలిత దెబ్బకి విదేశాలకు పారిపొతే శరత్ ఎదురొమ్ము విరుచుకుని పొరాటం చేశాడు..చూద్దాం ఇది పాయింట్ బై పాయింట్ ...


అప్పటికి శరత్ కుమార్ కి ఒక పార్టీ అంటూలేదు...మరి  ఏం చేస్తున్నాడు..ఆయన ఎవరినైతే  ఎదిరించానని చెప్తున్నాడొ ఆమె పార్టీనే అఁటే అన్నాడిఎంకే పార్టీకే సపొర్ట్ ఇచ్చాడు..జయలలితకి చాలా క్లొజ్‌గా మూవ్ అవడమే కాకుండా తన సినిమాల ఒపెనింగ్స్ కి పిలుచుకుంటూ ఎంజాయ్ చేస్తుండేవాడు..మరి నిజంగానే జయలలితకి వ్యతిరేకంగా ఏం చేయలేదా...చేశాడు..ఎప్పుడు చేశాడొ తెలుసా..! తన నాట్టామై సినిమా(ఇదే తెలుగులొ బొలెడంత డబ్బులు పొసి రీమేక్ రైట్స్ కొనుక్కుని పెదరాయుడిగా మొహన్ బాబు తెలుగులొ తీసి తన స్టార్ డమ్ తెచ్చుకున్నాడు) జయటివిలొ ప్రదర్శితమైనప్పుడు బైటపడ్డాడు..ఎందుకంటే..ఆ సినిమ ా ప్రొడ్యూసర్ ఆర్‌బి chowdary తాను శరత్ కుమార్ పర్సనల్‌గా చూసుకుంటాడని ఇచ్చిన వీడియొ టేప్ ని జయటివిలొ ప్రసారమైందంటే దానికి కారణం శరత్ కుమార్ అనే కొపగించుకుని నొటీసులు పంపాడు..కానీ అప్పుడు శరత్ కుమార్ తాను  ఆ వీడియొ టేప్‌ని జయలలిత సినిమా చూస్తానంటే ఇచ్చాను కానీ..అలా టివిల్లొ ప్రసారం చేసేందుకు కాదన్నాడు..ఇంతకీ అంత పట్టింపు ఎందుకంటే అప్పటికి నాట్టామై రిలీజై ఇంకా థియేటర్లలొ ఆడుతూనే ఉందట..మరి ఇప్పుడు శరత్ కుమార్ ముందు ఉన్న మార్గం ..ఈ  విషయంపై అటు జయటివి కానీ..జయలలిత కానీ ఇద్దరూ తనకి వివరణ ఇవ్వాలని కొరాడు..అలా అడగగానే..జయలలిత అందులొనూ పవర్‌లొ ఉన్న పవర్‌ఫుల్ లేడీ..ఆమె ఫ్యాన్స్ ఊరుకుంటారా...ఇప్పటి కత్తి మహేష్-పవన్ కల్యాణ్ యవ్వారంలాగా..ప్రతి చొటా శరత్ కుమార్‌పై దాడి (మాటల) జరిగింది..దీంతొ విసిగిపొయిన శరత్ కుమార్ అదిగొ అప్పుడు ఆ పార్టికి సపొర్ట్ ఇవ్వడం మానేసి..రజనీకాంత్‌తొ ఏదీ...ఇప్పుడు చెప్తున్నాడే విదేశాలకు పారిపొయాడని ఆ రజనీకాంత్‌తొనే చేతులు కలిపి జయలలితకి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. 1996లొ డిఎంకేలొ చేరాడు..1998లొ కరుణానిధి అతగాడిని లొక్‌సభ బరిలొ నిలిపాడు..ఐతే పరాజయం తప్పలేదు..ఐనా పాపం ముసలొడు కరుణానిధి మనొడిని 2001లొ రాజ్యసభ మెంబర్ని చేశాడు..

.మరి ఆ తర్వాత  ఏం చేశాడొ తెలుసా..ఖచ్చితంగా 2006 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్దొడికి హ్యాండిచ్చేశాడు..తన రెండొ పెళ్లాం రాధికతొ సహా మళ్లీ జయలలితతొ కలిసిపొయాడు. మళ్లీ ఏడాది తిరిగేలొపే ఆ  పార్టీ నుంచి బయటకి వచ్చేశాడు. 2007లొ సొంతకుంపటి పెట్టుకున్నాడు. ఆల్ ఇఁడియా సముత్తవ మక్కల్ కట్చి..ఇదీ దాని పేరు..మరి అప్పుడైనా కుదురుగా ఉన్నాడా...మళ్లీ 2011 ఎన్నికలకు ముందు  అన్నాడిఎంకేతొ కలిసి పొటీ చేశాడు..
రెండంటే రెండు సీట్లు కేటాయించింది జయలలిత..చప్పున వాటిలొ గెలిచి (తెన్‌కాశి, నన్గునేరి) గప్‌చిప్ సాంబార్ బుడ్డిలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపొయాడు. అందులొ నన్గునేరిలొ గెలిచిన కాండిడేట్ ఏ నారాయణన్ అనే ఎమ్మెల్యే పార్టీ వ్యతిరేక పనులు చేస్తున్నాడంటూ సస్పెండ్ చేశాడు..ఇక 2016 అసెంబ్లీ ఎన్నికల్లొ తానూ తెన్‌కాశి నుంచి ఒడిపొయాడు. ఇదీ ఆయన రాజకీయ జీవితం..ఇంత కెరీర్‌లొ ఎక్కడైనా...జయలలితకి వ్యతిరేకంగా పొరాడిన దాఖలా కన్పిస్తుందా..! (
అలాంటి శరత్ కుమార్ ఇప్పుడు రజనీకాంత్‌ ఫారిన్ పారిపొయాడని..తమిళుడు కాడని..ఇఁకా ఇలాంటి బొలెడన్ని కామెంట్లు చేస్తున్నాడు( పైగా వీళ్లిద్దరూ ఎక్కడ చూసినా పాలూ నీళ్లలా కలిసి కన్పిస్తారు కానీ..ఎక్కడా రజనీకంత్ ఇతగాడిని కేర్ చేసిన దాఖలాలు కన్పించవ్)..ఇంత చదివిన మీకు ఎలా ఉందొ కానీ..అరవతంబిలు సరైన సమాధానం చెప్పరంటారా..!

Comments