చంద్రబాబుపై 17 కేసులు.. ఒక్కటి కూడా నిలబడలేదంటే షాకే మరి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సమకాలీన రాజకీయనాయకుల్లో అరుదైన రికార్డులు ఉన్నాయ్. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా..ప్రతిపక్షనేతగా ఆయనకి ఉన్న రికార్డు ఇంకెవరికీ లేదని చంద్రబాబే స్వయంగా చెప్పుకుంటారు కూడా..వాటితో పాటే ఆయనకి ఇంకో రికార్డూ ఉంది. అది ఆయనకి వ్యతిరేకంగా 17కేసులు ఉన్నా వాటిలో ఒక్కదానిపై కూడా విచారణకు రాకపోవడం..అలా రాకుండా చేసుకోగలిగిన తెలివితేటలు..చాకచక్యం ఆయన సొంతం. అసలు ఈ కేసులలో చాలా మటుకు ఫిర్యాదు చేసినవారే వెనక్కి తీసుకున్నవీ ఉండటం విశేషం.
వాటిలో మొదటి కేసు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే కేసు..దీనికి బాబు ప్రాసిక్యూషన్‌కి గవర్నర్ అనుమతించకపోవడంతో విచారణ దశవరకూ కూడా రాలేదు. సిబిఐ విచారణకు సిధ్దమైనా..కోర్టులు స్టే ఇవ్వడంతో నిలిచిపోయింది. 1998, 1999, 2000 సంవత్సరాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పిటీషన్లు దాఖలు చేయగా అప్పటి గవర్నర్లు విచారణకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై వైఎస్ కోర్టులకు వెళ్లినా..గవర్నర్ చర్యలను ప్రశ్నించలేమంటూ కోర్టు వ్యాఖ్యానించింది. 1999లో వైఎస్, షబ్బీర్ అలీ, పురుషోత్తంరావ్, పీట్ల కృష్ణ, నంది ఎల్లయ్య తదితరులు వేసిన కేసును కోర్టు ఆదేశాలతో హైకోర్టులో ఉపసంహరించుకున్నారు

2005లో ఇలాంటి ఆరోపణలతో నందమూరి లక్ష్మీపార్వతి తన పిటీషన్‌ను విచారణకు స్వీకరించాల్సిందిగా ఏసిబిని ఆశ్రయించారు. అప్పుడు కూడా చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే తెచ్చుకున్నారు. 2010లో లిక్కర్ పర్చేజ్ అగ్రిమెంట్లకు సంబంధించిన ఒప్పందాలపై కృష్ణకుమార్ గౌడ్ అనే వ్యక్తి కేసు వేయగా..సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. అలానే 2011లో ఎమార్ ప్రాపర్టీస్ డీల్‌లో చంద్రబాబు పాత్రపై విచారణ కోరిన పిటీషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఐఎంజి భారతి భూకేటాయింపుల కేసులోనూ కాంగ్రెస్ లీడర్ పి.గోవర్ధన్ రెడ్డి వేసిన పిల్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులపై తెలుగుదేశం నేత లింగారెడ్డి ఏమంటారంటే..24 హౌస్ కమిటీ విచారణలు, 17 అక్రమాస్తుల కేసులను వైఎస్సార్ వేయించినా..మా నేతని ఏమీ చేయలేకపోయారు. పైగా రాజశేఖర్ రెడ్డి వేసిన కేసులనే తగిన ఆధారాలు లేనందున వెనక్కి తీసుకున్నారు. మా నేత ఎలాంటి తప్పూ చేయలేదు కాబట్టే ఇలా జరుగుతుంది అంటారాయన. ఇటీవలే ఓటుకు నోటు కేసులో మంగళగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు కోరుతున్నారు. అసలు ఏ తప్పూ చేయకపోతే విచారణకు చంద్రబాబు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారనేది ఆయన ప్రశ్న..ఐతే ఈ రెండు వాదనల సంగతి ఎలా ఉన్నా..ఇప్పటిదాకా నారా చంద్రబాబునాయుడి పై ఏ విచారణా జరగలేదన్నది మాత్రం వాస్తవంComments