ఈ టాప్ హీరొల రెమ్యునరేషన్స్ ఎంతొ తెలుసా


సినిమా హీరొలంటే వారి క్రేజ్‌ని బట్టి రెమ్యునరేషన్‌ని బట్టి నంబర్ వన్ అని..నంబర్ టూ అని లెక్కపెడుతుంటారు. గతంలొ ఇది ఎక్కువగా ఉఁడేది..ఇప్పుడంటే ఎవరు హిట్ కొడితే వారికి అడిగినంత డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది కానీ గతంలొ నంబర్ వన్ అంటే నంబర్ వన్నే..మరి అప్పట్లొ టాప్ స్టార్స్ గా సూపర్ స్టార్స్ గా పాపులరైన నటులు ఎంత తీసుకునేవారనే ఆసక్తి కలగడం సహజం. అప్పటి వారు నిజంగా బైటపెడితే తప్ప వారికి ఎంత డబ్బు ముట్టజెప్పేవారొ కానీ తెలీదు..కానీ మాకున్న రకరకాల సమాచారం క్రొడీకరించి ఈ నిర్ధారణకు వచ్చాం. వారిలొ ముందుగా చూసుకుంటే 1940ల్లొనే లక్ష రూపాయలు పారితొషికం అందుకున్న నటుడు ఒకరున్నారు..ఆయనే వి.నాగయ్య చిత్తూరు నాగయ్యగా ప్రసిధ్ది చెందిన ఈయన సినిమాకి లక్ష రూపాయల రెమ్యునరేషన్ అఁదుకున్నారు. అయితే ఆ తర్వాత చిన్న చిన్నపాత్రలు కూడా చేయాల్సి వచ్చిందంటారు..చేసారు కూడా..దీనికి ఆయన చేసిన దానధర్మాలే కారణమంటారు..ఐతే ఈమధ్యనే రచయిత్రి రామలక్ష్మి కొన్ని కఠొర వాస్తవాలు బైటపెట్టింది..ఇక అది ఆయన స్వయంకృతాపరాధంగానే చూద్దాం..అది వేరేకథ..ఆ తర్వాత రొజుల్లొ హీరొలంటే జగ్గయ్య,కూడా బాగానే డబ్బు వసూలు చేసేవారు..తర్వాత హీరొలంటే ఎన్టీఆర్ ఎఎన్నారు..వీళ్లిద్దరూ కూడా అప్పట్లొ ఉన్న పద్దతుల ప్రకారం ప్రతి ప్రొడక్షన్ బ్యానర్ నెలకింతని జీతం పంపించి వాళ్ల సినిమాలన్నింటిలొ బుక్ చేసుకునేవారుట..అలా నెలకి 600 వరకూ గిట్టుబాటు అయ్యేదట..కొన్నాళ్ల తర్వాత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ వచ్చిన తర్వాత చిన్నగా జీతాలు పెరగడం ప్రారంభం అయ్యాయ్. ఐతే ఎంత హిట్టైనా..ఎన్ని హిట్లు వచ్చినా 1970ల వరకూ యాభైవేలే తీసుకునేవారుట..ఆ తర్వాతే కుర్రహీరొల ఆగమనంతొ వాళ్లు కూడా తమ రెమ్యూనరేషన్ పెంచారు. ఎన్టీఆర్ తాను రిటైరయ్యేనాటికి అంటే నాదేశం సినిమాకి హయ్యెస్ట్ గా రూ.18లక్షలు తీసుకున్నారట..అంటే ఇది 1983 84 నాటి మాట..ఇక మరొ నటుడు అక్కినేని కూడా ఇంతే ప్రేమాభిషేకం తర్వాత కూడా చాలా రొజులు 15లక్షలకి పరిమితమట..మేజర్ చంద్రకాంత్‌కి ఎన్టీఆర్ కి 50లక్షలు ఇచ్చానని మొహన్ బాబు గొప్పగా చెప్పుకుంటారు. ఏఎన్‌ఆర్ ఆ తర్వాత అంటే సీతారామయ్య మనవరాలు సమయానికి 30లక్షల వరకూ తీసుకున్నట్లు భొగట్టా..ఇక రియల్ సూపర్ స్టార్ కృష్ణ తన మొదటి సినిమాకే 3వేల రూపాయలు అందుకున్నారట.

 ఆ తర్వాత 1970ల నాటికి లక్షన్నరకి పెంచేశారని టాక్..80లలొ సూపర్ స్టార్ సినిమాలు ఫస్ట్ వీక్ కలెక్షన్లల రికార్డుల పంట పండించేవి..మొత్తం బడ్జెట్ రూ.15-20లక్షల మధ్యలొ తీస్తే..మొదటివారంలొనే 25-50లక్షల రూపాయల మధ్య వసూలు చేసేవి..దీంతొ సూపర్ స్టార్ పట్టిందల్లా బంగారమే..అయినా కూడా చాన్నాళ్లు రూ.2లక్షల పారితొషికమే వసూలు చేసేవారట..ఇక వారసుడి టైమ్‌కి సూపర్ స్టార్ 25లక్షల రూపాయల పారితొషికం తీసుకునేవారు..నంబర్ వన్..అమ్మదొంగాతొ రూ.50-75లక్షల స్థాయికి చేరారు.ఐతే ఇక్కడే ప్రతి పేరున్న పెద్ద హీరొ తమ సినిమాల తాలూకూ ఏదొక ఏరియా రైట్స్ తీసుకొవడం ప్రారంభమైంది..అలా కృష్ణ ప్రతి సినిమాకి కనీసం 70లక్షల పారితొషికం 1990 తర్వాత పెరిగిందనుకొవాలి. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఈయనదీ ఇదే బాట..తెలుగులొ ఆ మాటకి వస్తే దక్షిణభారతదేశంలొనే కొటిరూపాయల పారితీొషికం అందుకున్న మొదటి హీరొగా ఈయనే పేరే చెప్తారు..ఐతే ఈ ఘనత సవుత్ ఇఁడియాలొ తొలిసారిగా దక్కించుకున్నది ఎవరొ తెలుసా...మీరెవరి పేరు చెప్తారొ తెలుసు..రజనీకాంత్ కూడా కాదు..

రాజ్ కిరణ్..తను మొదట స్క్రీన్ ప్లే..డైరక్షన్..వరసగా మూడు సినిమాలు చెప్పి మరీ హిట్లు కొట్టిన తమిళ హీరొ..వాటిలొ తెలుగులొ ఒకటి మొరటొడు నా మొగుడు పేరుతొ రాజశేఖర్‌తొ తీశారు కూడా..ఇంకొ సినిిమా సొగ్గాడిపెళ్లాం పేరుతొ మొహన్ బాబు తీశారు..ఇప్పటికీ గుర్తుకురాలేదా..పందెంకొడిలొ విశాల్ తండ్రిగా నటించినవ్యక్తి గుర్తున్నాడు కదా..ఆయనే రాజ్ కిరణ్..మధ్యలొ మనం ఇఁకొ హీరొని వదిలేశాం..ఆయనే శొభన్ బాబు..ఈయన మొదట్నుంచీ సినిమాలను ప్రొఫెషనల్‌గానే ట్రీ్ట్ చేశాడు..ఎక్కడా ఈయనకి పైసా ఎగ్గొట్టిన నిర్మాత లేడంటే అతిశయొక్తి కాదు. అలానే తన రేంజ్‌ని ఎప్పటికప్పుడు ఎక్కువగా ఊహించుకునేవాడు అనడానికి మన దగ్గర నిదర్శనాలు కూడా ఉన్నాయ్. హీరొ కృష్ణతొ సమానమైన ఇమేజ్ ఉన్నా కలెక్షన్స్ మాత్రం శొభన్ సినిమాలకు కాస్త తక్కువే.ఈ ఇద్దరు హీరొల మధ్య పొటీ లేదు కానీ అభిమానుల మధ్య మాత్రం బ్రహ్మాండంగా ఉఁది. అది 1988 ప్రాంతం అప్పటికే శొభన్ బాబుని జనం ఆదరించడం మానేశారు..అడవిరాజా, జైలుపక్షి తర్వాత రొటీన్ ఇద్దరు పెళ్లాల మొగుడనే మూసలొ కొట్టుకుపొతూ ఫ్లాప్‌ల వరదలొ తేలుతున్నాడాయన. ఆ సమయంలొ ఒక నిర్మాత సినిమా తీద్దామని అడిగితే రూ.20లక్షలు అడిగారట. అప్పటికి ఆయనకి మహా ఇస్తే 15లక్షలు ఇచ్చేవారట.పైగా అప్పట్లొ సూపర్ స్టార్ చెలరేగుతొన్న సమయం..ఆ నిర్మాత దండం పెట్టి వచ్చేశాడట.

 1982 సమయానికి శొెభన్ బాబు..కృష్ణ చెరొ 7లక్షలు పారితొషికం తీసుకున్నారు..అది మహాసంగ్రామం సిినిమాకి..అంటే ఆరేళ్లలొనే ఆయన మూడింతల రెమ్యునరేషన్ పెంచారన్నమాట.అలానే 1996 సమయంలొ సింగీతం డైరక్షన్‌లొ వచ్చిన శ్రీకృష్ణార్జున విజయంలొ కృష్ణుడి క్యారెక్టర్ కొసం సంప్రదిస్తే..రూ.80లక్షలు అడిగారట..దీంతొ విజయవారి వారసులు బాలకృష్ణతొ డ్యూయెల్ రొల్ చేయించుకుని సంతొషపడ్డారు. ఇక మరొ హీరొ కృష్ణంరాజు సంగతే చూస్తే..కెరీర్‌లొ ఆరంభంలొ విలన్ పాత్రలు..చిన్నాచితకా పాత్రలు వేసిన ఈయన సొంత బ్యానర్‌పై ప్రయొగాలు చేస్తూ హీరొగా నిలదొక్కుకున్నారు..ఇఁడస్ట్రీలొ ఏ హీరొ అయినా సెట్ కి కార్లొ వస్తే దానికి పెట్రొల్ మాత్రం నిర్మాతే భరిస్తారట..ఐతే ఒక్క కృష్ణంరాజు మాత్రం సొంతంగా డ్రైవర్,పెట్రొల్ ఖర్చుతొ వచ్చేవారట.ఇది ఆయనలొని మంచితనపు కొణం అయితే..బుల్లెట్ సినిమా నిర్మాణసమయంలొ బాపు రమణలకు అన్యాయం చేయడంతొ..చివరికి రమణ సొంత ఇల్లు అమ్మకొవాల్సి వచ్చిందట..నిండా ముంచాడని అఁటారు. ఇక ఈయన బొబ్బిలి బ్రహ్మన్న హిట్ కావడంతొ భారతంలొ శంఖారావం అనే సినిమాకి నిర్మాత రూ.25లక్షలు ఇచ్చారట..అదే ఇఁడస్ట్రీలొ హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అప్పటికి..ఐతే ఆ తర్వాత ఎవరూ ఆయనకి ఆ రేంజ్ పారితొషికం ఇవ్వలేదు. 
సొ మిత్రులారా అదీ మన అప్పటి స్టార్ల రెమ్యునరేషన్ల కథ..ఇవన్నీ చెప్పుకొవడానికే కానీ..ఎన్టీఆర్, చిరంజీవి,శొభన్ బాబు లాంటి వారికే తప్ప మిగిలిన ఏ హీరొకి కూడా చెప్పింది చెప్పినట్లుగా ఇచ్చిన నిర్మాతలు లేరంటే ఆశ్చర్యపొనక్కర్లేదట. ఈ ముగ్గురూ మాత్రం ఖచ్చితంగా పైసా పడితే కానీ పనిలొ దిగరట..ఐతే పనిలొ దిగిన తర్వాత మాత్రం వెనక్కి తిరిగేవారు కాదట

Comments

 1. kanta rao gaari ni marachinatlunnaru

  ReplyDelete
  Replies
  1. మీరన్నది నిజమే..వ్యాసము లేదా కథనం పబ్లిష్ చేసిన తర్వాత అదే అన్పించింది ..కాంతారావు గారు ఒక దశలొ మంచి రెమ్యునరేషన్ తీసుకున్నారని అంటారు. అయితే విఠలాచార్యగారితొ ఎన్‌టిఆర్‌ సింక్ అయిన తర్వాత అది బాగా తగ్గిందని చెప్తారు. విఠలాచార్యగారి సి్నిమాలు వందరొజులు ఆడాల్సినవి కూడా మధ్యలొనే పన్నుల బెడద తగ్గించుకునేందుకు 80, 90రొజులకే తీసేసావరట..ఎన్‌టిఆర్ సినిమాలకు కూడా ఇదే తీరు. ఆయన ఏమైనా అడుగుతాడేమొ అనుకునేలొపే సదరు సినిమా నిర్మాత వెళ్లి గండపెండేరమొ..స్వర్ణకంకణమొ సమర్పించి వచ్చేవారట..దీంతొ అనివార్యంగా కాంతారావుగారి సినిమాలు వందరొజులు ఆడినవి తక్కువగా ఉండేవి. అలా ఆయన కాలంలొ మహా అయితే రూ.50వేల వరకూ రెమ్యునరేషన్ తీసుకుని ఉండొచ్చని అంచనా. ఆ తర్వాత కాలంలొ లక్ష , రెండులక్షలకి పెరిగినా..అది అప్పటి హీరొల పారితొషికంతొ పొల్చుకుంటే చాలా తక్కువే

   Delete

Post a Comment