జేసికి బొత్స అద్దిరిపొయే కౌంటర్...కానీ పట్టించుకునేదెవరు


ప్రస్తుతం వైఎస్ జగన్ విసిరిన ఎంపిల రాజీనామా అస్త్రానికి టిడిపి కౌంటర్ ఇవ్వలేక కిందా మీదా పడుతోంది..ఐతే అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డి విసిరిన చెణుకులు కలకలం రేపాయ్. ఐతే దీనికి చాన్నాళ్లనుంచి అజ్ఞాతవాసంలో ఉన్నారా అన్పించిన వైసీపీ నేత, మాజీ మంత్రి  బొత్స సత్యనారాయణ
తిప్పికొట్టారు. రెండు మూడు రోజుల క్రితం రాజీనామా చేయాలని సవాల్ విసిరింది తమరే కదా అంటూ టిడిపి ఎంపిలు కొనకళ్ల,జేసిలకు సూటిగా ఆన్సర్ ఇచ్చారు.
ఇన్నాళ్లూ పెద్దగా లైమ్ లైట్‌లో లేని బొత్స ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిని వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది..విజయనగరం జిల్లాలో సుజయకృష్ణరంగారావ్ టిడిపిలో చేరడం మంత్రిపదవి దక్కించుకోవడం జరిగిపోయాయ్. ఐతే అప్పుడే బొత్స తన సత్తా చాటుతారని భావించారు. ఈయన రాకపై అలిగే
సుజయకృష్ణ వైసీపికి గుడ్ బై చెప్పారనే వాదనా ఉంది..అలాంటి సిచ్యుయేషన్ లో పార్టీలో చేరిన బొత్స ఏదో పొడిచేస్తారనుకుంటే ఆ తర్వాతి కాలంలో ఎక్కడా పెదవి విప్పింది లేదు. తనపై తనకి నమ్మకం లేకనో..లేక అసలు అవకాశం దక్కకోగానీ ఎక్కడా తన మాటే విన్పించలేదు. ఐతే తన విజయనగరం జిల్లాలో మాత్రం కేడర్ ని తిరిగి రివైవ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని అక్కడక్కడా విన్పించినా..బైట కన్పించడం మాత్రం లేదు. ఆ మాటికి వస్తే ఈయనే కాదు ధర్మాన ప్రసాదరావ్ పరిస్థితి కూడా అంతే. బొత్స సత్యనారాయణ విషయానికే వస్తే టిడిపిలో చేరేందుకు ప్రయత్నించి వీలు కాక సైలెంట్ గా చాన్నాళ్లు ఉండిపోయారని టాక్..ఇక కాంగ్రెస్‌లో ఉండటం వలన ఒరిగేదేం లేదనే..జగన్ గూటికి చేరారని అందరూ అంటారు. అప్పట్లోనే ఒక మెట్టు దిగి మరీ పార్టీలో చేరానని...చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఉద్యమంగా మార్చగలిగితే వైఎస్సార్ కాంగ్రెస్‌కు మంచి ప్రయోజనమే దక్కుతుంది. అందుకే బొత్స ఇలా కౌంటర్లు ప్రారంభించారా అనేది గమనించాల్సిన అంశం. ఐతే ఇంత కౌంటర్‌ ఇచ్చినా బొత్సని జనం సరిగా పట్టించుకోకపోవడానికి కారణాలు ఉన్నాయ్. ఆయనపై గతంలోని ఫోక్స్ వేగన్ స్కామ్ కేసు మచ్చ ఇప్పట్లో పోయేది కాదు ఎందుకంటే సిబిఐ విచారణలో ఆయనకి క్లీన్ చిట్ దక్కినా..ఆ సమయంలో డబ్బులు పోనాయ్ ఏటి సేత్తామనే నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు జనం మర్చిపోలేదు. ఆ తర్వాత  లిక్కర్ స్కామ్‌లోనూ ఈయన పేరు ప్రముఖంగా విన్పించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత ఈయనపైకీ మళ్లింది. అది మాసిపోవాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఇవన్నీ జరిగి నాలుగేళ్లు అయింది కాబట్టే ఇప్పుడిక ఆయన తిరిగి స్వరం పెంచుతున్నారనుకోవచ్చు. లోటస్ పాండ్ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేం లేదు
ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా తాను వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవాలంటే, అది పార్టీ ఇమేజ్‌తోనే ముడిపడి ఉంటుంది. జిల్లాలో మొత్తం నలుగురు ప్రజాప్రతినిధులను తన కుటుంబంనుంచే పంపించారు వైఎస్..ఐతే ఆ తర్వాతికాలంలో దాన్ని నిలబెట్టుకోలేకపోవడం బొత్స వైఫల్యంగానే చూడాలి. అసలు తనకున్న అనుభవంతో జగన్ పార్టీలో నంబర్ టూ గా ఎదగగల టాలెంట్ ఉన్నా..ఆ స్థాయికి చేరుకోలేకపోయారు. అటు జగన్ పార్టీ కూడా అవకాశాలు వస్తున్నా..అందిపుచ్చుకునే తొందరలో తప్పిదాలు చేస్తోంది. ఇప్పటికైతే, ఎంపిల రాజీనామా అంశాన్ని సరిగా వాడుకుంటే మంచి ఎడ్జ్ సాధించే అవకాశం ఉందిఈ కోవలోనే బొత్స, ధర్మాన, పార్ధసారధి, అంబటి రాంబాబు, రోజా, మేకపాటి, విజయసాయిరెడ్డి వంటి వారు సరైన వ్యూహంతో వ్యవహరిస్తే జగన్ లక్ష్యం చేరుకుంటారు
లేకపోతే ఊళ్లో పెళ్లికి వైసీపీ హడావుడిగానే మిగిలిపోతుంది. 

Comments