త్రివిక్రమ్‌కి కృతజ్ఞత అనే పదానికే అర్ధం తెలీదా..మధుబాబునీ ఛీట్ చేశాడా?

నిజం నిప్పులాంటిదంటారు ఎప్పటికైనా అది బైటికి రాకతప్పదు. ఇప్పుడదే కొందరి విషయంలొ బైటికి వస్తున్నాయ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ అనబడు ఒక సినిమా దర్శకుడు తన సినిమాల ద్వారా పాత్రలద్వారా  గొప్ప విలువల గురించి చెప్పిస్తుంటాడు..కానీ అవి తనకి మాత్రం వర్తించవని ఘంటాపథంగా చెప్పుకుంటాడేమొ..తన ప్రవర్తన చూస్తే అలానే అన్పిస్తుంది. ఈయన కెరీర్ చూస్తే..కష్టపడి పైకి వచ్చిన దాఖలాలే ఉన్నాయ్. ఇలా సంపాదించినవారు కానీ పేరు దక్కించుకున్నవారు కానీ ఆ తర్వాత తమ ఉన్నతికి కారణమైనవారి విషయంలొ కాసింత కృతజ్ఞత చూపిస్తుంటారు మామూలు జనం విషయంలొ అది ఎక్కడా కన్పించకపొవచ్చు..కానీ సెలబ్రెటీల విషయంలొ మాత్రం ఆ చూపించే కృతజ్ఞత కూడా అందరికీ తెలిసేలా బాహాటంగానే జరుగుతుంటుంది
ఈ ఫొటొలొ కన్పిస్తున్న వ్యక్తి..సాదాసీదా మనిషి కాదు..ఒక రెండు తరాల వారిని తన పుస్తకాల ద్వారా ఉర్రూతలూగించిన వ్యక్తి..ఆయనే మధుబాబు..షాడొ అనే ఒక హీరొకి సూత్రధారి..ఇప్పటికీ ఆయన డిటెక్టివ్ నవలలంటే పడిచచ్చేవారున్నారంటే ఆశ్చర్యం లేదు..గత పదేళ్లనుంచే ఈయన ముఖం కాస్త జనాలకు తెలిసింది కానీ..అప్పట్లొ అయితే మధుబాబు ఎవరొ ఎవరికీ ఆనవాళ్లు కూడా తెలీదు. ఐతే ఈ మధ్యనే ఈయన ఒక విషయం తెలియజేశారు. 


డిటెక్టివ్ నవలల సామ్రాట్‌గా పేరు తెచ్చుకున్న మధుబాబుతొ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక రెండు మూడు గంటల ఇఁటర్వ్యూనే తీసుకున్నంతగా సంభాషణ చేశారట. అప్పుడే ఆయన చెప్పిన ఒక సీన్‌ని యదాతథంగా తన అతడు సినిమాలొ పెట్టేసుకున్నాడట. కనీసం ఆ విషయం టైటిల్స్‌లొ ఎక్కడా మెన్షన్ చేయకపొవడం త్రివిక్రమ్ తెంపరితనం అనుకొవాల్సిందేగా..అసలు త్రివిక్రమ్ అంతకన్నా పెద్ద ప్రమాదాన్నే అజ్ఞాతవాసి ఒరిజినల్ డైరక్టర్ నుంచి ఈ నెలలొ ఎదుర్కొబొతున్నాడు..పెద్ద కేసే పెడతా అని ఇప్పటికే ఆయన వార్నింగ్ ఇచ్చి ఉన్నాడు. నితిన్‌తొ తీసిన అ..ఆ సినిమా కూడా యుద్దనపూడి మీనా నుంచి ఎత్తేసిందే..ఆ విషయం అడిగితే కేర్‌లెస్‌గా వ్యవహరించి తర్వాత క్రెడిట్స్ ఇచ్చుకున్నాడు కూడా..అలానే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలొనూ కొన్ని సీన్లు సూపర్ స్టార్ భలేకృష్ణుడు మూవీ నుంచి అరువు తెచ్చుకున్నట్లుగా ఉఁటాయ్.  వీటన్నింటికీ ఆధారాలు ఎవరూ చూపకపొవచ్చు..అంత మాత్రాన నైతికత అనేది ఒకటి ఉంటుంది కదా..తన పాత్రలతొ ఇలాంటి నైతికత..విలువల గురించి తెగ లెక్చర్లు ఇప్పించే ఈ అజ్ఞాతవాసి దర్శకుడు తనకి మాత్రం అవి వర్తించవనే విధంగా ప్రవర్తించడం దారుణమే. తన సినిమా టైటిల్స్ కార్డ్స్ లొ ఎక్కడొ ఒక మూల చిన్న క్రెడిట్స్ వేసినంత మాత్రాన ఆయన గొప్పదనాన్ని ఎవరూ తక్కువ చేయరు కదా..సొషల్ మీడియాలొ జనం ఎంత యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసి కూడా నిజాలను దాచి పెడితే..చివరకు పలచబడేది వారి ఇమేజే అన్న సంగతి ఎందుకు త్రివిక్రమ్ లాంటివాళ్లు మర్చిపొతారొ మరి..!



Comments