40 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఏం బాబూ పూలు కావాలా..!


ఏపీ సిఎం నారాచంద్రబాబునాయుడికి స్వభుజ తాడనం అంటే బాగా ఇష్టమని గిట్టనివారు అంటుంటారు. దానికి తగ్గట్లే ఆయన కూడా కొంత తెలిసీ..కొంత ఎవరూ అభ్యంతరపెట్టరనీ..చేసే వ్యాఖ్యలు కొన్ని ఆయన ఇమేజ్‌ని తీవ్రంగా దెబ్బతీస్తాయ్. నిజానికి చంద్రబాబునాయుడికంటూ ఒక క్లీన్ ఇమేజ్ ఉంది. ఎన్ని కేసులు వేసినా..అవి విచారణ దశవరకూ రాకపొవడంతొ ఇది సాధ్యపడిందని చెప్పొచ్చు. దానికి తొడు బాబు ఎక్కడా ఎవరిపైనా పరుషంగా వ్యాఖ్యానించడం చేయరు. ఈ మధ్య వైఎస్ జగన్ ప్రాభవం పెరిగిన తర్వాతా కాస్త మాటతీరులొ మార్పు వచ్చిందే తప్ప తన ప్రసంగంలొ ఎక్కువగా అభివృధ్ది..సంక్షేమం..సాంకేతికత ఇలాంటి పదాలే విన్పిస్తుంటాయ్. ఒక రకంగా ఇలాంటి ప్రసంగాలతొ ఆయన జనానికి బొర్ కొట్టిస్తుంటారు కూడా..అయితే ఇక్కడ క్లియర్‌గా కొన్ని విషయాలు అందరికీ తెలిసినవే..మీడియా మేనే‌జ్‌మెంట్‌లొ ఆయన్ని కొట్టినవారు లేరు. అఁదుకే ఇప్పుడు తన సిల్వర్ జూబ్లీ పాలిటిక్స్‌ సందర్భంలొ కూడా లేనివిధంగా అర్జంట్‌గా కొన్ని పత్రికల్లొ 40 ఏళ్ల రాజకీయనాయకుడంటూ కొన్ని ఇఁటర్వ్యూలు ప్రకటింపజేసుకున్నారు. చంద్రబాబు ఫిబ్రవరి 27న ఎన్నికైతే..అదే ఏడాది ఎమ్మెల్యేలు అయినవారికీ ఇది 40 ఏళ్లు పూర్తైనట్లే కదా..! సరే ఇదొ దిక్కుమాలిన లాజిక్ అనుకుంటే వదిలేద్దాం..ఆజొవేరా ఇంటర్వ్యూ అంటేనే అది అవతలి వాళ్ల అభిప్రాయాల కంటే ఈ ప్రయొక్తనే ముందుగా దూరేసి..అవును కదూ...నువ్విదే కదూ..అఁటూ కన్ఫామ్ చేసి పడేసి..పైగా దానికి మనసు విప్పి మాట్లాడుతున్నారా లేదా అని జనాన్ని అడుగుతాడు..అలాంటి ఒక ప్రాయొజిత కార్యక్రమంలొ ఇక అతిశయొక్తిలకు అడ్డు ఎక్కడ ఉంటుంది..వాటిలొ వైఎస్సార్సీపీ అభిమానులకు వళ్లు మండిన అంశం ఒకటి..వైఎస్‍‌కి టిక్కెట్ ఇవ్వమని ఇఁదిరాగాంధీకి చంద్రబాబే సిఫార్సు చేశాడని చెప్పుకొవడం..నిజానికి ఇఁదులొ తప్పేం లేదు..సాటి మిత్రుడికి ఇలా సిఫార్సు చేశాడంటే మంచి విషయమే..అయ్యయ్యొ వైఎస్సార్‌కి బాబు ఎంత మేలు చేశాడని మురిసిపొవచ్చు కూడా..కానీ వాస్తవాలు వేరు కావడంతొ ఇలా వాళ్లకి చిర్రెత్తుకొచ్చిందట.

ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా వైఎస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే..రెడ్డి కాంగ్రెస్ గా పిలవబడిన బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ తరపున డి.నారాయణరెడ్డిపై గెలిచారు. చంద్రబాబు మాత్రం ఇఁదిర కాంగ్రెస్ తరపున కొంగర పట్టాభిరామయ్యపై గెలిచారట. సొ..ఇక్కడ ఈయన చెప్తే ఇందిరాగాందీ టిక్కెట్ ఇవ్వడమనేది ఉత్తిమాటే..మరి ఆ తర్వాత ఏమైనా సిఫార్సు చేశాడా అంటే అప్పటికి్ రాజశేఖర్ రెడ్డి హవా మెల్లగా ప్రారంభమైంది కూడా..ఇంకా చంద్రబాబే స్వయంగా మామపైనే పొటీకి దిగుతా అంటే..కాంగ్రెస్‌లొ నమ్మని పరిస్థితి..ఆ ఎన్నికల్లొ ఒడిపొయి తెలుగుదేశంలొ చేరారు కూడా..

ఇదొక్కటే కాదు..సదరు వేరా ఇఁటర్వ్యూలొ అన్నీ తప్పులతడక జవాబులే అన్పించకమానదు. ఎందుకంటే ఎన్టీఆర్‌ని రాజకీయాల్లొకి రమ్మని ఆహ్వానించాం..ఆయనకి ఒక అవగాహన కొసం అంజయ్యతొ భేటీ ఏర్పాటు చేశాం..అని చెప్పుకొచ్చారు. అంటే స్వయంగా ఎన్టీఆర్ కి సలహా ఇచ్చి ఆ తర్వాత పార్టీ పెట్టినా ఎందుకు జాయిన్ అవ్వలేదు..అంటే ఎటు గాలి వీస్తే అటు జంప్ అవుదామనా..పైగా మర్రి చెన్నారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు సస్పెండ్ చేశారు..కానీ ఎదురు తిరిగాను..ఆ దెబ్బతొ సస్పెన్షన్ వెనక్కి తీసుకున్నారని చెప్పుకొచ్చుకున్నారు. మరి పీతలసుజాత తదితర ఊస్టింగ్‌కి గురైన మంత్రులు కూడా ఇలానే ఎదురుతిరిగితే..బాబు ఒప్పుకుంటారా..!
ఇక జగన్ పార్టీకి ఇంకాస్త చిర్రెత్తుకొచ్చే అంశం..తమ నేత వయసు తక్కువ కాబట్టి విమర్శించవద్దు..కొర్టు వాయిదాలకి వెళ్లే మనిషితొ నాకు పొలికేంటని అనడం..ఇక్కడా ఆయన ద్వంద్వవైఖరే కన్పిస్తుంది..సాక్షాత్తూ మర్రిచెట్టు చెన్నారెడ్డినే విమర్శించిన ఫస్ట్ టైమ్ విన్నర్ ఎమ్మెల్యే అయిన బాబు..ఆల్రెడీ అంతకుముందు ఐదేళ్లు ఎంపిగా పని చేసిన వైఎస్ జగన్ విమర్శించకూడదా..మరి దేశప్రధానిగా ఉక్కుమహిళ అని పేరుతెచ్చుకున్న ఇందిరాగాంధీని రెండేళ్ల అనుభవం లేని నువ్ అప్పట్లొ విమర్శించవచ్చా...సీనియర్ మొస్ట్ పొలిటీషియన్ కాసుబ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళ్రావ్, ఎన్‌జి రంగాలను నువ్ విమర్శించవచ్చా..ఈ ప్రశ్నలు జన్రల్‌గా రావా..ఒకే అదీ వదిలేద్దాం
అసలు 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ...రాజకీయ పార్టీనేతలపై విమర్శల జొలికెందుకయ్యా వెళ్లడం..చక్కగా నీ పాలనలొ నీ అనుభవాలు..నువ్ ఎలా సిఎంగా మారింది..అప్పటి నీ మానసిక స్థితి ఎలా ఉంది.ఇలాంటి విమర్శలను అధిగమించి రెండొసారి ఎలా...గెలిచింది..పాలనలొ నువ్ చేసిన మార్పులు..పథకాలు..ఇలాంటివి ఏకరువు పెడితే బ్రహ్మాండంగా ఉఁడేది..కనీసం మరొ పదేళ్ల తర్వాత ఇవే పత్రికల కాపీలను జనం మళ్లీ మళ్లీ చదువుకునేవారు..అలాంటివి వదిలేసి..జగన్ పై విమర్శలు చేస్తే..దానికీ నువ్ రొజూ చేసేదానికీ తేడా ఏమైనా ఉందా..అంటే సందర్భశుధ్ది లేని ఇంటర్వ్యూలు ఇచ్చినట్లేగా 

Comments