NTR బయొపిక్..ఫేస్ రికగ్నిషన్ అట మరీ అతి కాదూ!


తెలిసి రాస్తారొ...తెలియక రాస్తారొ కానీ కొన్ని రాతలు చూడగానే నవ్వొచ్చేస్తాయ్. ఈనాడు ఆంధ్రజ్యొతిలొ తమ పార్టీకి  అనుకూలంగా ప్రకటనలు ఆయా నేతల మనస్సుల్లొంచి దూసుకొచ్చేస్తాయ్. అసలు ఇఁకా ఆ సంఘటన పురుడు పొసుకొకముందే తమ అధినాయకుల స్పందన ఇలానే ఉంటుందన్నట్లుగా ప్రకటనలు తయారైపొతాయ్. న్యూస్ ఛానల్స్ అయితే బ్రేకింగుల రూపంలొ తరిస్తుంటాయ్

ఉదాహరణకు నిన్న పులివెందులలొ జరిగిన సిఎం వర్సెస్ ఎంపి సంవాదం మొదట టెలికాస్ట్ అయింది ఈటీవి ఆంధ్రప్రదేశ్‌లొ. ఆ తర్వాతే మిగిలిన అన్ని చొట్లా వచ్చాయ్. ఐతే ఎక్కడ ఈ వార్త అధినేతకు వ్యతిరేకంగా సర్క్యులేట్ అవుతుందని తెలిసిందొ వెంటనే రెండొరొజూ ముఖ్యమంత్రి అభ్యంతరం, వైసిపి ఎంపికి హుందాగా నడుచుకొవాలని సిఎం హితవు వంటి ట్యాగ్ లైన్లతొ న్యూస్ సర్క్కులేట్ చేయడం ప్రారంభించాయ్. సరే అక్కడేం జరిగిందొ వీడియొలే చెప్తాయ్. కొడలికి సుద్దులు చెప్పిన అత్త తెడ్డు నాకితే ఎలా ..అలానే అక్కడికేదొ జన్మభూమి కార్యక్రమాల్లొ టిడిపి భజన కాకుండా కార్యక్రమాలకే పరిమితం అయితే చంద్రబాబు చెప్పే వ్యాఖ్యలకు విలువ ఉఁడేది..ఆయన ఆయన అనునూయులు అందరూ పచ్చచొక్కాలతొ హాజరు అవుతూ మిగిలినవారు పార్టీ కండువాలు కప్పుకొకూడదంటే ఎలా..సరే పైన మన స్టొరీ హెడ్డింగ్ కి వద్దాం

ఎన్‌టిఆర్ BIOPICకి ఆయన భార్య క్యారెక్టర్ కొసం ఆడిషన్స్ చేస్తున్నారట..అఁదుకొసం చాలామంది వస్తున్నారట ఇదీ ఇవాళ్టి పత్రిక ఆన్ లైన్ ఎడిషన్‌లొ కన్పిస్తున్న వార్త. అందులొ వింతేం లేదు, ఐతే ఆ క్యారెక్టర్ కొసం ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్ వాడుతున్నారని వాళ్లు చెప్పారట..వీళ్లు రాస్తారట..ఏమైనా అర్ధం ఉందా..ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్ వేర్ అఁటే ఏంటి మనం వాడే వస్తువు మన ఫేస్‌ని బట్టి ఒపెన్ అవడం లేదంటే వాడుకొవడానికి అనువుగా ఉండటం..దీంతొ మనిషిని ఎలా  ఎంపిక చేస్తారు నవ్వు రావడం లేదూ...బసవతారకం ఫేస్‌ని ఇప్పుడు ఎఁపిక చేసేవాళ్ల ముఖాలతొ ఎలా రికగ్నైజేషన్ చేస్తుంది సాఫ్ట్ వేర్..అంటే ఇక్కడ వాళ్ల తాపత్రయం ఏంటంటే..గొప్ప కంప్యూటర్ పరిభాష వాడాలనే కానీ..అసలు విషయం మర్చిపొతే ఎలా..
ఇంకా కొద్దిగా మేలైన విషయం  ఏంటంటే తేజగారు డిఎన్ఏ పొల్చి క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తాననలేదు నయం. బసవతారకం పొలికలకు దగ్గరగా ఉన్నవాళ్లని ఎంపిక చేస్తాం అని చెప్తే సరిపొయేదానికి ఇంత అభాసు పాలవడం ఎందుకు

Comments