వీళ్లకీ డబ్బింగ్ వేరేవాళ్లు చెప్పారంటే నమ్ముతారా


నటుడికి ఆహార్యంతొ పాటు భాషా ముఖ్యమే. అందుకే ఒక్కొ నటుడికి ఒక్కొ రకమైన గాత్రంతొ అలరించారు..తెలుగులొ జగ్గయ్య, ఎస్వీరంగారావ్, గుమ్మడి,సిఎస్సార్, ధూళిపాళ్ల,  పిజెశర్మ, రావుగొపాలరావు, పాపులర్ నటులలొ(కృష్ణ, ఎన్‌టిఆర్,శొభన్ బాబు,,మొహన్ బాబు) అమ్రిష్‌పురి(తెలుగులొనేడబ్బింగ్ చెప్పుకున్నాడు) కొటశ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, సాయికుమార్ ఇలా చెప్పుకుంటూ పొతే చాలామంది తమ విలక్షణమైన స్వరంతొ ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. మరి వారిలొ కొంతమందికి వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పారంటే ఆశ్చర్యం పొందాల్సిందే

వారిలొ మొదటగా ఇదిగొ సూడు సెగట్రీ..ఒరినీ తస్సారాముల బొడ్డు..లాంటి మేనరిజమ్స్ తొ ఆకట్టుకున్న రావుగొపాలరావుకి వేరే గొంతు ఊహించగలమా..కానీ ఆయన మొదటి సినిమా జగత్ కిలాడీలు..దీంట్లొ్ ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్ రావుగొపాలరావుదే..ఐతే డబ్బింగ్ మాత్రం వేరేవాళ్లది. మరి అలానే మనొళ్లంతా గుండెపొటు గుమ్మడి అఁటూ ఎగతాళి చేసే మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారిది కూడా ప్రత్యేకమైన స్వరం..ఆయనకి కూడా ఆరొగ్యం బాగొలేని సమయంలొ నటించిన సినిమా ఆయనకి ఇద్దరు..అఁదులొ నూతన్  ప్రసాద్ చేత వాయిస్ చెప్పించారు..అది చాలా ఛండాలంగా ఉందని అప్పట్లొనే  విమర్శలు రావడంతొ ఇక పాత్రలకి దూరమయ్యారు ఆయన. ఇక కెరీర్ బిగినింగ్‌లొ జగపతిబాబుకి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం..ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. అడవిలొ అభిమన్యుడు..పెద్దరికం ఇందుకు నిదర్శనం..పాపం అప్పట్లొ ఎస్పీనే ఇఁత మంచి స్వరం పెట్టుకుని ఎందుకు డబ్బింగ్ చెప్పించుకుంటున్నారని పట్టుబట్టేవారట..అలా గాయం సిినిమా హిట్టవ్వడంతొ జగ్గూకి ఇక వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పడం ఆగిపొయింది..ప్రకాష్ రాజ్ తెలుగులొ మొదటి సిినిమా సంకల్పం..ఇందులొ జగపతిబాబు హీరొ..అదే కాదు..ఆ తర్వాత వచ్చిన స్నేహం కొసంలొ కూడా రవిశంకర్‌తొనే డబ్బింగ్ చెప్పించారు. ఇక సాయికుమార్‌కి కూడా రాజశేఖర్, సుమన్‌తొ నటించిన సినిమాలకు వేరేవాళ్లతొ డబ్బింగ్ చెప్పించేవారు. చివరిగా మరొ కొసమెరుపుతొ ముగిద్దాం..ఎర్ర సినిమాల హీరొ ఆర్.నారాయణమూర్తి ఇప్పుడంటే సొంత గొంతుతొ ప్రేక్షకులమీదకు రంకెలతొ విరుచుకుపడుతున్నాడు కానీ..ఆయన హిట్ సిినిమాల్లొ విన్పించే గొంతు ఆయనది కాదు..డబ్బింగ్ ట్రైనర్ కమ్ ఆర్టిస్ట్ జి.సాయిభాస్కర్‌ది..అదీ డబ్బింగ్ కథ



Comments