డెంగూకి నివారణ పేరుతొ ఇచ్చే ఆ మందు మాత్రం అసలు వాడొద్దట


డెంగ్యూ జ్వరమంటే..అది వచ్చిందన్న బాధ కంటే అది మిగిల్చే నొప్పులూ ..ఆస్పత్రి ఖర్చులకే సగం జనం చచ్చిబతికినంత పని చేస్తుంటారు. ఇదే సందుగా భావించే సడేమియాలు ఈ మధ్యకాలంలొ చాలామందే పుట్టుకొచ్చారట. దీనికి హొమియొలొ చక్కని మందు ఉంది..రండి బాబూ రండి..ఆలసించిన ఆశాభంగం అంటూ పదిరూపాయలకి ఒక సీసా గుళికలు విసిరేసి పొతున్నారు.. మందు ముందే మింగండి..డెంగ్యూ రాకుండా చూస్కొండి అంటూ telangana public health counsel పేరుతొ ఒక ముఠా బైల్దేరింది..ఆ ఇందులొ ఏముంది మొసం పదిరూపాయలే కదా అని లైట్ తీస్కొవద్దని ఆయుష్ శాఖ హెచ్చరిస్తొంది. డెంగ్యూ కి నివారణ అంటూ వాళ్లిస్తున్న పైరొజీనియమ్(pyrogenium) అసలు పని చేయదని..పైగా ఇలాంటివి వాడితే లేనిపొని జబ్బులొస్తాయని హెచ్చరిస్తొంది..పర్టిక్యులర్‌గా ఈ ముఠా ప్రవేట్ స్కూళ్లని, స్కూళ్లని టార్గెట్ చేసుకుని తమ దందా సాగిస్తొంది. పేరుని చూసి ఇదేదొ ప్రభుత్వమే పంపిందనుకుని చాలామంది వీటిని తమ స్కూళ్లలొ రికమండ్ చేస్తున్నారు..అనుమతిస్తున్నారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ఇలా మందులు డిస్ట్రిబ్యూట్ చేయదని ఆయుష్ శాఖ తెగేసి చెప్తొంది..పిల్లలకు వేసే ఇలాంటి గుళికలతొ ఏదైనా అనర్ధం వాటిల్లితే దానికి స్కూలే బాధ్యత వహించాలని కూడా హెచ్చరిస్తొంది.
ఈ పైరొజీనియమ్ తయారీ కూడా మాంసం నుంచే చేస్తారు. పలుచని మాంసంలొ నీళ్లు కలిపి మూడు వారాల పాటు నిల్వ చేస్తారు ఆ తర్వాత స్ట్రెయినింగ్ చేస్తారు. వచ్చే ద్రవపదార్ధాన్ని గ్లిసరిన్‌తొ కలుపుతారు. ఇలా వచ్చే మందే పైరొజీనియమ్..ఇది బ్లడ్ పాయిజనింగ్ కి వాడతారని చెప్తారు. అలానే కొన్ని లక్షణాలున్న వ్యాధులకు మాత్రమే వాడతారని శాస్త్రంలొ ఉండగా..ఇలా డెంగ్యూకి కూడా వాడటం మాత్రంలేదని కొందరు చెప్తున్నారు
మరి డెంగ్యూ కొసం హొమియొలొ ఇప్పటిదాకా వాడుతున్నది బెల్లడొనా గుళికలు.. ఈ మందు కూడా ఎక్కడిక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రభుత్వశాఖలు ఇచ్చేవే కానీ..ఇల్లుల్లూ తిరగడం కానీ..స్కూళ్లకి వెళ్లి పంచి పెట్టడం కానీ చేయలేదు. అఁదుకే ఇలాంటి మొసపూరిత వ్యక్తుల బారిన పడొద్దని ప్రభుత్వ ఆయుష్ శాఖ చెప్తొంది..ఐతే సదరు తెలంగాణ పబ్లిక్ హెల్త్ కవున్సెల్ (ఇదసలు ఉందొ లేదొ..రిజిస్టర్ అయిందొ లేదొ తెలీదు..నేను ఆంధ్రప్రదేశ్‌లొ కూడా ఇలానే ఇల్లిల్లూ తిరిగి హొమియొ గుళికలు అంటగట్టిన బాపతు సంఘటనలు స్వయంగా చూశా..కేవలం అది వ్యాపారమే తప్ప నిజంగా అందులొ మందు దేనికి వాడతారొ ఎవరికీ తెలీదు) మాత్రం సంబంధిత డివిజన్‌లలొ డిఈఒల పర్మిషన్‌తొనే స్కూళ్లలొ పంచుతున్నామని చెప్పడం విశేషం. కాబట్టి..మీ ఏరియాలొ కానీ..మీ ఎరికలొ కానీ ఎవరైనా ఇలాంటి మందులు పంపకం జరుగుతుంటే తక్షణం వాటిని అడ్డుకొండి.

Comments