సూపర్ స్టార్స్ In & As చీఫ్ మినిస్టర్


మహేష్ బాబు ' భరత్ అను నేను  ' టీజర్ లాంటి ఆడియో ట్రైలర్ వచ్చేసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తూ పలుకుతున్న వాక్యాలతో ఆడియో అదిరిపోయిందనే టాక్ వచ్చింది. మహేష్ బాబు స్వరం ఈసారి కాస్త వాళ్ల తండ్రి గారైన సూపర్ స్టార్ కృష్ణ స్వరంగా అన్పించిందని కొందరి అభిమానుల మాట. మహేష్ బాబు వాయిస్ సాధారణంగా ఎప్పుడూ కాస్త డిలేయడ్ టైప్‌గా, లో పిచ్‌లో ఉంటుంది. ఈ ఆడియో బిట్ వరకూ కాస్త హై పిచ్‌కి వెళ్లినట్లు విన్పించింది. ఎలాగున్నా ఫ్యాన్స్‌కి పండగే..సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా అభిమానించడంలో సూపర్‌స్టార్ కృష్ణ  ఫ్యాన్స్‌ పెట్టింది పేరు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం తేనెమనసులతో మొదలైన ఆ అభిమానప్రవాహం అప్రతిహతంగా సాగుతూనే ఉంది. అది మహేష్‌బాబు రాకతో ఇంకాస్త బలం పుంజుకుని మరో 50ఏళ్లవరకూ సాగేంత ధృడంగా మారింది

మరి అలాంటి సూపర్‌స్టార్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా..ఇదో ఊహాజనితమైన ప్రశ్న. ఎందుకంటే ఎంపికి,ఎమ్మెల్యేకి తేడా తెలీదని అమాయకంగా మహేష్  అన్నా,కానీ వాస్తవం అలా ఉండకపోవచ్చు. బహుశా ఎంపి విధులేంటే..ఎమ్మెల్యే ఏ పని చేస్తాడో తెలియకపోవచ్చు కానీ రాజకీయాలు ఆ ఫ్యామిలీకి కొత్తకాదు

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్‌లో ఎక్కువభాగం కాంగ్రెస్‌కే మద్దతుదారుడుగా ఉన్నాడు. ఓసారి ఎంపిగా ఆ పార్టీ తరపునే ఎన్నికయ్యాడు కూడా. ఏలూరులో బోళ్ల బుల్లిరామయ్యని 1991లో ఓడించాడంటే అది కేవలం ఆయన వల్లనే అని అంటారు. అదే నిజం కూడా..అయితే ఆ తర్వాత ఓడిపోయినా..కాంగ్రెస్‌కి మద్దతివ్వడం మాత్రం మానలేదు. వైఎస్ హయాంలో అది మరింత బలపడింది కూడా.

 అటు రాజీవ్ గాంధీ..ఇక్కడ వైఎస్ మరణాలతో కృష్ణ రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు ఇక్కడే మహేష్ ప్రాభవం కూడా పెరగడం ప్రారంభమైంది. తిరుగులేని సూపర్ స్టార్‌గా అవతరించిన మహేష్ కెరీర్‌లో కూడా భారీ ఫ్లాపులే ఉన్నాయ్. ఐనా క్రేజ్ పరంగా మాత్రం నంబర్ వన్నే. ఇప్పుడీ జ్ఞాపకమంతా ఎందుకంటే..మహేష్ పాలిటిక్స్‌లోకి వస్తే ఏంటి అనేదానికోసమే. 

ఇప్పటికే ఆయన బాబాయ్ ఆదిశేషగిరిరావ్ వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీగా ఉన్నారు. 2004లోనే కాంగ్రెస్ నుంచి తెనాలి టిక్కెట్ ఇచ్చేసినా..అవతలి వర్గం నానాయాగీ చేసి బీ ఫామ్ తో నామినేషన్ వేయడంతో సైలెంట్‌గా ఉండిపోయిన హుందాతనం ఆయనది. అందుకే జగన్ పార్టీలో ఆయనకి పోటీ లేకుండా ఎమ్మెల్సీ కాగలిగాడు

ఇక మహేష్ బావ గల్లాజయదేవ్ గుంటూరు నుంచి ఎంపిక కాగలిగాడంటే అది టిడిపి-బిజెపి మైత్రితో పాటు మహేష్ ఫ్యాన్స్‌ సాఫ్ట్ కార్నర్‌తోనే. ఇంత రాజకీయప్రాబల్యం ఉన్న కుటుంబం కాబట్టే మహేష్ ఏదో ఒక రోజుకు రాజకీయాల్లోకి వస్తాడని టాక్ ఉంది. ఇంకో ఇరవైఏళ్లకే వస్తే అంటే అది అప్పటికి ఏ పార్టీ స్వింగ్‌లో ఉంటుందో..డౌన్ అవుతుందో తెలీని పరిస్థితి. కానీ మహేష్ నిజంగా ఏదైనా పార్టికి మద్దతు ప్రకటిస్తే అది ఖచ్చితంగా మాకే అని అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు టిడిపి రెండు చెప్పుకుంటూ ఉంటాయ్. 
నిజజీవితంలో కాదు కానీ..సూపర్ స్టార్ కృష్ణ ముఖ్యమంత్రి అనే టైటిల్‌తో వచ్చిన ఓ సినిమాలో సిఎంగా నటించారు. ఇప్పుడు దాదాపు 33ఏళ్లకు మహేష్ బాబు అదే పాత్రలో కన్పించడం విశేషం..తమిళంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమా తర్వాత అర్జున్ ఫాలోయింగ్ ఎలా పెరిగిందో చూశాం..సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో అతను ప్రవేశపెట్టిన పథకాలకు ఎలాంటి ఆదరణ వచ్చిందో కూడా చూసాం..ఐతే ఆ తర్వాత అర్జున్ మాత్రం పాలిటిక్స్ వైపు చూడలేదు. ఆ సినిమా హిట్టైన సందర్భంలో అప్పటి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా నేనలానే పని చేస్తాను అని చెప్పుకోవడం గుర్తుండే ఉంటుంది(శివాజీ సినిమా విడుదల సమయంలోనూ బాబుగారు ఇలానే ప్రశంసించుకున్నారు)కృష్ణ సినిమా ఫ్లాప్..కానీ కొరటాల శివ-మహేష్ కాంబినేషన్‌లో వేసవిలో రానున్న ఈ సినిమా మాత్రం హిట్ అవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో..!

Comments