టిడిపి ఎంపి సీటు చిరంజీవి జస్ట్ మిస్సవుతున్నాడా...!


ఎస్..చిరంజీవి ఇప్పుడు పూర్తిగా నటుడు మాత్రమే..రాజ్యసభ ఎంపి కాదు..అధికారికంగా కూడా మార్చితొ ముగిసిపొతుంది ఆయన సభ్యత్వం. అక్కడ కాంగ్రెస్ ఇతని టర్మ్ మళ్లీ పొడిగించే ఆలొచనకి వ్యతిరేకం కాకపొయినా...ఆయన వ్యవహారశైలితొనే పట్టించుకొనట్లు కన్పిస్తుంది. పైగా కాంగ్రెస్‌కి బలం కూడా లేదు..కాబట్టి ఖచ్చితంగా టిడిపి నుంచి ఎంపిగా వెళ్తారని గత ఆర్నెల్లనుంచి ఏదొక చొట విన్పిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడా  ఆశలకు జయప్రకాష్ నారాయణ రూపంలొ గండి పడినట్లే.

నిజానికి జనసేన కొటాలొ  చిరంజీవికి రాజ్యసభ సీటు దక్కడం చాలా ఈజీ..కానీ అలా చేస్తే ఈ ఇద్దరి అన్నదమ్ముల కథ బాహాటంగానే అందరికీ తెలిసిపొతుందని..అలా కాకుండా సర్వే పేరుతొ చిరుని పక్కనబెట్టేయాలని చంద్రబాబు ప్లాన్ వేశారట. అందుకే జయప్రకాశ్ నారాయణ పేరుని తెరపైకి తెచ్చేశారు. ఈయనెటూ ఎప్పట్నుంచొ చట్టసభల్లొ తన గొంతుని దేశస్థాయిలొ విన్పించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే పవన్ పిలిచీ పిలవగానే వెళ్లి జేఎఫ్ కమిటీలొ జాయినైపొయి...చంద్రబాబు స్టాండ్ విన్పించేశాడు. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇంకా నాలుగేళ్లు వెనక్కి వెళ్తే పార్లమెంట్ స్థానం నుంచే అటు టిడిపి కానీ..బిజెపి కానీ జయప్రకాష్ నారాయణను రంగంలొకి దింపుతుందని విపరీతమైన ప్రచారం జరిగింది..మొడీ కూడా జేపీని వాటేసుకుని మీరు నా మనిషి అంటూ బిల్డప్ ఇచ్చాడు కూడా..సొ అలా కూడా రెండు పార్టీలకు ఆమొదయొగ్యంగా ఉన్న మనిషిని రాజ్యసభకి పంపామనే ఫీలర్ బైటికి వదలొచ్చు అని బాబు ప్లాన్. తమకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య పరంగా ఇద్దరు ఎఁపిలను గెలిపించుకొవచ్చు..వైఎస్సార్సీపీకి ఒక అభ్యర్ధి ఖాయం అవుతాడు..ఐతే ఆ సీటు కూడా దక్కకుండా సొంబేరి ప్రయత్నాల్లొ టిడిపి ఉన్నట్లు ఆల్రెడీ జొరుగా ప్రచారం జరుగుతొంది. ఐతే ఈ విషయంపై ముందే విజయసాయిరెడ్డి నానాయాగీ చేస్తుండటంతొ కాస్త ఊపు తగ్గే అవకాశాలూ ఉన్నాయ్..అఁదుకే ప్రస్తుతానికి జంపింగ్ జపాంగ్ ప్లాన్లకి స్వస్థి చెప్పి..ఇద్దరు కాండిడేట్ల ఎంపికలొ చంద్రబాబు కసరత్తు చేస్తున్నాడట.అందులొ భాగంగానే ఒక సీటు జెపి మరొ సీటు..ఇఁకొ తలపండిన ఇఁడస్ట్రియలిస్ట్‌కి ఇద్దామని డిసైడయ్యారట.

Comments