సీన్‌లో అంతా ఓకే..పాపం అసలలోళ్లే లేరు


పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభానికి ఆరంభం అదరడం భారీగా సాగడం అంతా ఆశ్చర్యమేం ఉఁడదు..ఐతే ఈ సందర్భంగా ఆయన చేస్తోన్నయాత్రికి పాపం ఇంట్లోవారెవరూ హాజరు కాకపోవడమే కాస్త జాలిగొలిపే అంశం. విదేశాలనుంచి తెచ్చుకున్న భార్యచేత  తిలకం దిద్దించుకుని ముందుకు సాగడం సినీఫక్కీలో సాగినా..ఇక ప్రసంగాలు గత ప్రజారాజ్యం పంథాలోనే సాగుతాయనడంలో సందేహం లేదు..మధ్యలో చంద్రబాబు, కేసీఆర్‌ని కలిసి వచ్చినంత మాత్రాన వాళ్లపై విమర్శలు లేకుండా సాగవ్. కాకపొతే డైరక్ట్ గా కాకుండా.." ఈ పాలకులు..ఇది వినాలి..నేనేమంటున్నానంటే..కాకపోతే..ఈ మాత్రం నాకు తెలీదా.. నా బలం నాకు ఉంటుంది.." లాంటి రొటీన్ డైలాగులు వినాల్సి వస్తుంది.

ఐతే ఈ యాత్ర ఎన్ని రోజులు సాగుతుందన్నది మరో డౌట్..ఎందుకంటే..ఆంజనేయుడ్ని దర్శించుకోవడం వరకూ ఓకే కానీ 3 రోజుల యాత్ర అని చెప్పడం హాస్యాస్పదమే. ఇదేదో అజ్ఞాతవాసి ప్రమోషన్ ఈవెంట్‌లా అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మూడు రోజుల్లో తిరగగలిన ఊర్లు తిరిగి ,. తిరిగి  హైదరాబాద్ రావడంలో అర్ధం ఏం ఉంటుంది..లేకపోతే దీనివెనుకా ఏదైనా వ్యూహం ఉందా అది ఆయనకే తెలియాలి.

ఇంకోవైపు చూస్తే జగన్ అటు చిత్తూరు దాటి నెల్లూరు జిల్లా సరిహద్దుల్లోకి దూసుకొచ్చేశాడు. జనం నీరాజనాలు పడుతున్నా దానికి ఎవరి ప్రోత్సాహం లేకపోవడంతో సైలెంట్‌గా సాగిపోతోంది. ఒక్క సాక్షి ఛానల్ లో మాత్రమే ఈ కార్యక్రమం ఎలా సాగుతుందో చూసే వీలుంటుంది మిగిలిన ఛానల్స్ ఏదో మొక్కుబడిగా ఒక్కొక్క వార్త వేసుకుంటూ పోతాయ్. జగన్ వెంట నడుస్తోన్న జనం నిజంగా ఓట్లేస్తారో లేదో 2019 ఎన్నికలలో తెలుస్తుంది. అంటే ఇక్కడ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న జగన్ కే తన గెలుపుపై సస్పెన్స్ కొనసాగుతుంటేపవన్ కల్యాణ్ మాత్రం తన బలం తేల్చుకోవడానికే ఇలా రెండ్రోజులు మూడ్రోజుల యాత్రతో ఏం తెలుసుకుంటాడన్నది నిజంగానే అగమ్యగోచరమే

Comments

  1. ఇంకోవైపు చూస్తే జగన్ mottaniki చిత్తూరు దాటి నెల్లూరు జిల్లా loki vachaadu. జనం venta పడుతున్నా దానికి ఎవరి ప్రోత్సాహం లేకపోవడంతో మొక్కుబడిగా సాగిపోతోంది. ఒక్క సాక్షి ఛానల్ లో మాత్రమే ఈ కార్యక్రమం ఎలా సా......గుతుందో చూసే వీలుంటుంది మిగిలిన ఛానల్స్ ఏదో మొక్కుబడిగా ఒక్కొక్క వార్త వేసుకుంటూ పోతాయ్. జగన్ వెంట పడుతున్నా నిజంగా ఓట్లేస్తారో లేదో 2019 ఎన్నికలలో తెలుస్తుంది. అంటే ఇక్కడ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్న జగన్ కే తన గెలుపుపై అగమ్యగోచరమే కొనసాగుతుంటే manamanthaa రొటీన్ డైలాగులు వినాల్సి వస్తుంది. ఐతే ఈ సందర్భంగా ఆయన చేస్తోన్నయాత్రికి పాపం YCP వారెవరూ హాజరు కాకపోవడమే కాస్త జాలిగొలిపే అంశం.

    having fun on rearranging the content... worth editing these worthless blogs...please show your creativity..thanks

    ReplyDelete

Post a Comment