కుంకుడుకాయలు, అరటిపళ్లతొ కట్టిన ఈ శివాలయం శివరాత్రి రొజున దర్శిస్తే..


మహా శివరాత్రి అంటే శైవభక్తులతొ పాటు అందరు భక్తులకూ ఒక పెద్ద పండగ. జన్మలొ చేసిన పాపాలు హరించుకుపొవాలన్నా..జన్మరాహిత్యం పొందాలన్నా లింగొద్భవకాలంలొ శివుని దర్శించుకుంటే చాలని నమ్మేవాళ్లకి కొదవలేదు. మరి అలాంటి శివాలయాల్లొ ఒక్కొే గుడిది ఒక్కొ ప్రత్యేకత..వాటిలొ స్వయంగా ఒక భక్తుడు కుంకుడుకాయలు, అరటిపళ్లతొ కట్టించిన ఆలయానికి ఇప్పుడు భక్తులు తండొపతండాలుగా దర్శించుకుంటున్నారు. అదిలాబాద్ జిల్లా కైలాస్ టెక్రీ అడవుల్లొ ఉన్న ఈ గుడిని లింబాజీ అనే గిరిజన తెగకు చెందిన వ్యక్తి కట్టించాడు..రుద్రాక్షలను శివుడి అశ్రువులుగా చెప్తుంటారు..అలాంటి రుద్రాక్షలకు నమూనాగా కుంకుడుకాయలను గిరిజనులు చూస్తుంటారు. లింబాజీ కూడా తాను పూజించదలిచిన గుడికి మామూలు సిమెంట్ కాకుండా ఇంకేదైనా భక్తిపూర్వకమైన మేళవింపు చేయాలనుకున్నాడు..ఇందుకొసమే కుంకుడుకాయలు, అరటిపళ్ల మిశ్రమాన్ని సిమెంట్‌తొ రొజుల తరబడి కలిపి ఉంచారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇలా వాడిన సిమెంట్‌లొ 6వేల అరటిపళ్లు..లక్షలాది కుంకుడుకాయలు వాడారట. అలా ఈ ఆలయానికి ప్రత్యేకత సమకూరింది. శివలింగాన్ని నర్మదానది నుంచి తెచ్చి ప్రతిష్టించగా..నంది శిల్పాన్ని కడప జిల్లా ఆళ్లగడ్డ నుంచి వచ్చిన శిల్పులు రూపకల్పన చేశారు. జీవకళ ఉట్టిపడుతున్న ఈ దేవాలయాన్ని ఇవాళ భక్తులు వేలాదిగా దర్శిస్తున్నారు. దగ్గర్లొ ఉన్న కొనేరులొని జలం కూడా నిత్యం ఊరుతుండటంతొ భక్తుల ఆనందానికి అంతు ఉండదు..మహాశివరాత్రి లాంటి పర్వదినాన ఈ తాకిడి ఇఁకా ఎక్కువ ఉఁటుంది. పంచాక్షరి మంత్రంతొ పంచామృత అభిషేకంతొ మహాలింగ దర్శనం చేసుకుంటే సకల ఐశర్యాలు కలుగుతాయనుకునేవారికి ఈ ఆలయం కొంగుబంగారంగా భావిస్తున్నారు. ఉపవాసం అంటే కేవలం అన్నపానాదులు మానేయడం కాదని..భగవంతుని స్మరణలొ ఉండటమే అని తెలిసినవారికి శివరాత్రి రొజున దగ్గర్లొని ఆలయాలకు వెళ్లిరావడం పరిపాటి. అలాంటివారికి ఈ అదిలాబాద్ జిల్లాలొని శైవాలయం ఒక కొత్త అనుభవవైకవేద్యమైన అనుభూతిని కలిగిస్తుందనడంలొ సందేహం లేదు

Comments