వీళ్లంతా ఏ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారో తెలుసా


ఇప్పటికే రాజ్యసభలో జరిగిన గొడవతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఎవరు ఎంత అన్యాయం చేసారు..ఎంత అభివృధ్ది చేశారనే కోణంలో విమర్శలు చేసుకుంటున్నారు. ఐతే ఎన్నికలనాటికి ఈ విమర్శలకు సినిమా గ్లామర్ కూడా  తోడు కాబోతోంది..తెలుగు నటులు మాత్రమే కాకుండా..ఇంకా తెలుగులో నటించే నటులు కూడా ఈసారి రాజకీయపార్టీల తరపున ప్రచారమే కాకుండా స్వయంగా పోటీలో దిగబోతున్నారుట..శామ్ గా పిలుచుకునే సమంత..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతుందట.ఇంతకీ ఏ
పార్టీనో తెలుసా..టిఆర్ఎస్..ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం..ఇక్కడ క్రిస్టియన్ ఓటర్లు ఎక్కువ. అందుకే అంతకుముందు వైఎస్సార్ జయసుధని తమ పార్టీ తరపున పోటీలో నిలిపి విజయం సాధించారు. ఇప్పటికే సమంతా చేనేత వస్త్రాలకు తెలంగాణ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే కదా..
అలానే మరో సినిమా లేడీ కూడా తన లక్ టెస్ట్ చేసుకోబోతోంది..ఆమె మంచులక్ష్మీప్రసన్న..చిత్తూరు జిల్లాలోని ఏదోక నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తోందట. దాదాపుగా చంద్రగిరి కానీ..శ్రీకాళహస్తి నుంచి కానీ టిక్కెట్ ఖాయమైందట. వైఎస్ బంధువులతో మంచు మోహన్ బాబుకి ఉన్న చుట్టరికం ఉన్న
సంగతి తెలిసిందే..! అందుకే ఖచ్చితంగా ఈసారి మంచు ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు వైఎస్సార్సీపీ తరపున బరిలో దిగడం ఖాయమట. అలానే రాజశేఖర్, జీవిత కపుల్ కూడా ఈసారి డైరక్ట్ ఎలక్షన్స్‌లో  నిలబడాలని బలంగా కోరుకుంటున్నారు. బిజెపి తరపున జీవిత ఖచ్చితంగా జంటనగరాల్లో  పోటీ చేయడం ఖాయంగా
కన్పిస్తుంది. ఇక కామెడీ పాత్రలు చేసుకుంటున్న హేమ గత ఎన్నికల్లోనే సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసి డిపాజిట్ కోల్పోయింది.  ఇప్పుడదే నియోజకవర్గంనుంచి జగన్ పార్టీ తరపున అదృష్టం పరీక్షించుకోనుందట. మరో వెటరన్ నటి కవిత కూడా అటు బిజెపి కానీ..జగన్ పార్టీనుంచి పోటీ చేసే ఆలోచనలో ఉందట.
ఒకప్పుడు హాట్ లేడీగా పేరుతెచ్చుకున్న వాణీవిశ్వనాధ్ కూడా నగరిలో రోజాపై పోటీకి సై అంటుండగా..టిడిపి టిక్కెట్ ఏమాత్రం దక్కుతుందనేది సందేహం.
గత ఎన్నికలలోనే టిడిపి తరపున రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఫీలైన బూతుజోకుల ఆలీ ఈసారి ఖచ్చితంగా జనసేన నుంచి పోటీ చేస్తాడని టాక్..ఐతే ఇక్కడ షరతులు వర్తిస్తాయ్ ఎందుకంటే ముందు జనసేన పార్టీ పోటీ చేయాలి కదా..ఇప్పుడు మనం చెప్పుకున్నవాళ్లే కాకుండా వేణుమాధవ్, నటుడు శివాజీ రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, సుమన్ కూడా 2019 ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశంతోనే ఉన్నారు..వేణుమాధవ్, శివాజీ ఇప్పటికే జనసేనని దువ్వేపనిలో పడగా..జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ టిడిపికి ప్రచారం చేయడమే కాకుండా పరోక్ష ఎన్నికలకు వెళ్లాలనే వ్యూహంలో ఉన్నట్లు టాక్.  సుమన్ మాత్రం టిఆర్ఎస్ టిక్కెట్ అడుగుతున్నాడు..చూద్దాం వీళ్లలో ఎంతమంది తమ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారో?

Comments