జాబొచ్చిందంటా ఇదెట్టా..ఇదెట్టా


ఏపీకి మూడున్నరలక్షలకోట్ల పెట్టుబడులొచ్చేశాయ్. అందరికీ ఉద్యోగాలు వచ్చేశాయ్. అసలు నిరుద్యోగ భృతి 
ఇవ్వాల్సిన అవసరమే లేదు. అనవసరంగా మంత్రి లోకేశ్ ఇదిగో ఇప్పుడిస్తాం అప్పుడిస్తాం అంటూ హైరానా
పడుతున్నాడు కానీ అంత సీన్ లేదు. ఖచ్చితంగా ఇంకో నెలలో అంతా చంద్రబాబు ఫోటోలకు పాలాభిషేకం 

చేస్తారు..ఇదీ టిడిపి కార్యకర్తలతో పాటు కొంతమంది అభిమానులు చెప్తోన్న మాట. చిత్తూరు జిల్లా వరదాయపాళ్యెం దగ్గర అపోలో టైర్స్ ఫ్యాక్టరీ భూమిపూజ(మాత్రమే) చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత నాలుగేళ్లలో ఏపీలో 7.7లక్షలమందికి ఉద్యోగాలు(లేదంటే ఉపాధి) కల్పించామని చెప్పారు. 

ఈ సందర్భంలోనే పైన మాటలు విన్పిస్తున్నాయ్. నిజంగా ఇంతమందికి ఉపాధి దక్కితే ఇక వచ్చే ఎన్నికల్లోనూ జగన్ కి ఉపాధి దొరకదన్నమాటే..కానీ నిజంగా పరిస్థితి అలా ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ ఏటికి ఆ ఏడు సిఐఐ సమ్మిట్స్ పెట్టుకుని లక్షలకోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని చెప్పడమే కానీ..ఇంతవరకూ వాటిలో కనీసం పది కంపెనీలు కూడా తమ పనులు ప్రారంభించలేదు అలాంటప్పుడు ఏ ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు భర్తీ చేసారో తెలీదు. వేలనుకోవచ్చు..అత్యధికంగా లక్ష ఉద్యోగాలు అనుకోవచ్చు కానీ 
ఏకంగా 7.70లక్షలమందికి ఇచ్చేసామంటే అంత తేలికైన విషయం కాదు. ఇంకా వీటికితోడు మరో 13 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పడం మరీ విడ్డూరం. అసలు మన ఏపీలో అంతమంది నిరుద్యోగులు ఉన్నారా అని అన్పిస్తే అది మన తప్పు కాదు. ఎందుకంటే ప్రభుత్వద్యోగులు 25లక్షలమందికి దగ్గర దగ్గరగా ఉన్నారనుకుంటే అదే స్థాయిలో కొత్తగా ఉపాధి కల్పించడమంటే చరిత్ర సృష్టించడమే.
ఇప్పుడు ప్రారంభించిన అపొలో టైర్స్ యజమాని మొత్తం మీద 1400మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పగా ఇలాంటివే హీరో మోటర్స్, టాటామోటర్స్, అశోక్ లేలాండ్, ఇసుజు వంటివి కూడా ఇలానే కల్పిస్తాయనకున్నావాటి సంఖ్య అంతా కలిపి ఓ యాభైవేలమందికి ఉద్యోగాలు దొరికినట్లే,వీటికి అదనంగా మరో యాభైవేల ఉద్యోగాలు వస్తే అంతా కలిపి లక్షమందికి ఖాయంగా ఉపాధి దొరుకుతుంది..అది కూడా పైన చెప్పిన ప్రాజెక్టులు పూర్తై..నిజరూపం దాల్చినప్పుడు...నిజానికి చంద్రబాబు ప్రయత్నలోపం ఉండకపోవచ్చును కానీ..అతి లెక్కలే అపహాస్యం పాలు చేస్తాయ్

Comments