అందరిలొకీ చంద్రబాబే టాప్..మరి ఆస్తులెంతొ తెలుసా


ఏపి సిఎం చంద్రబాబునాయుడికి సంబంధించిన వార్త ఏదైనా ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తొంది..ఇప్పుడు మనం చెప్పుకొబొతున్న వార్త ఆయనకి కాస్త ఇబ్బంది కలిగించేదే..ఎందుకంటే దేశంలొని 31 రాష్ట్రాల ముఖ్యమంత్రులలొ ఎవరెంత ఆస్తిపరుడన్న విషయంపై ఒక సంస్థ లెక్కలు తీసింది..దీని ప్రకారం చంద్రబాబే అత్యంత సంపన్న సిఎంగా తెలిసింది..ఈ లెక్కలు గట్టింది అసొసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ.ఇది మన హైదరాబాద్‌లొనే ఉంది. ఎన్నికలకు ముందు పార్టీలు నిలబెట్టే అభ్యర్ధులలొ నేరచరితులు ఉన్నవారెవరొ కూడా ఈ సంస్థే ప్రకటిస్తూ ఉంటుంది.వీటిపై చర్యలు తీసుకొవడం మాట ఎలా ఉన్నా..పడని పార్టీపై విమర్శలు చేసేందుకు మాత్రం ఈ సంస్థ లెక్కలను ఉదహరిస్తూ ఉంటారు. ఈ సంస్థకి అనుబంధంగా ఎలక్షన్ వాచ్ అనే సంస్థ కూడా ఇదే పని చేస్తుంటుంది. ఈ సంస్థ సర్వే ప్రకారం చంద్రబాబునాయుడికి రూ.177కొట్ల ఆస్థి ఉందట..ఇక ఈయన తర్వాత రెండొస్థానంలొ అరుణాచల ప్రదేశ్ సిఎం పెమా ఖండూ ఉన్నాడట..ఈయన ఆస్తి 129కొట్ల రూపాయలు..థర్డ్ ప్లేస్‌లొ పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్..నాలుగొ స్థానంలొ తెలంగాణ ముఖ్యమంత్రిీ కేసీఆర్ ఉన్నాడట..సరే ఈ ఆస్తుల లెక్కలు ఎలా ఉన్నా..చంద్రబాబునాయుడుగారు ఎప్పటికప్పుడు తాను నిరాడంబర జీవితం గడుపుతున్నానని..తన భార్యా తానూ హెరిటేజ్ పెట్టుకుని పాలూ, కూరగాయలు అమ్ముకుంటున్నానని కూడా అప్పుడప్పుడు ప్రెస్‌మీట్స్‌లొ చెప్తుంటారు.
అలాంటప్పుడు దేశంలొనే రిచ్చెస్ట్ సిఎంగా ఆయన పేరు ప్రకటించడం ప్రతిపక్షాలకు ఆయుధం అప్పగించినట్లే అవుతుంది. నిజానికి డబ్బు సంపాదించడం తప్పేం కాదు. అవి ఎలా సంపాదించరన్న విషయమే ప్రజలకు కావాలి. 2002కి ముందు తెహల్కా డాట్ కామ్ అని ఒక క్రైమ్ మేగజైన్ దేశంలొనే అత్యంత ధనిక రాజకీయనేతగా చంద్రబాబు పేరుని ప్రకటించింది. ఇక అప్పట్నుంచి వైఎస్ సహా కాంగ్రెస్ నేతలంతా చంద్రబాబుపై ఆరొపణల వర్షమే కురిపించారని చెప్పొచ్చు. ఆ తర్వాతా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ కేసులు కూడా వేశారు. కానీ అవేవీ నిలబడలేదు..ఇప్పుడు రాష్ట్రంలొ ఉన్న మూడ్ ప్రకారం ఏపికి కేంద్రం అన్యాయం చేస్తుందనే ప్రచారం ఉంది. ఇలాంటి దశలొ చంద్రబాబు ఫారిన్ టూర్లు కూడా విమర్శల పాలవుతున్నాయ్. ఈ దశలొ అసొసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ సంస్థ బైటపెట్టిన ఈ విషయం చంద్రబాబుకి కాస్త ఇబ్బందికర పరిణామంగానే చూడాలి మరి. ఎందుకంటే జనం సమస్యలు పట్టించుకొవడం లేదు తన ఆస్తులు మాత్రం పెంచుకుంటున్నారు అని ప్రతిపక్షపార్టీలు విమర్శలకు దిగుతాయి కాబట్టి..అఁదులొనూ  బిెెజెపి నేత సొము వీర్రాజు ఇప్పటికే రెండెకరాల ఆస్తి నుంచి లక్షలకొట్ల ఆస్తులు సంపాదించారంటూ ఇన్‌డైరక్ట్ కామెంట్లు చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడీ అంశం తస్మదీయులకు అస్త్రంగా వాడుకుంటారేమొ చూడాలి

Comments