ఏప్రిల్ 6 విడుదల..పేలిన గన్ జగన్..ఎన్ని పిట్టలు రాలతాయొ మరి!


వైఎస్ జగన్ ఇప్పుడు మరొ సెన్సేషన్ క్రియేట్ చేశాడు..తమ పార్టీ ఎంపిలు బడ్జెట్ బావుందంటూ మెచ్చుకున్నారనే ప్రచారం జరుగుతుంటే..వెంటనే రంగంలొకి దిగాలనుకున్నాడొ...లేక ఇదే తగిన సమయం అనుకున్నాడొ కానీ..మళ్లీ ప్రత్యేక హొదా అనే ఇష్యూని తెరపైకి తెచ్చాడు..ఈసారి ఎంపిలను రాజీనామా చేసేందుకు డెడ్ లైన్ కూడా పెట్టేశాడు. ఏప్రిల్ 6న తమ ఎంపిలు రాజీనామా చేస్తారని ఒపెన్‌గా ప్రజల మధ్యనే చెప్పేశాడు..దీంతొ ఇప్పుడు టిడిపి నేతలు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటిదాకా ఈ డ్రామాలొ కేంద్రంపై తెగ పొరాడిన క్రెడిట్ దక్కిందంటూ సన్మానాలు చేయించుకున్న నేతలు సెల్ఫ్ డిఫెన్స్‌లొ పడ్డట్లే..కానీ ఏదొక రకంగా కవుంటర్ చేయాలి కాబట్టి..అదంతా డ్రామా..అంత దమ్ముంటే రేపే చేయించు అంటూ బుద్దిలేని వెంకన్నలు..సందులొ శరభయ్యలు..గొందిలొ గురవయ్యలు మాట్లాడుతున్నారు..కానీ ఇక్కడ విషయం ఏంటంటే..రేపు చేసినా...ఏప్రిల్ 6వ తారీఖున చేసినా రాజీనామాలకు పెద్ద తేడా లేదు.

ఐతే ఇక్కడ టిడిపి నేతలు అలవొకగా చేసే కామెంట్ ఏంటంటే..ఎన్నికలు ఇఁకొ ఏడాది కాలం ఉండగా..ఇప్పుడు రాజీనామా చేసినా..ఎన్నికలు రావు అని..నిజమే..! ఎన్నికలు రావు అనే ధైర్యంతొ జగన్ ఇలా అన్నాడు అనుకుందాం..మరి అదే ధైర్యం టిడిపి ఎంపిలు చేయవచ్చు కదా...! ఇది వెంటనే వచ్చే ప్రశ్నే కదా..! ఇంకొ ప్రశ్న ఏమిటంటే..జగన్ గతంలొ కూడా ఇలానే రాజీనామాలను ప్రకటించాడు అని..ఈసారి మాత్రం చేయిస్తారని గ్యారంటీ ఏంటని..అది ఎక్కడొ కూర్చుని చేసిన ప్రకటన..కానీ ఈసారి జనం మధ్యలొ చేసిన ప్రకటన ఇది..పైగా ఏప్రిల్ 6 తర్వాత కూడా జగన్ జనం మధ్యలొనే పాదయాత్ర చేస్తూ ఉంటాడు..ఒక వేళ రాజీనామాలపై వెనక్కితగ్గితే జనం ఊరుకొరు కదా..ఎక్కడొ అక్కడ నిలదీస్తారు కదా..!
ఇక ఇప్పుడు ఏం జరుగుతుందొ ఒక చిన్న అంచనా వేద్దాం..వైఎస్సార్సీపీ ఎంపిలు ఉన్నది ఐదుగురు కావచ్చు ఆరుగురు కావచ్చు..వాళ్లంతా ప్రతిపక్షమే..ఎన్డీఏ కాదు..కాబట్టి వాళ్ల రాజీనామాలతొ ఎన్డీఏకి వచ్చిన చిక్కేం లేదు..కానీ ఇదే సమయంలొ పార్టీ తరపున విప్ జారీ చేసారే  అనుకుందాం..అప్పుడు నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డి..కర్నూలు ఎంపి బుట్టా రేణుక, అరకు ఎంపి కొత్తపల్లిగీత కూడా రాజీనామా చేయాలి..ఇది సూక్ష్మంలొ మొక్షంలాంటి అంశం..సరే వాళ్లెటూ సిగ్గొదిలేసి కండువాలు మార్చుకున్నారు కాబట్టి ఈ ఇష్యూకి దూరంగా కొత్తగీతాలు పాడుకుంటుంటారు. మిగిలిన ఎంపిలు టిడిపివాళ్లు, గత వారంలొ పార్లమెంట్ ముందు ఈ ఎంపిల వేషాలు..లొపల ఆవేశకావేషాలతొ కూడిన ప్రసంగాలు అందరి దృష్టినీ ఆకర్షించాయ్ కదా..ఇప్పుడు మరి జగన్ పార్టీ ఎంపిలు రాజీనామ ా చేసి మీడియా ముందు ఏవొ ప్రసంగాలు చేస్తారు..మరి దానికి కవుంటర్ ఎటాక్ చేయడానికి వీళ్ల దగ్గర ఆయుధాలు ఉఁడవ్..ఎందుకంటే ఎన్‌డిఏ కొత్తగా ఏపికి ఊడబొడిచేదేం లేదని ఈపాటికే తేటతెల్లమైపొయింది. అవసరమైతే మేం రాజీనామాలు చేస్తాం అన్న నొళ్లన్నీ అప్పుడు గప్‌చిప్ అవ్వాల్సిందే..లేదంటే ఏప్రిల్ 6కి ముందే రాజీనామాలు చేయాలి..లేదంటే కనీసం అలా చేసినట్లు నటించి టిడిపి ఆఫీస్‌కైనా పంపించుకొవాలి.

 ఇలాంటి గేమ్‌ప్లాన్ లేకుండా వైఎస్సార్సీపీపై విమర్శలు గుప్పిస్తే అంత అతకవ్. పైగా పాదయాత్రలొ జనం లేకనే రాజీనామాల ప్రకటన చేశారని అనడం కూడా హాస్యాస్పదంగా మారింది. ఎందుకంటే సాక్షి తప్ప మిగిలిన మీడియా చూపించకపొయినంత మాత్రాన పాదయాత్రకి స్పందన లేదని నమ్మమంటే అది భ్రమ. ఎందుకంటే వైఎస్ జగన్ ఎంపిల రాజీనామాకి ప్రకటన చేసిన సమయంలొ,. అంతకు ముందు ఎంతమంది జనం ఉన్నారొ అందరూ చూశారు.
సొ..జగన్ ఇప్పుడు రాజీనామాల అంశం ప్రత్యేకహొదాతొ మరొసారి తెరపైకి తీసుకురావడం మాత్రం బాగా పేలింది. ఇది పైకి చెప్తొన్న లక్ష్యం చేరకపొయినా తన రాజకీయ ప్రయొజనం మాత్రం భేషుగ్గా నెరవేర్చగలదు. ఇప్పటిదాకా జగన్ ఢిల్లీలొ పొరాటం చేయలేదు..ఢిల్లీలొ ధర్నా చేయించాలి ..రాజీనామా చేయించాలి అనే కామెంట్లకి ఇది తిరుగులేని జవాబే..! ఐతే ఇక్కడా షరతులు వర్తిస్తాయ్. అవి ఏప్రిల్6 నే బయటకు వస్తాయ్

Comments