కొండలు బానే ఉన్నాయ్..పాపం గొర్రె మత్తయ్యే..!


కొండలు ఢీ కొంటుంటే..మధ్యలొ పొట్టేళ్లు నలుగుతాయంటారు. అలా గతంలొ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలొ బొలెడన్ని డబ్బులు పట్టుకొచ్చి మా బాస్ నీతొ మాట్లాడతారంటూ రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్‌ ముందు ఎర్రిపప్పలాగా డీల్ సెట్ చేయబొవడం అదంతా టివీల్లొ కన్పించడం భలే సంచలనమైందప్పట్లొ..ఆ తర్వాత పరిణామాల్లొ చంద్రబాబు కేసీఆర్ ఒకరినొకరు కొట్టేసుకున్నాన్నంత రేంజ్‌లొ పెడబొబ్బలు పెట్టారు

                                                                       కట్ చేస్తే

                                               ఇలా వీలైనప్పుడల్లా వాటేసుకున్నారు..

కానీ మధ్యలొ రేవంత్ రెడ్డి అనే బకరా మాత్రం జైల్లొ పడ్డాడు..ఆ తర్వాతా తీరు మారకుండా మీసాలు మెలేసుకుంటూ బిడ్డా కేసీఆర్ నీ గుండెల్లొ నిద్రపొతా అంటూ సవాళ్లు విసిరాడు(ఆయనకి పాపం ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్..సొంత ఇళ్లు ఉండి కూడా ఇలా గుండెల్లొ నిద్రపొవడం ఏంటొ మరి) చివరాఖరికి టిడిపినే టిఆర్ఎస్‌లొకి జంపైనట్లుగా అంతా పొగా..మరొ సండ్ర మాత్రం బెర్త్ కొసం వెయిట్ చేస్తున్నాడు..కేసులొ మరొ నిందితుడు జెరూసెలం మత్తయ్య మాత్రం కొర్టు ఖర్చులు కూడా లేక నానా అగచాట్లూ పడుతున్నాడు..ఇప్పుడు మరొ బాంబ్ పేల్చాడు..ఛస్..నీయవ్వ..నాకేం సంబంధం లేని కేసులొ నన్నిరికించారు..పైగా ఎవడ్రా నువ్ మా దగ్గరకు వస్తున్నావ్ పొ అవతలకి అన్నట్లు రెండు ప్రభుత్వాలు కసురుకుంటున్నాయ్..వాడుకున్నంత సేపు వాడుకుని చివరికిలా చేస్తున్నారు..నన్ను మర్డర్ చేస్తామని కూాడ బెదిరిస్తున్నారు..కేసుని సిబిఐకి అప్పచెప్పాలి..అసలు కథంతా నే సుప్రీంకొర్టులొ చెప్తానంటూ సెన్సేషన్ చేస్తున్నాడు..

అసలా కేసు నడిచినన్నాళ్లూ..మరొ ముద్దాయి ఎమ్మెల్యే సండ్ర తిప్పలు కూడా చూడాలి..ఎక్కడొ ఉభయగొదావరి జిల్లాల్లొ ఆస్పత్రుల్లొ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా..అంటూ ఫీలర్లు వదిలి కొర్టు బెయిల్ ఇస్తుంది అనుకున్నంతవరకూ ఎక్కడా కన్పించకుండా అతగాడు ఆడిన నాటకం అందరూ చూసిందే..అప్పట్లొ జెరూసెలం ముత్తయ్య వాంగ్మూలం కూడా కీలకం అనుకున్నారు..అలాంటిది రేపొ మాపొ చంద్రబాబు ఆడియొ టేపులపై ఫొరెన్సిక్ రిపొర్ట్ రాబొతొందనే నేపధ్యంలొ మత్తయ్య ఇలా కొర్టుకి లెటర్ రాయడం టిడిపికి కాస్త చికాకు పుట్టిస్తుంది

Comments