కోటాకి ఏమైందసలు..జగన్,రజనీ, పవన్ ఏం చేయలేరట టిడిపి టిక్కెట్ కావాలా?


నటుడు కోట శ్రీనివాసరావు తనదైన శైలి తయారు చేసుకున్న వ్యక్తి.కెరీర్‌లో సింహభాగం కేకలు అరుపులు రంకెలతో నటించినా..పదుల సంఖ్యలో ప్రతిభ కనబరిచాడనే చెప్పాలి నాటకరంగంనుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ఆ ఛాయలు చాలా స్ఫష్టంగా కన్పిస్తాయ్. ప్రతినాయకుడు, సహాయకుడు, హాస్యం, కరుణరసం, అలా అనేక భావాలు పలికించగల
నటుడు. రాజకీయాల్లోనూ కాలెట్టి ఎంపి అయిన సందర్భం కూడా ఉంది. ఐతే అదే స్థాయిలో పక్కనున్న వాళ్లపై విమర్శలు చేయడం దానిపై వివాదాలు రేగడం వంటి సందర్భాలూ ఉన్నాయ్

ఇప్పుడు తాజాగా సెన్సేషన్ కోసమో, లేక వయసు తెచ్చిన చాదస్తంతోనో వాళ్లూ వీళ్లూ అని కాదు తనకి తోచిన ప్రతి ఒక్కళ్లపైనా విమర్శలు అది కూడా వ్యక్తిగత స్థాయిలో చేయడం విడ్డూరమే. ప్రారంభించిననాటి నుంచీ తన సంస్థలో జీతాలే నాలుగు నెలలకు ఆరునెలలకు ఇవ్వడంలో మహా ప్రసిధ్ది చెందిన ఓ ఛానల్‌ ముఖాముఖిలో ఇలాంటి కామెంట్లు చేశారాయన. 
"నటన అంటే ఎన్టీఆర్, ఆయన డైలాగులు చెప్పుకుంటూ బాలకృష్ణ ఏదో తిరుగుతుంటాడు..ఏం  చేస్తాడాయన " అంటూ బాలకృష్ణని తీసిపారేశాడు. ఆ తర్వాత జబర్దస్ట్ టీమ్ జోకులపై కూడా విమర్శలు చేశాడు కోట. "ఊరికే వెకిలి హాస్యం.. రోజాకి ఉన్న అనుభవానికి అలాంటివి చేయకూడదు "అని కూడా అన్నాడు..నిజానికి కోట శ్రీనివాసరావ్ ఈ నీతులు  తనకి వర్తించవు అనుకుంటున్నట్లున్నారు. ఎందుకంటే ఆయన కెరీర్‌లో బాబూమోహన్, బ్రహ్మానందం కాంబినేషన్‌లో కొన్ని సినిమాల్లో...ఈవివి డైరక్షన్లో వచ్చిన సినిమాల్లో బూతులే బూతులు..అసలు బూతులను జనబాహుళ్యంలోకి తీసుకువచ్చేసి..ఇదే అసలైన భాష అనేలా చేసినవారిలో కోట కూడా ఉన్నాడు. అందులో డౌట్ ఉంటే పైన చెప్పిన కాంబినేషన్ సినిమాలు చూడండి. బహుశా ఇక ఇప్పుడు సినిమాలు లేకపోవడంతో వయసు మీద పడటంతో ఇప్పుడు నీతులు చెప్పే అర్హత వచ్చిందనుకున్నాడేమో ఆయన. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఇలానే బూతు పాటలు పాడొద్దంటూ యువగాయకులకు కొన్నాళ్లక్రితం చెప్పడంపై ఇలాంటి విమర్శలే వచ్చాయ్. 

ఇక కోటలో రాజకీయ యావ చచ్చిపోలేదనడానికి నిదర్శనం..వైఎస్ జగన్ పై విమర్శలు.." ఏం చేస్తాడాయన..ఏం చేస్తాడు పవన్ కల్యాణ్, ఏం చేస్తాడు జగన్ ..ఆ..అంటే అమరావతి వద్దంటాడు..ఎక్కడ పెట్టాలి మరి" అంటూ విమర్శించాడు.  ఇదే ఎక్కువ వేడి రగుల్చుతోంది. ఎందుకంటే వైఎస్ జగన్ ఎక్కడా అమరావతి కట్టలేదని చెప్పలేదు. పైగా ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసామని ప్రకటించగానే అసెంబ్లీలో స్వాగతించాడు. ఇది కొట్టొచ్చినట్లు కన్పించేది. పైగా ఇప్పుడు చంద్రబాబు తప్ప ఎవరూ ఏం చేయలేరంటూ పొగిడింపుల పర్వానికి తెర తీయడం ఆయన అభిప్రాయం వెనుక మరో కోణం ఆవిష్కరించేదే..బిజెపి బలంగా లేకపోవడం తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్యం అనడం కూడా ఈ కోవలొకే వస్తుంది. అసలు రజనీకాంత్ కూడా ఏమీ చేయలేడంటూ వేస్ట్ అన్న తరహాలో మాట్లాడటం ఆయన మానసిక స్థితిపై అనుమానాలు కలగజేస్తోంది..ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా కోట శ్రీనివాసరావ్ తిరిగి పాలిటిక్స్‌లో వచ్చేందుకు తపన పడుతున్నాడంటే తప్పు ఏముంది. ఐతే ఇక్కడ చేసిన కామెంట్లే ఆయన మొగ్గు ఎటువైపు ఉందో స్పష్టంగా చెప్తున్నాయ్. 

Comments