అటు పవన్ ఇటు జగన్ మధ్యలో బాబుని ఎలా ఇరికించేశారో చూడండి


ఏపీ సీఎం చంద్రబాబుని ఆయన మిత్రుడే చిక్కుల్లోకి నెట్టారనే టాక్ బలంగా విన్పిస్తోంది ..అసలు ఎందుకూ కొరగాని ఓ మీటింగ్ గా భావిస్తోన్న పవన్ కల్యాణ్ జాయింట్ సమావేశాల చివరి రోజున పవన్ కల్యాణ్ నోకాన్ఫిడెన్స్ మోషన్ పై ఒక మాట అన్నారు. దాన్ని పట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ పెద్ద సవాల్ విసిరారు. నేను రెడీ మీరు రెడీనా..అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలంటే 54మంది కావాలి. మరి నాకు అంత బలం లేదు..నేను ప్రవేశపెట్టే తీర్మానానికి మీ చంద్రబాబు మద్దతు ఇచ్చేలా చూస్తారా అంటూ పవన్ కి సూటి ప్రశ్న వేసాడు. కావాలంటే టిడిపి ప్రవేశపెట్టినా నేను మద్దతిస్తా అంటూ ఛాలెంజ్ చేయడంతో పాపం పవన్ కల్యాణ్‌కి రోషం పొడుచుకువచ్చి..మీరు దమ్మున్న వ్యక్తి..అంటూ ఎటకారం ఆడుతూ మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురండి మేం మిగిలిన వారి మద్దతు కూడగడతా అంటూ ఇంకో సవాల్ విసిరిపోయాడు..ఐతే ఇక్కడ పవన్ కల్యాణ్ మార్చి6నే అవిశ్వాసం పెట్టండి అనడంపై మాత్రం వైఎస్సార్సీపీ తప్పు బడుతోంది..మా షెడ్యూల్ మేం పెట్టుకున్నాం నీ ఇష్టాన్ని బట్టి మేం చేయం అని అంబటి రాంబాబు అనడం ద్వారా ఈ క్రెడిట్ పవన్‌కి దక్కనీయొద్దనే ఆరాటం కన్పించింది. ఈ మాటల సంగతి ఎలా ఉన్నా  మధ్యలో చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ మాత్రం భేష్ అంటోంది అంటూ విమర్శలు చేస్తున్న టిడిపి నేతలు ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడ్డట్లే అయింది.  కేంద్రప్రభుత్వంపై చిత్తశుధ్దితో పోరాటం చేస్తుంది తామే అని చెప్పుకోవడానికి ఉన్న అవకాశం కోల్పోయినట్లు భావిస్తున్నారు. అటు వైసీపీ బిజెపితో కలుస్తాం అన్న అంశాన్ని పట్టుకుని రాజకీయంగా విమర్శలు చేస్తున్న టిడిపి ఇప్పుడు జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మద్దతు ఇవ్వకతప్పదు. లేదంటే తానే స్వయంగా పెట్టాల్సి రావచ్చు.. దీంతో అసలు విషయం పక్కదారి పట్టి ఇప్పుడు అవిశ్వాసం ప్రవేశపెట్టినోళ్లే హీరోలనేలా చర్చ జరగడం విడ్డూరం. ఒక పార్టీ నుంచి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినంత మాత్రాన ఏదో భూకంపమేం రాదు. ఒక్క మెంబర్ అయినా ఇదిగో ఫలానా అంశంపై అవిశ్వాస తీర్మానం ఇస్తున్నాం అంటూ స్పీకర్ కార్యాలయానికి అందించవచ్చు. ఐతే సదరు లేఖపై 54మంది మద్దతుగా సంతకం పెట్టాలి. అప్పుడే స్పీకర్ దాన్ని పరిగణిస్తారు. అప్పుడు కూడా సభలో దానిపై చర్చకు స్వీకరించాలా వద్దా కూడా స్పీకర్ ఇష్టాన్ని బట్టే ఉంటుంది. ఇచ్చిన వెంటనే చర్చకు, ఆ తర్వాత ఓటింగ్ పెట్టే అవకాశం లేదు. తన విచక్షణను బట్టి ఇప్పటికిప్పుడు లేదంటే తర్వాతి సెషన్స్‌లో అయినా చర్చకు స్వీకరించవచ్చు.  ఇంత జరిగినా.. అది నెగ్గదు. ఎందుకంటే ఎన్డీఏకి ఉన్న మెజారిటీ దృష్ట్యా యూపిఎ మొత్తం సదరు తీర్మానానికి మద్దతు ఇచ్చినా అవిశ్వాసతీర్మానం నెగ్గదు. బిజెపికి 272 మంది సభ్యులు సహా 332 మంది ఎంపిల మద్దత  ఉంది..అందులో టిడిపి ఎంపిలు 16 మంది తీసేసినా..ఇంకా 316 మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ  నుంచి జంపైన ఎంపిలను కలుపుకున్నా..ఎన్డీఏ బలానికి వచ్చిన ఢోకా లేదు. పైపెచ్చు వైఎస్సార్సీపీ విప్ కనుక జారీ చేస్తే అనర్హత వేటే పడుతుంది వారిపై...అసలు లోక్ సభలో కావాల్సిన మెజార్టీ 272..అది భేషుగ్గా బిజెపికి ఉంది..అందుకే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్‌తొ దక్కించుకునే ప్రయోజనం కోసం అటు జగన్ ఇటు టిడిపి మధ్యలో పవన్ కల్యాణ్ ఆరాటపడుతున్నారు. అంతకు మించి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకంగా వచ్చే నిధులు ఏ మాత్రం లేవనేది అందరికీ తెలిసిన మాట

Comments