పవన్‌కల్యాణ్ పోటీపై అనర్హత వేటు పడుతుందా..?


జనసేన పార్టీ పోటీలో ఉంటుందో లేదో కానీ,  ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కి మాత్రం ఓ షాక్ తగలబోతోంది..సుప్రీంకోర్టు ఇచ్చిన ఇవాళ్టి ఓ తీర్పు ఇందుకు కారణం కాబోతోంది. ఈ తీర్పుని ఓ తెలుగు న్యాయమూర్తే ఇవ్వడం మరో విశేషం. ఇకపై ఎన్నికలలో పోటీ చేయబోయే ప్రతి అభ్యర్ధీ నామినేషన్లు దాఖలు చేసే ముందు వాటిలో తన ఆస్తులు..అప్పులు పొందుపరచాలి. వాటితో పాటే తన భార్య, పిల్లల వివరాలు కూడా
జత చేయాలి. ఇప్పటిదాకా ఉన్న చట్టం ప్రకారం నామినేషన్లలో ఆస్తులు..అప్పులు తమపై ఏవైనా కేసులు ఉంటే వాటి గురించిన వివరణ ఇవ్వాలి  ఇప్పుడు సంతానం గురించిన వివరాలు కూడా జతపరచాలి..ఈ నిబంధనకి పవన్ కల్యాణ్ పోటీకి సంబంధం ఏమిటంటారా..మరదే అక్కడే ఉంది అసలు కిటుకు..
పవన్ కల్యాణ్ మొదటి భార్య నందిని..ఆమెకి విడాకులు ఇచ్చాక రేణూ దేశాయ్‌తో కలిసి కాపురం చేశాడు. ఆ తర్వాత ఎన్నికలలో ప్రజారాజ్యం తరపున ప్రచారం చేశాడు. ఇక్కడే తన జీవితంపై విమర్శలు రావడంతో ఓ పిల్లవాడు ఉన్న రేణుదేశాయ్‌కి తాళి కట్టి పెళ్లి అనే తంతు ముగించాడు. ఐతే ఆ తర్వాతా ఆ పెళ్లి పెటాకులు చేసుకున్నాడు. అంటే రేణూదేశాయ్‌తో ఓ పిల్లవాడికి తండ్రి అయ్యాడు. అకీరానందన్ అతని పేరు. ఇక ఆ తర్వాత అన్నా లెజ్నోవాతో మరో ముగ్గురు పిల్లలకుతండ్రయ్యాడు. అంటే ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు నలుగురు సంతానం. ఇప్పుడీ వివరాలన్నీ కూడా ఎన్నికల నామినేషన్ అఫడవిట్‌లో పొందుపరచాలి. సుప్రీంకోర్టు ఇలా అడగడానికి కారణం ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉఁటే వారిని చట్టసభలకు ప్రాతినిధ్యం వహించేందుకు అనర్హులుగా ప్రకటించడానికే నంటారు. ఇలా సంతానంపై ఆంక్షలనేవి ప్రస్తుతానికి ఎమ్మెల్యే, ఎఁపి అభ్యర్ధులకు లేవు. స్థానిక సంస్థల పదవులకు మాత్రం వర్తిస్తుంది. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా పోటీ చేయడం ఆ తర్వాత పదవులు కోల్పోవడం కూడా
జరిగాయ్. కొంతమంది తమ సంతానాన్ని దాచి పెట్టినా ఆ తర్వాతి కాలంలో ప్రత్యర్ధులు ఫిర్యాదు చేయడంతో వారిపై అనర్హత వేటు పడింది కూడా. అందుకే తమ సంతానం సంఖ్యని దృష్టిలో పెట్టుకుని కొంతమంది పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయ్. అలా పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు ఈ అనర్హత వేటుకి బలయ్యే అవకాశంపై చర్చలు సాగుతున్నాయ్. ఎలాంటి సంకేతం లేకుండా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వదని.. ఎమ్మెల్యే ఎంపి అభ్యర్దులకు కూడా ఈ నిబంధన వర్తింపజేయవచ్చని ప్రచారం జరుగుతోంది లోక్ ప్రహరీ అనే స్వఛ్చంద సంస్థ వేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సో..ఇలాంటి కొన్ని నిబంధనలు తమ నేత పోటీకి అనర్హుడిని చేస్తాయేమో అనే భయాలు ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌లో కలగడం సహజం

Comments