అబ్బబ్బా..శివప్రసాద్ ఈ కామెడీ భరించలేం..బాబుపై జోక్ వేశావా..నిజంగానే నీ ఫీలింగా


టిడిపి ఎంపిలలో చిత్తూరు ఎఁపి శివప్రసాద్ తీరే వేరు. గత ఐదారేళ్లుగా పార్లమెంట్ సెషన్లుగా నిరసన అనే మాట విన్పించిందంటే చాలు హ్యాపీగా ఫీలయ్యేవాళ్లలో ఈయనే ముందు ఉంటాడనుకోవచ్చు. ఎందుకంటే రోజుకో వేషం వేసి టివి గొట్టాల దృష్టిని ఆకర్షించవచ్చు. ఎన్టీఆర్  సినిమాల్లో ఎన్ని గెటప్స్ వేసారో..వాటిని మించి వేషాలు వేశాడీయన. ఇప్పుడు కూడా బడ్జెట్ సెషన్స్‌పై ఏపీకి అన్యాయం జరిగిందంటూ టిడిపి ఎంపిలు చేస్తోన్న ప్రదర్శనలో ఈయనే స్పెషల్ ఎట్రాక్షన్


ఇప్పటికే తెలుగు పత్రికలు..ఛానళ్లలో బాబు కన్నెర్ర చేస్తే అదైపోద్ది..ఇదైపోద్ది అంటూ కథనాలు వండి వార్చుతుంటే అవన్నీ చూసి నిజం అనుకున్నాడో లేక తానూ ఓ మాట తోడేస్తే సరిపోద్దనుకున్నాడో మరి..మా బాబుకి ఆగ్రహం వస్తే భూమండలమే కంపించిపోతుందంటూ కామెంట్ చేశాడు. ఈయనైతే ఇలా అంటున్నాడు కానీ..ఇంతవరకూ చంద్రబాబు ఎక్కడా బహిరంగంగా తన అసంతృప్తిని ఒక్క మాటరూపంలో కూడా బైటపెట్టలేదు. ఇన్ డైరక్ట్‌గా మాట్లాడుకున్నంత మాత్రాన ఒరిగేదేంలేదు..పైగా ప్రతిపక్షనేత జగన్ డ్రామాని బైటపెట్టాలి..ప్రతిపక్షనేత వైఖరిని నిలదీయాలి అంటూ వింత వాదన చేయడం విశేషం. ఇలాంటి ఆడలేక మద్దెల యవ్వారాలే టిడిపి
కొంపముంచుతాయేమో అని కార్యకర్తలు ఇప్పటికే గుసగుసలు ఆడుతున్నారు.

అలుగుటయే ఎరగని ధర్మరాజు అలిగిన రోజు అనే భారతంలోని పద్యం గుర్తొచ్చే రేంజ్‌లో చెప్పడానికి చంద్రబాబు బొంకడం రాని బొమ్మేం కాదు. ఒక్క ప్రత్యేక హోదా అంశంలోనే ఎన్నిసార్లు మాటలు మార్చాడో అందరికీ తెలుసు. అలాంటిది ఇప్పుడు మా బాబు మంచోడు..లేస్తే మనిషి కాడు అని హాస్యవచనాలు పలకడం ఎందుకంట..పైగా ఈ మధ్యనే శివప్రసాద్ కూడా పార్టీ మారతాడనే ప్రచారం జరిగింది. ఆ ఎపిసోడ్ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికే శివప్రసాద్ ఇలా చిందులు తొక్కుతున్నాడా అని డౌట్ రాకమానదు

Comments