శ్రీదేవికీ జయప్రదకి చెడిపోవడానికి కారణం ఇదే


శ్రీదేవి..జయప్రద ఇద్దరూ టాప్ స్టార్లే..తెలుగులో సమానమైన స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ ఇద్దరూ హిందీలో దాదాపుగా ఒకే సమయంలో ప్రవేశించారు. ఐతే శ్రీదేవి సూపర్ స్టార్ అవగా..జయప్రద మాత్రం కొద్ది రోజులు మాత్రమే టాప్ హీరోయిన్ గా మనగలిగింది. ఐతే ఈ ఇద్దరూ కలిసి ఎన్ని సినిమాల్లో నటించినా కూడా ఇద్దరికీ పడేది కాదు. తెరమీద అన్యోన్యంగా నటించే ఈ ఇద్దరు హీరోయిన్లు అస్సలు మాట్లాడుకోరంటే అప్పుడే కాదు ఇప్పుడూ  ఆశ్చర్యమే. దీనికి కారణాలు కావాలంటే కనీసం ముఫ్పై ఏళ్లు వెనక్కి వెళ్లాలి. శ్రీదేవి అప్పుడే తెలుగు తమిళంలో పేరు తెచ్చుకుంటోన్న నటి. తనకి బాగా కలిసి వచ్చిన సినిమా పదహారేళ్ల వయసు ని హిందీలోనూ 1978లో తీశారు. అమోల్ పాలేకర్ అందులో చంద్రమోహన్ చేసిన క్యారక్టర్ చేశాడు..సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఏడాదే 1979లో సర్‌గమ్ అనే సినిమాతో జయప్రద హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఆమెకి పేరు తెచ్చిన సిరిసిరిమువ్వ రీమేక్ కావడం విశేషం. ఇందులో హీరో రిషి కపూర్..ఈ సినిమా బంపర్ హిట్ట్ కాకపోయినా..ఓ మాదిరి సక్సెస్ సాధించింది. దీంతో ఈ ఇద్దరు హీరోయిన్లలో జయప్రదదే పై చేయి అయింది

ఆ తర్వాత 1983లో హిమ్మత్ వాలా, మవాలి, జస్టిస్ ఛౌదురి అనే మూడు సినిమాల్లో నటించింది శ్రీదేవి..ఈ మూడూ సూపర్ స్టార్ కృష్ణ సొంత సంస్థ పద్మాలయా స్టూడియోస్ నిర్మించినవి..ఈ మూడూ సూపర్ హిట్టే..దీంతో ఒక్కసారిగా శ్రీదేవి ఆలిండియా స్టార్ అయిపోయింది. సరిగ్గా ఈ సమయంలోనే జయప్రద రేస్ లో వెనకబడినట్లైంది. దీంతో ఒకానొక సందర్భంలో జయప్రద నేను పుట్టడంతోనే అందంగా పుట్టాను. శ్రీదేవి ప్లాస్టిక్ సర్జరీతో అందం తెచ్చుకుంది.
ఆమెతో నాకేంటి పోలిక అని మాట్లాడింది. ఈ మాటలు ఆ నోటా ఈ నోటా శ్రీదేవికి చేరాయ్. ఇక అప్పట్నుంచీ వీళ్లిద్దరూ కలిసి అటు తెలుగు, హిందీ సినిమాల్లో నటించినా కూడా కోల్డ్ వార్ నడిచేది. ఈ ఇద్దరిని కలపాలని కొంతమంది ట్రై చేసినా కూడా కుదరలేదట. వెటరన్ యాక్టర్ జితేంద్ర తోఫా సినిమా షూటింగ్ సమయంలో మేకప్‌రూమ్‌లో ఈ ఇద్దరినీ ఉంచి బైట గడి పెట్టాడట. కాసేపాగి చూస్తే..ఎవరికి వారే గోళ్లు గిల్లుకుంటూ ఉన్నారట కానీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడుకున్న దాఖలా లేదట.

 ఐతే ఇంత విబేధాలు ఉన్నా ఈ ఇద్దరూ తెరపై మాత్రం అత్యంత సన్నిహితులుగా..అక్కాచెల్లెళ్లుగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి. చివరికి ఈ ఇద్దరి వైరం రెండున్నరేళ్ల క్రితం జయప్రద చెల్లి కొడుకు పెళ్లి తీర్చింది. సిధ్దార్ధ అనే ఆ కుర్రాడిపెళ్లికి శ్రీదేవి బోనీకపూర్ ఇద్దరూ రావడంతో వీరిద్దరూ కాస్త సన్నిహితం అయినట్లు అన్పించిందంటారు. ఇంత నిశ్సబ్దయుద్దం నడిచినా..ఈ ఇద్దరూ ఈ పాతికేళ్లలో ఎక్కడా ఒకరిపై ఒకరు నోరు తూలిన సందర్భాలు లేకపోవడం గమనార్హం.

Comments